ETV Bharat / sports

విరాట్ సంగతేంటి!! సూపర్-8కు ముందు మార్పులు తప్పవా? - T20 Worldcup 2024 - T20 WORLDCUP 2024

T20 Worldcup 2024 Canada VS Teamindia Kohli : ఓటమే లేకుండా దూసుకుపోతున్న టీమిండియా గ్రూపు దశలోని తమ చివరి మ్యాచ్‌లో మార్పులు చేసే అవకాశముంది. పూర్తి వివరాలు స్టోరీలో

T20 Worldcup 2024 Canada VS  Teamindia Kohli
T20 Worldcup 2024 Canada VS Teamindia Kohli (T20 Worldcup 2024 Canada VS Teamindia Kohli)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 15, 2024, 9:20 AM IST

T20 Worldcup 2024 Canada VS Teamindia Kohli: టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా ఓటమే లేకుండా ముందుకెళ్తోంది. వరుసగా మూడు గేమ్‌లు ఆడి గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో టాప్‌గా నిలిచింది. అదే ఉత్సాహంతో ఇక ఫ్లోరిడా వేదికగా చివరిదైన నాలుగో మ్యాచ్‌ను కూడా విజయవంతంగా ముగించాలని ఎదురుచూస్తోంది. వెస్టిండీస్​కు వెళ్లి సూపర్-8 మ్యాచ్‌లు ఆడటానికి ముందు కెనడాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు కోహ్లీ ప్రదర్శనపైనే ఉన్నాయి.

ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో టాప్ పెర్‌ఫార్మర్‌గా నిలిచి ఆరెంజ్ కప్ అందుకున్నాడు విరాట్ కోహ్లీ. దీంతో అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ టీ20 వరల్డ్ కప్​లో స్కోరు బోర్డను పరుగులు పెట్టిస్తాడని భావిస్తే, ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచ్‌లు మొత్తం కలిపి చేసింది 5 పరుగులు మాత్రమే. మరోవైపు రోహిత్, పంత్, సూర్యకుమార్, శివమ్ దూబెలు చక్కటి ఇన్నింగ్స్ కనబరుస్తున్నారు.

ఐర్లాండ్‌పై రోహిత్ హాఫ్ సెంచరీ చేస్తే, యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ చేశాడు. ఇక ఐర్లాండ్, పాకిస్థాన్​తో మ్యాచ్‌లలో పంత్ వరుసగా 36, 42పరుగులతో బాధ్యత నిలబెట్టుకున్నాడు. యూఎస్ఏతో మ్యాచ్‌లో దూబె కూడా పరవాలేదనిపించాడు. ఈ హిట్టర్లందరిలో ఇక ఫామ్ అందుకుని చెలరేగాల్సిందే కోహ్లీ ఒక్కడే. వరుసగా విఫలమవుతున్న కోహ్లీకి పడి లేవడం కొత్త కాదు. అదే జరిగి కెనడాతో మ్యాచ్‌లో తిరిగి ఫామ్ అందుకుంటే రోహిత్‌తో కలిసి మెరుపు ఇన్నింగ్స్ కనబరుస్తాడు. అయితే అంతకంటే ముందే కోహ్లీ ఓపెనర్‌గా కాకుండా వన్ డౌన్‌లో దించాలని టీం ప్లాన్ చేస్తే, యశస్వీ జైస్వాల్ ఓపెనర్‌గా ఆడతాడు. అప్పుడు దూబె స్థానం కోల్పోవాలి.

సూపర్ పేస్ - టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా ఫేవరేట్‌గా బరిలోకి దిగడానికి బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా ఒక కారణం. పేసర్లు అయిన బుమ్రా (5 వికెట్లు), అర్ష్‌దీప్ సింగ్ (7 వికెట్లు), హార్దిక్ పాండ్యా (5 వికెట్లు)తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నారు. అటు బ్యాటింగ్‌లో విరాట్ నిరాశపరుస్తుంటే, ఇటు బౌలింగ్‌లో సిరాజ్ వికెట్ల వేటలో వెనుకబడి ఉన్నాయి. స్పిన్నర్లు అయిన అక్షర్, జడేజా ఇంకా ఖాతా తెరవకపోవడంతో ఈ మ్యాచ్ కోసం టీమిండియా స్పిన్ విభాగంలో మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. కుల్దీప్, చాహల్ లో ఒకరు తుది జట్టులో కనిపించొచ్చు. సూపర్-8కు వెళ్లే ముందు స్పిన్నర్లను పరీక్షించడానికి కూడా అలా చేయొచ్చు. కాగా, ఇప్పటికే సూపర్-8 రేసు నుంచి నిష్క్రమించిన కెనడా చివరిదైన నామమాత్రపు మ్యాచ్‌లో తమ సత్తా నిరూపించుకునేందుకు ఎదురుచూస్తుంది.

వర్షం రాకుంటేనే - తుపాను కారణంగా లాడర్‌హిల్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మియామిలో వరదలు ముంచెత్తాయి. మ్యాచ్ జరగనున్న బ్రోవార్డ్ కౌంటీలోనూ ఇదే పరిస్థితి. వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసేందుకు 86 శాతం అవకాశముందని చెప్తున్నారు. మంగళవారం ఇదే వేదికగా జరగాల్సి ఉన్న నేపాల్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ కూడా రద్దు అయింది. శుక్రవారం అమెరికా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ ది కూడా అదే పరిస్థితి. దీంతో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ కే మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది.

తుది జట్లు: భారత్:రోహిత్ (కెప్టెన్), కోహ్లీ, పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్యా, కుల్దీప్, చాహల్, బుమ్రా, అర్ష్‌దీప్, సిరాజ్ కెనడా: సాద్ బిన్ జాఫర్ (కెప్టెన్), ఆరోన్, నవ్నీత్, పర్గత్, నికోలస్, శ్రేయాస్, రవీందర్ పాల్, దిలాన్, ఖలీమ్ సాన, జునైద్, గోర్డాన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.