Ind vs Ban Test Series 2024: టీమ్ఇండియా స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు సిద్ధం అవుతోంది. ఈ సిరీస్‌లో బంగ్లాతో భారత్ రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 19న తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు చెన్నై చెపాక్ స్టేడియం వేదిక కానుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా ప్లేయర్లంతా చెన్నై చేరుకొని ఇప్పటికే నెట్స్‌లో ప్రాక్టీస్ ప్రారంభించేశారు. అయితే స్టార్లు బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ ఓ అరుదైన రికార్డుకు అతి చేరువలో ఉన్నారు. ఈ సిరీస్‌లోనే వాళ్లిద్దరూ ఆ ఘతన అందుకునే ఛాన్స్ ఉంది. మరి అదేంటంటే?
Bumrah International Wickets : 2016లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన బుమ్రా అప్పట్నుంచి టీమ్ఇండియాకు కీలకంగా మారాడు. మూడు ఫార్మాట్లలోనూ టీమ్ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 195 మ్యాచ్‌ల్లో 397 వికెట్లు పడగొట్టాడు. మరో 3 వికెట్లు పడగొడితే 400 క్లబ్లో చేరతాడు. ఈ క్రమంలో ఈ ఫీట్ సాధించిన 10వ భారత బౌలర్‌గా బుమ్రా నిలుస్తాడు.
Kuldeep International Wickets :చైనామెన్ కుల్గీప్ యాదవ్ కూడా ఓ రేర్ ఫీట్‌కు దగ్గరలో ఉన్నాడు. 2017లో ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చిన అతడు టీమ్ఇండియాకు స్పిన్ విభాగంలో కీలకంగా మారాడు. కుల్దీప్ ఇప్పటివరకు అంతర్జాతీయంగా 294 వికెట్లు పడగొట్టాడు. అందులో 53 (టెస్టు), 172 (వన్డే), 69 (టీ20)ల్లో సాధించాడు. మరో 6 వికెట్లు పడగొడితే కుల్దీప్ 300 వికెట్ల క్లబ్లో చేరిపోతాడు. అయితే టీమ్ఇండియా తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన లిస్ట్‌లో అనిల్ కుంబ్లే టాప్‌లో ఉన్నాడు. కుంబ్లే 401 మ్యాచ్‌ల్లో 953 వికెట్లు పడగొట్టాడు.
అంతర్జాతీయ వికెట్లు (మూడు ఫార్మట్లలో కలిపి)
1 | అనిల్ కుంబ్లే | 401 మ్యాచ్‌లు | 953 వికెట్లు |
2 | రవిచంద్రన్ అశ్విన్ | 281 మ్యాచ్‌లు | 744 వికెట్లు |
3 | హర్భజన్ సింగ్ | 364 మ్యాచ్‌లు | 707 వికెట్లు |
4 | కపిల్ దేవ్ | 356 మ్యాచ్‌లు | 687 వికెట్లు |
5 | జహీర్ ఖాన్ | 303 మ్యాచ్‌లు | 597 వికెట్లు |
10 | జస్ప్రీత్ బుమ్రా | 195 మ్యాచ్‌లు | 397 వికెట్లు |
13 | కుల్దీప్ యాదవ్ | 158 మ్యాచ్‌లు | 294 వికెట్లు |
బంగ్లాతో తొలి టెస్టుకు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.
Preps in full swing here in Chennai! 🙌
— BCCI (@BCCI) September 14, 2024
Inching closer to the #INDvBAN Test opener ⏳#TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/F9Dcq0AyHi
ఆల్‌టైమ్ రికార్డ్‌పై రోహిత్ కన్ను - టీమ్ఇండియాలో ఒకే ఒక్కడు! - IND vs BAN 2024
సచిన్ రికార్డుపై విరాట్ కన్ను- బంగ్లా సిరీస్‌లో బ్రేక్ అవ్వడం పక్కా! - Virat Kohli Records