T20 Worldcup 2024 Pakisthan VS Canada : టీ20 వరల్డ్ కప్ పోరులో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కెనడాతో ఢీ కొట్టేందుకు సిద్ధమైంది పాకిస్థాన్. తొలి మ్యాచ్‌లో యూఎస్ఏపై రెండో మ్యాచ్‌లో టీమిండియాపై ఓటమికి గురైన దాయాది జట్టు మరో మ్యాచ్ ఆడి ప్రస్తుత టోర్నీలో భవితవ్వం తేల్చుకోనుంది. జూన్11న జరిగే మ్యాచ్‌లో గెలిస్తే పాకిస్థాన్ బతికి బయటపడగలదు. గ్రూపు ఏలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు కోల్పోయిన ఈ జట్టు, భారీ రన్ రేట్‌తో గెలిస్తేనే గ్రూపు దశ నుంచి సూపర్ 8కు అర్హత సాధించగలదు. కాగా, గ్రూపులోని ఐదు జట్లు ఇప్పటికే రెండేసి మ్యాచ్‌లు ఆడేశాయి.
ఆయా టీమ్‌ల రన్ రేట్ ఒకసారి పరిశీలిస్తే
టీమ్ఇండియా రెండు మ్యాచ్‌లు గెలిచి 1.455తో కొనసాగుతోంది.
యూఎస్ఏ రెండు మ్యాచ్‌లు గెలిచి 0.626
కెనడా ఒక మ్యాచ్ గెలిచి -0.274
పాకిస్థాన్ రెండు మ్యాచ్‌లు ఓడి -0.150
ఐర్లాండ్ రెండు మ్యాచ్‌లు ఓడి -1.712
ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ పోరులో నిలవాలంటే, కెనడాపై గెలవడంతో పాటు తర్వాత జరగనున్న ఐర్లాండ్‌పై కూడా భారీ తేడాతో గెలవాలి. అదే సమయంలో మరోవైపు యూఎస్ఏ తర్వాత ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో ఓడిపోవాలి. అలా జరిగితేనే పాకిస్థాన్, అమెరికా నాలుగు పాయింట్లతో సమంగా నిలుస్తాయి అప్పుడు రన్ రేట్ కీలకమవుతుంది. అమెరికా ప్రస్తుతం మెరుగైన రన్‌రేట్ (+0.626)తో కొనసాగుతోంది. అంటే -0.150తో ఉన్న పాకిస్థాన్ ముందంజ వేయాలంటే పెద్ద విజయాలు సాధించాలి. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శన చేసిన ఆ జట్టుమరి కెనడాతో పోరులో ఎలా పుంజుకుంటుందో చూడాలి.
పాకిస్థాన్ బ్యాటింగ్ వైఫల్యం:
టీ20 వరల్డ్ కప్ మొదలుపెట్టినప్పటి నుంచి బాబర్ అజామ్ పరుగులు చేయడంలో విఫలమవుతూనే ఉన్నాడు. 2022 టీ20 వరల్డ్ కప్ నుంచి కేవలం 9 ఇన్నింగ్స్‌లు ఆడి 181 పరుగులు మాత్రమే చేశాడు.
2022 టీ20 వరల్డ్ కప్ తర్వాత తొలి రెండు గేమ్‌లు ఓడిపోవడం ఇదే మొదటిసారి. ఎప్పుడూ తొలి రెండు మ్యాచ్‌లను కోల్పోయింది లేదు.
టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ జట్టులో 100 పరుగులకుపైగా కేవలం ముగ్గురు మాత్రమే స్కోరు చేస్తున్నారు. పాకిస్థాన్ జట్టులో అత్యధిక పరుగులు సాధించే బాబర్ అజామ్ వెనకబడే ఉన్నాడు.
జట్టు వైఫల్యాన్ని బాబర్ అజామ్ నాయకత్వ లోపమనే అంటున్నారు మ్యాచ్ విశ్లేషకులు. కెప్టెన్ తన క్లోజ్ ఫ్రెండ్స్ అయిన మొహమ్మద్ రిజ్వాన్, షాదబ్ ఖాన్‌లకు అవకాశమిచ్చి షహీన్ షా అఫ్రీదిను పక్కకు పెట్టడం జట్టును దెబ్బతీసింది. బ్యాటింగ్ ఒక్కటే కాదు పాకిస్థాన్ ఏ విభాగంలోనూ సక్సెస్ సాధించలేకపోతుంది. యూఎస్ఏతో ఆడి 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసినా సెకండ్ ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థులను కట్టడి చేయలేకపోయి విఫలమైంది. సూపర్ ఓవర్‌లో బ్యాటర్లది అదే పరిస్థితి. మరోవైపు కెనడా రెండు మ్యాచ్‌ల్లో ఒకటి ఓడి, ఒకటి గెలిచింది.
సౌతాఫ్రికా బతికిపోయింది - ఉత్కంఠ పోరులో బంగ్లాపై విజయం - T20 Worldcup 2024
హర్భజన్ దెబ్బకు దిగొచ్చిన పాకిస్థాన్ క్రికెటర్ - ఆ వ్యాఖ్యలకు క్షమాపణలు - T20 Worldcup 2024