Team India Best Fielder : టీమ్ ఇండియాలో టాప్ ఫీల్డర్లు చాలా మందే ఉన్నారు. కానీ భారత్ ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ మనసులో ఎవరున్నారో తెలుసా? కెనడా మ్యాచ్‌కి ముందు బెస్ట్ ఫీల్డర్ ఎవరనే? ప్రశ్నకు అతను చెప్పిన యూనిక్ ఆన్సర్ ఇదే.
"ఇది కష్టమైన ప్రశ్న, అంతే కష్టమైన రెస్పాన్స్. ఒక గ్రూప్‌గా మేం, అద్భుతంగా పర్‌ఫార్మ్ చేశాం. ముఖ్యంగా బౌలర్లు అద్భుతంగా రాణించడం ఉత్సాహాన్నిస్తుంది. జడేజా, కోహ్లి, రోహిత్ అందరూ అద్భుతమైన ఫీల్డర్లు, అయినప్పటికీ, బౌలర్లు సమర్ధవంతంగా ఆడటం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు, రోహిత్ శర్మకు అనువైన ప్రదేశాల్లో స్కిల్‌ఫుల్ ఫీల్డర్స్‌ని కన్సిస్టెంట్‌గా ఉంచే ఫ్లెక్సిబిలిటీ వస్తుంది." అని అన్నాడు. టీమ్ ఇండియా సక్సెస్ క్రెడిట్‌ను ఆయన బౌలర్లకు ఇచ్చాడు.
భారత జట్టులో మార్పులు?
టీ20 వరల్డ్ కప్ 2024లో టీమ్ ఇండియా సూపర్ 8కి క్వాలిఫై అయింది. ఆడిన 3 మ్యాచుల్లో గెలిచి, 6 పాయింట్స్‌తో టేబుల్ టాప్ పొజిషన్లో కొనసాగుతోంది. ఈ రోజు 15న లాడర్‌హిల్‌లో టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన కెనడాతో లాస్ట్ గ్రూప్ మ్యాచ్ ఆడబోతోంది. అయితే భారత్ ఇప్పటి వరకు సాధించిన విజయాల్లో బౌలింగ్ కీలక పాత్ర పోషించింది. బౌలర్స్ అద్భుతంగా పర్‌ఫార్మ్ చేయడంతోనే, ఇండియా తక్కువ పరుగులను కూడా కాపాడుకోగలిగింది.
కెనడాతో జరగనున్న మ్యాచ్‌లో టీమ్ ఇండియా తమ స్ట్రాటజీని ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. రానున్న సూపర్ 8 రౌండ్‌కి తగిన వ్యూహాలను ట్రై చేసే సూచనలు కనిపిస్తున్నాయి. టోర్నీలో ఓపెనర్‌గా వస్తున్న విరాట్ కోహ్లి పెద్దగా రాణించలేదు. ఐర్లాండ్, పాకిస్థాన్, యుఎస్‌ఎ మ్యాచుల్లో వరుసగా 1, 4, 0 పరుగులకే ఔట్ అయ్యాడు. ఈ రోజు కెనడా మ్యాచ్‌లో కోహ్లి ఫామ్ అందుకోవాలని అందరూ ఆశిస్తున్నారు. కీలక సూపర్ 8 స్టేజ్‌లో కోహ్లీ పాత్ర కీలకం అవుతుంది.
కోహ్లి ఓపెనర్‌గా ఫెయిల్ అయితే, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. కోహ్లిని 3వ స్థానానికి పరిమితం చేసి, ఓపెనర్‌గా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్‌కి ఛాన్స్ ఇవ్వొచ్చు. సూపర్ 8 మ్యాచుల్లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు జైస్వాల్ ఇన్నింగ్స్ ఓపెన్ చేయవచ్చు. ఓ బ్యాటర్ లేదా ఆల్‌రౌండర్ బయటకు వెళ్లాల్సి వస్తుంది.
ట్రెంట్ బౌల్ట్ షాకింగ్ డెసిషన్- ఇదే లాస్ట్ వరల్డ్‌కప్ అంట!
అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి- పాకిస్థాన్ ప్లాన్ బోల్తా కొట్టిందిగా! - T20 World Cup 2024