ETV Bharat / sports

టీ20 వరల్డ్​కప్​ టోర్నీలో హ్యాట్రిక్ వీరులు- ఏకైక బౌలర్​గా కమిన్స్​ రికార్డ్ - T20 World Cup 2024

T20 World Cup Hat Tricks: బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగే టీ20 ఫార్మాట్, అందులోనూ వరల్డ్‌ కప్‌లో హ్యాట్రిక్‌ సాధించడం అంత సులువు కాదు. కానీ ఇప్పటికీ ఈ అరుదైన ఘనతను 9 సార్లు సొంతం చేసుకున్నారు.

T20 World Cup Hat Tricks
T20 World Cup Hat Tricks (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 24, 2024, 8:44 PM IST

T20 World Cup Hat Tricks: 2024 టీ20 వరల్డ్‌కప్‌లో బౌలర్ల ఆధిపత్యం కొనసాగుతోంది. అమెరికా వేదికగా జరిగిన మ్యాచ్​ల్లో అనేకసార్లు అత్యల్ప స్కోర్లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క సెంచరీ కూడా నమోదు కాలేదు. కానీ, బౌలర్లు మాత్రం మూడుసార్లు హ్యాట్రిక్‌ వికెట్లు తీయడం గమనార్హం. ఆసీస్ స్టార్ పేసర్ అత్యధికంగా రెండుసార్లు, ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ జోర్డన్ ఈ ఫీట్ సాధించారు. మరి ఇప్పటివరకు జరిగిన 9 టీ20 వరల్డ్​కప్​ ఎడిషన్లలో ఎన్ని హ్యాట్రిక్​లు నమోదయ్యాయి? ఈ హ్యాట్రిక్‌ వికెట్లు తీసిన బౌలర్లు ఎవరు? తెలుసుకుందాం.

2024లో కమిన్స్‌ డబుల్ హ్యాట్రిక్‌
టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ వరుసగా రెండు సార్లు హ్యాట్రిక్‌ తీసిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. తొలుత బంగ్లాదేశ్‌, తర్వాత అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ వికెట్లు సాధించాడు. టీ20 ప్రపంచకప్‌లో మొత్తంగా 9 హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి. అందులో కమిన్స్‌వే రెండు ఉన్నాయి. ఇక అంతర్జాతీయ టీ20ల్లో కమిన్స్ రెండు హ్యాట్రిక్స్​ తీసిన ఐదో బౌలర్​గా నిలిచాడు. కమిన్స్​ కంటే ముందు లసిత్ మలింగ (శ్రీలంక), టిమ్‌ సౌథీ (న్యూజిలాండ్‌), మార్క్ పాల్వోవిక్ (సెర్బియా), వసీమ్ అబ్బాస్ (మాల్టా) ఉన్నారు.

అమెరికాపై జోర్డాన్‌
సూపర్‌ 8 స్టేజ్‌లో గ్రూప్‌ 2లో ఇంగ్లాండ్‌- యూఎస్‌ఏ మ్యాచ్‌లో జోర్డాన్‌ హ్యాట్రిక్‌ సాధించాడు. 19 ఓవర్లో మొదట బంతికి కోరె అండర్సన్, హ్యారీ బ్రూక్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. రెండో బాల్‌కి పరుగులు రాలేదు. తర్వాత మూడు బంతులకు వరుసగా అలీ ఖాన్ (0) క్లీన్‌బౌల్డ్, నోస్తుష్ కెంజిగే (0) ఎల్బీడబ్ల్యూ, నేత్రావల్కర్ (0) క్లీన్‌బౌల్డ్ అయ్యారు. దీంతో జోర్డాన్ హ్యాట్రిక్ సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో ఇది మూడో హ్యాట్రిక్‌ కావడం గమనార్హం.

కమిన్స్‌, జోర్డాన్‌కి ముందు హ్యాట్రిక్‌ సాధించింది వీళ్లే

  • 2007 టీ20 వరల్డ్‌ కప్‌లో కేప్‌టౌన్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రెట్ లీ (ఆస్ట్రేలియా) మొదటి హ్యాట్రిక్‌ సాధించాడు.
  • అనంతరం 2021 టీ20 ప్రపంచ కప్‌లో అబుదాబిలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కర్టిస్ క్యాంఫర్ (ఐర్లాండ్‌) హ్యాట్రిక్‌ వికెట్లు తీశాడు.
  • 2021లోనే షార్జాలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో హసరంగా (శ్రీలంక) హ్యాట్రిక్‌ సాధించాడు.
  • 2021లో షార్జాలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రబాడ(దక్షిణాఫ్రికా) హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టాడు.
  • 2022 టీ20 ప్రపంచ కప్‌లో గీలాంగ్‌లో శీలంకతో జరిగిన మ్యాచ్‌లో కార్తీక్ మెయ్యప్పన్ (యూఏఈ) వరుసగా మూడు వికెట్లు తీశాడు.
  • 2022లోనే అడిలైడ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జాషువా లిటిల్ (ఐర్లాండ్) హ్యాట్రిక్ సాధించాడు.

ఇంట్రెస్టింగ్​గా వరల్డ్​కప్ సెమీస్ రేస్- ​భారత్​కు ఛాన్స్ ఎంతంటే?

టీ20 వరల్డ్​ కప్​ - వెస్టిండీస్​పై విజయం - సెమీస్​కు దక్షిణాఫ్రికా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.