Rohit Sharma Srilanka tour: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ త్వరలో ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటనలో ఆడనున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్‌కప్ తర్వాత పనిభారం కారణంగా రోహిత్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. అయితే 2025 ఛాంపియన్స్ ట్రోఫీలోపు టీమ్ఇండియా 6వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడనుంది. అందుకే రోహిత్ లంక సిరీస్‌లో ఆడాలని హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నాడట. అయితే లంకతో వన్డే సిరీస్ ఆడేందుకు హిట్‌మ్యాన్ కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
కెప్టెన్ అతడే! అయితే రోహిత్ శర్మ ప్రస్తుతం కుటుంబంతో కలిసి అమెరికా ట్రిప్‌లో ఉన్నాడు. ఈ నెలాఖరుకల్లా శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం భారత్ రానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రోహిత్ శర్మ శ్రీలంక సిరీస్ ఆడినట్లైతే టీమ్ఇండియాను అతడే నడిపించడం ఖాయం. ఇక కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కూడా శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో రోహిత్ ఆడకపోతే, కేఎల్ రాహుల్ టీమ్ఇండియాకు కెప్టెన్‌గా ఎంపిక అయ్యే అవకాశం ఉంది. కాగా, ఇక ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య వన్డే సిరీస్‌కు దూరంగా ఉంటాడని సమాచారం. ఈ విషయాన్ని హార్దిక్ ఇప్పటికే బీసీసీఐకి చెప్పాడట.
ఆ ఇద్దరికి రెస్ట్! కాగా, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా ఈ పర్యటనకు దూరంగానే ఉండే ఛాన్స్ ఉంది. విరాట్ ప్రస్తుతం ఫ్యామిలీతో లండన్‌లో ఉంటున్నాడు. మరోవైపు బుమ్రా కూడా కుంటుంబంతో సమయం గడుపుతున్నాడు. వీరు సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌తోనే మళ్లీ జట్టులో రీ ఎంట్రీ ఇస్తారు.
సూర్యవైపే మొగ్గు! అయితే టీమ్ఇండియా టీ20 కెప్టెన్ రేస్‌లో సుర్యకుమార్ కూడా ఉన్నట్ల తెలుస్తోంది. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు పాండ్యను కాకుండా సూర్యకుమార్‌కే జట్టు పగ్గాలు అప్పజెప్పడానికి సెలక్షన్ కమిటీ మొగ్గు చూపుతుందని టాక్. హార్దిక్ పాండ్య ఫిట్ నెస్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కెప్టెన్‌గా పాండ్యకు అపార అనుభవం ఉంది. కాబట్టి టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. శ్రీలంక సిరీస్‌కు టీమ్ఇండియా జట్లను త్వరలో ప్రకటించనుంది. కాగా భారత్ జులై ఆఖరి వారంలో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో లంకతో టీమ్ఇండియా 3 టీ20లు, 3 వన్డేల్లో తలపడనుంది.
Updates on team India (Cricbuzz):
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 17, 2024
- Rohit Sharma likely to make himself available for Sri Lanka ODIs.
- Shreyas Iyer and KL Rahul set to return.
- Kohli and Bumrah unlikely to feature.
- If Rohit doesn't play, KL likely candidate for captaincy. pic.twitter.com/MyXVryj8x0
భారత్ x శ్రీలంక - టీ20, వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే
శ్రీలంక మాజీ క్రికెటర్ మృతి - భార్యాపిల్లల ఎదుటే దారుణ హత్య