ETV Bharat / sports

సౌతాఫ్రికా బతికిపోయింది - ఉత్కంఠ పోరులో బంగ్లాపై విజయం - T20 Worldcup 2024 - T20 WORLDCUP 2024

T20 Worldcup 2024 South Africa vs Bangladesh : టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్​లో బంగ్లాపై సౌతాఫ్రికా విజయం సాధించింది. పూర్తి వివరాలు స్టోరీలో.

Source ANI news
T20 Worldcup 2024 South Africa vs Bangladesh (Source ANI news)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 11, 2024, 6:45 AM IST

T20 Worldcup 2024 South Africa vs Bangladesh : టీ20 వరల్డ్ కప్​ 2024లో బౌలర్ల జోరు కొనసాగుతోంది. చిన్న స్కోర్లను కూడా కాపాడుకుని జట్లు విజయాన్ని అందుకుంటున్నాయి. దాయాది పాక్​ జట్టుపై టీమ్​ఇండియా 119 పరుగులను కాపాడుకుంటే, బంగ్లాపై సౌతాఫ్రికా 113 పరుగులే చేసి గట్టెక్కేసింది. అయితే గొప్ప బౌలింగ్‌ ప్రదర్శనతో సఫారీ జట్టును కట్టడి చేసిన బంగ్లా, విజయానికి చేరువగా వెళ్లి చివర్లో తడబడి ఓటమిని అందుకుంది.

టీ20ల్లో సౌతాఫ్రికాపై మొదటిసారి విజయం సాధించే సువర్ణావకాశాన్ని బంగ్లాదేశ్‌ మిస్ చేసుకుంది. 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక ఆఖర్లో చతికిలపడింది. ఫలితంగా 4 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలిచి ఊపిరిపీల్చుకుంది. ఈ విజయంతో గ్రూప్ డీలో దక్షిణాఫ్రికా ప్రస్తుతం మూడు విజయాలు, ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. సూపర్‌-8లోనూ దాదాపుగా చోటు ఖాయం చేసుకునేందుకు సిద్ధంగా ఉంది.

సోమవారం జరిగిన ఈ మ్యాచ్​లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణతీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 113 పరుగులే చేసింది. బంగ్లా బౌలర్లు తంజిమ్‌ హసన్‌ (3/18), తస్కిన్‌ అహ్మద్‌ (2/19) విజృంభించారు. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ క్లాసెన్‌ (46; 44 బంతుల్లో 2×4, 3×6), మిల్లర్‌ (29; 38 బంతుల్లో 1×4, 1×6), డికాక్‌ (18) రాణించారు.

అనంతరం దక్షిణాఫ్రికా సూపర్‌ బౌలింగ్‌తో స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంది. ఛేదనలో బంగ్లా తడబడింది. 7 వికెట్లకు 109 పరుగులే చేసింది. హృదోయ్‌ (37) టాప్‌ స్కోరర్​గా నిలిచాడు. మహ్ముదుల్లా (20) పరుగులు చేశాడు. కేశవ్‌ మహరాజ్‌ (3/27), రబాడ (2/19), నోకియా (2/17) ఆ జట్టును దెబ్బతీశారు.

ఆఖర్లో తడబాటు - బంగ్లా టాప్ ఆర్డర్​ విఫలమవ్వడం వల్ల 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో తౌహీద్‌ హృదోయ్ జట్టును విజయం వైపు నడిపించేందుకు ట్రై చేశాడు. అతడికి మహ్ముదుల్లా సహకరించాడు. ఇద్దరూ వీలైనప్పుడల్లా బౌండరీలను బాదుతూ స్కోర్​ బోర్డును ముందుకుతీసుకెళ్లారు. కానీ 18వ ఓవర్‌లో రబాడ 2 పరుగులే ఇచ్చి జోరు మీదున్న హృదోయ్​ను ఔట్​ చేయడంతో మ్యాచ్‌ను మలుపు తిరిగింది. ఇక చివరి ఓవర్‌లో 11 పరుగులు చేయాల్సి రాగా, స్పిన్నర్‌ కేశవ్‌ రెండు వికెట్లు తీసి 6 పరుగులే ఇచ్చాడు. దీంతో బంగ్లాకు నిరాశ తప్పలేదు.

గ్రూప్ - A 'సూపర్‌ - 8' అవకాశాలు ఎలా ఉన్నాయంటే? - T20 WorldCup 2024

భారత్​కు హోమ్ గ్రౌండ్​గా లాహోర్​ - గట్టి బందోబస్తుతో! - Champions Trophy 2025

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.