T20 WorldCup Top Five Wicket Takers : కీలక క్రికెట్ టోర్నీ మొదలయ్యే ముందు అందరి దృష్టి గత రికార్డుల మీదకు వెళ్తుంది. ఈ సారి బద్ధలయ్యే రికార్డులు, టాప్ పర్ఫార్మెర్లపై అంచనాలు వినిపిస్తుంటారు. అయితే జూన్ 2 నుంచి యూఎస్‌ఏ, కెనడా మ్యాచ్‌తో 2024 టీ20 వరల్డ్ కప్‌కి తెర లేవనుంది. బ్యాటర్లదే ఆధిపత్యంగా మారిన టీ20 ఫార్మాట్‌లో కొందరు బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. ఇప్పటి వరకు టీ20 ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ ఫైవ్ బౌలర్ల గురించి ఇప్పుడు చూద్దాం. కానీ ఈ లిస్టులో ఒక్క టీమ్ ఇండియా బౌలర్ కూడా లేకపోవడం గమనార్హం.
- అజంతా మెండిస్
శ్రీలంకకు మిస్టరీ స్పిన్నర్ అజంతా మెండిస్ టీ20 ప్రపంచకప్‌లో అద్భతంగా రాణించాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. మెండిస్ 21 మ్యాచుల్లో 35 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ 6.7 మాత్రమే కావడం గమనార్హం.
- సయీద్ అజ్మల్
పాకిస్థాన్ మాజీ ఆఫ్ స్పిన్నర్ అజ్మల్ లిస్టులో నాలుగో స్థానంలో నిలిచాడు. అతను టీ20 వరల్డ్ కప్‌లో మొత్తం 23 మ్యాచుల్లో 36 వికెట్లు పడగొట్టాడు. ఈ స్థాయిలో రాణించిన అజ్మల్, తన బౌలింగ్ యాక్షన్‌పై వచ్చిన కాంట్రవర్సీలతో కెరీర్ కోల్పోయాడు.
- లసిత్ మలింగ
శ్రీలంక మాజీ బౌలర్ లసిత్ మలింగ మూడో స్థానంలో ఉన్నాడు. అతను మినీ ప్రపంచ కప్‌లో మొత్తం 31 మ్యాచుల్లో 38 వికెట్లు పడగొట్టాడు. టోర్నమెంట్‌లో ఐదు వికెట్లు ప్రదర్శించిన అతికొద్ది మంది బౌలర్లలో మలింక ఒకడు.
- షాహిద్ అఫ్రిది
పాకిస్థాన్‌కు చెందిన మాజీ ఆల్ రౌండర్ అఫ్రిది లిస్టులో రెండో స్థానంలో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో మొత్తం 34 మ్యాచుల్లో 6.71 ఎకానమీతో 39 వికెట్లు పడగొట్టాడు. ఈ లెగ్-స్పిన్నర్ తన బౌలింగ్‌తో పాకిస్థాన్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
- షకీబ్ అల్ హసన్
బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్, 47 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు 36 మ్యాచుల్లో 6.78 ఎకానమీతో 47 వికెట్లు తీశాడు. అతను వెస్టిండీస్ పిచ్‌లపై ఏడు మ్యాచుల్లో ఏడు వికెట్లు తీయగా, యూఎస్‌ఏలో ఐదు మ్యాచుల్లో నాలుగు వికెట్లు తీశాడు. ఈ స్టార్ ఆల్‌రౌండర్‌కి ఇది చివరి టీ20 వరల్డ్ కప్ కావచ్చు.
ప్రస్తుతం రవిచంద్రన్ అశ్విన్ 24 మ్యాచుల్లో 32 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు. అయితే టీ20 వరల్డ్ కప్ 2024కి రవిచంద్రన్ అశ్విన్ ఎంపిక కాలేదు.
అన్ని టోర్నీల్లోనూ భాగమైన ఆ ఇద్దరు ప్లేయర్స్ ఎవరంటే? - T20 World cup 2024
ఫాఫ్ డుప్లెసిస్‌కు గుడ్ బై - ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ!