ETV Bharat / sports

పసికూనల చేతిలో ఓటమి - పాక్​కు ఇదేం కొత్త కాదు! - T20 World Cup 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 7, 2024, 9:39 AM IST

T20 World Cup Pakistan : అంతర్జాతీయ క్రికెట్​ ఫార్మాట్​లో టాప్ జట్టుగా బరిలోకి దిగిన పాకిస్థాన్ తాజాగా యూఎస్​తో జరిగిన మ్యాచ్​లో ఘోర పరాజయాన్ని చవి చూసింది. అయితే పాక్​కు కొత్తమి కాదు. ఈ ఫార్మాట్​లో పలు మార్లు పసికూనల చేతిలో ఓటమిపాలైంది. ఆ విశేషాలు మీ కోసం.

USA VS Pakistan T20 World Cup 2024
USA VS Pakistan T20 World Cup 2024 (Associated Press)

T20 World Cup Pakistan : అంతర్జాతీయ క్రికెట్‌లో టాప్ క్రికెట్ జట్లలో ఒకటిగా కొనసాగుతోంది పాకిస్థాన్. ప్రతి టాప్ జట్టు అందుకున్నట్లుగానే వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ లాంటి ట్రోఫీలనూ అందుకుంది. కానీ, కొన్ని సార్లు ఐసీసీ ఈవెంట్లలో తక్కువ ర్యాంకు ఉన్న జట్లు కూడా పాక్​ను పల్టీ కొట్టించాయి. తాజాగా జరిగిన మ్యాచ్​లోనూ పసికూన యూఎస్ఏ కూడా పాకిస్థాన్​ను ఓడించగలిగింది. ఇదే కాకుండా అంతర్జాతీయ క్రికెట్​లో పాక్ పలు దారుణమైన పరాభవాలను ఎదుర్కొంది. అవేంటంటే? .

యూఎస్ఏ​ Vs పాకిస్థాన్
ఐసీసీ తొలిసారి టీ20 వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులను యూఎస్ఏకు అప్పగించింది. తొలిసారి మెగా టోర్నీలో అడుగుపెట్టిన యూఎస్ఏ అనూహ్య రీతిలో టాప్ ర్యాంక్‌డ్ జట్టు అయిన పాకిస్థాన్​ను జూన్ 6న జరిగిన డల్లాస్ మ్యాచ్‌లో చిత్తు చేసింది. యూఎస్ఏ కెప్టెన్ మోనాంక్ పటేల్ చేసిన హాఫ్ సెంచరీతో జట్టు ఫలితం సూపర్ ఓవర్ వరకూ చేరింది. 159 పరుగులతో ఇరు జట్లు టై అవగా, సూపర్ ఓవర్లో సౌరబ్ నేత్రావల్కర్ అమెరికాను పాకిస్థాన్​పై విజేతగా నిలిపాడు.

ఆఫ్గనిస్థాన్ Vs పాకిస్థాన్
వన్డే వరల్డ్ కప్ 2023 సెమీ ఫైనల్స్​లో క్వాలిఫై కాకపోయింది బాబర్ అజామ్ టీం. గ్రూపు స్టేజిలో ఆఫ్గనిస్థాన్ చేతిలో చిత్తవడమే ఇందుకు కారణం. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో అఫ్గాన్​ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 283 పరుగుల లక్ష్యాన్ని చేధించగలిగింది.

ఐర్లాండ్‌ Vs పాకిస్థాన్
వరల్డ్ కప్‌లోకి ఐర్లాండ్‌కు అది అరంగ్రేట మ్యాచ్. ప్రత్యర్థి జట్టును 132 పరుగులకే కట్టడి చేసి లక్ష్యాన్ని 41.4ఓవర్లలో పూర్తి చేశారు. ఈ పరాజయంతో పాకిస్థాన్ గ్రూపు స్టేజిలోనే వెనుదిరగాల్సి వచ్చింది.

జింబాబ్వే Vs పాకిస్థాన్
2022 టీ20 వరల్డ్ కప్‌ను రన్నరప్‌గానే ముగించాల్సి వచ్చింది. ముందుగా బ్యాటింగ్ చేసి 131 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన జింబాబ్వే, టై అవడానికి కూడా అవకాశం లేకుండా 129 పరుగులకే, అంటే ఒక్క పరుగు తేడాతో పాకిస్థాన్ ను ఓడించింది.

జింబాబ్వే Vs పాకిస్థాన్
కొన్ని దశాబ్దాల క్రితం కూడా పాకిస్థాన్ పరిస్థితి ఇదే. 1995లో జింబాబ్వే టెస్టు మ్యాచ్‌లో 64 పరుగుల తేడాతో పాకిస్థాన్​పై విజయం సాధించింది.

ఫారిన్ జట్లలో భారత ప్లేయర్లు- వరల్డ్​కప్​లో టీమ్ఇండియాకు ప్రత్యర్థులే! - T20 World Cup 2024

చరిత్ర సృష్టించిన ఉగాండ బౌలర్- టీ20 వరల్డ్​కప్​లోనే తక్కువ ఎకనమీ- టాప్​5 లో వీళ్లే! - T20 World Cup 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.