Team India Return: టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన టీమ్ఇండియా 3 రోజుల తర్వాత స్వదేశం చేరుకుంది. ఈనెల 29న జరిగిన ఫైనల్ పోరులో సౌతాఫ్రికాపై అద్భుత విజయం నమోదు చేసిన రోహిత్ సేన గురువారం ఉదయం దిల్లీ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంది. వరల్డ్ ఛాంపియన్లకు బీసీసీఐ అధికారులు, టీమ్ఇండియా ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జైషా, మీడియా కూడా అదే విమానంలో స్వదేశం చేరుకున్నారు. ప్లేయర్ల రాకతో దిల్లీ ఎయిర్ పోర్ట్ ఫ్యాన్స్‌తో కిక్కిరిసిపోయింది. 'భారత్ మాతా కీ జై', 'ఇండియా ఇండియా' నినాదాలతో అభిమానులు హోరెత్తించారు.
#WATCH | Virat Kohli along with Team India arrives at Delhi airport, after winning the #T20WorldCup2024 trophy.
— ANI (@ANI) July 4, 2024
India defeated South Africa by 7 runs on June 29, in Barbados. pic.twitter.com/wcbzMMvG7h
Men's Indian Cricket Team lands at Delhi airport after winning the #T20WorldCup2024 trophy.
— ANI (@ANI) July 4, 2024
(Source: Delhi Airport) pic.twitter.com/kaCCjYy2oM
ఇక బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో ప్లేయర్లంతా దిల్లీ ఐటీసీ మౌర్య హోటల్‌కు వెళ్లారు. అక్కడ హోటల్ సిబ్బంది ప్లేయర్లకు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు. చాక్లెట్ ఫ్లేవర్‌తో వరల్డ్‌కప్ ట్రోఫీ డిజైన్‌లో ప్రత్యేకంగా కేక్ తయారు చేశారు. ఆటగాళ్లకు స్పెషల్ బ్రేక్‌ఫాస్ట్ కూడా రెడీ చేసినట్లు హోటల్ చీఫ్ చెఫ్ చెప్పారు. కాగా, ఇక్కడ నుంచి రోహిత్ సేన ప్రధాని మోదీని కలిసేందుకు వెళ్లనుంది. ఉదయం 11 గంటలకు ఆయన నివాసంలో మర్వాదపూర్వకంగా కలవనున్నారు. ఆ తర్వాత భారత క్రికెట్ జట్టు సభ్యులు స్పెషల్ ఫ్లైట్‌లో ముంబయికి బయల్దేరుతారు.
#WATCH | Indian Cricket Team Captain Rohit Sharma and Coach Rahul Dravid at ITC Maurya Hotel in Delhi, after winning the #T20WorldCup2024 trophy. pic.twitter.com/j3bk5aOErE
— ANI (@ANI) July 4, 2024
#WATCH | Rishabh Pant carrying the T20 World Cup trophy at ITC Maurya Hotel in Delhi. pic.twitter.com/hvzsMWlZLU
— ANI (@ANI) July 4, 2024
ముంబయిలో సాయంత్రం 5 గంటలకు రోడ్ షో ఉండనుంది. నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు విజయోత్సవ ర్యాలీ జరగనుంది. ఓపెన్ టాప్ బస్సుపై టీమ్ఇండియా సభ్యులు రోడ్‌షోలో పాల్గొంటారు. రాత్రి 7 గంటల దాకా రోడ్ షో కొనసాగనుంది. ఆ తర్వాత బీసీసీఐ ఆధ్వర్యంలో వాంఖడే స్టేడియంలో ప్లేయర్లకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. రోడ్ షోను స్టార్ స్పోర్ట్స్ లైవ్ ప్రసారం చేయనుంది. కాగా, ఈ రోడ్‌షోలో పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో ముంబయిలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక వరల్డ్‌కప్ ఛాంపియన్లకు బీసీసీఐ ఇప్పటికే రూ.125 కోట్ల భారీ నజరానా ప్రకటించింది.
#WATCH | Delhi: A supporter of the Men's Indian Cricket Team, says " i am extremely happy and excited. i just hope to get a glimpse of the team and captain rohit sharma. there is a roadshow in mumbai in the evening today, we are all excited about that too..."
— ANI (@ANI) July 4, 2024
team india has… pic.twitter.com/0lXoMkAzJp
#WATCH | Delhi: Team India's bus at Terminal 3 of Delhi airport as the Men's Indian Cricket Team has landed at the airport after winning the #T20WorldCup2024 trophy. pic.twitter.com/gqHBbn1357
— ANI (@ANI) July 4, 2024
#WATCH | Delhi: Supporters gather at the airport to welcome Men's Indian Cricket Team.
— ANI (@ANI) July 4, 2024
Team India has arrived at Delhi Airport after winning the #T20WorldCup2024 trophy. pic.twitter.com/XYB1N2CdbE
చార్డెట్ ఫ్లైట్‌లో పయనమైన టీమ్ఇండియా - మోదీ స్పెషల్ మీటింగ్