T20 World Cup Afghansitan : టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇప్పటి వరకు సూపర్ 8 మ్యాచుల్లో ఎంతో ఉత్కంఠగా సాగాయి. అందులో నువ్వా నేనా అంటూ పెద్ద, చిన్న జట్లు తలపడ్డాయి. అయితే అనూహ్య ఫలితాలతో కొన్ని జట్లు సెమీస్‌కు చేరుకుని తామెంటో నిరూపించుకున్నాయి. అందులో అఫ్గానిస్థాన్ ఒకటి. ఇటీవలే ఆస్ట్రేలియాను ఓడించిన తీరుతో అఫ్గాన్ టీమ్‌పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక తాజాగా జరిగిన బంగ్లాదేశ్ - అఫ్గానిస్థాన్ మ్యాచ్లసోనూ అప్గాన్ అద్భుతం విజయాన్ని తమ ఖాతాలో వేసుకుని సెమీస్‌లోని అడుగుపెట్టింది.
ఈ నేపథ్యంలో అఫ్గాన్ ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బితబ్బిపోయారు. వేల సంఖ్యలో వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. అంతే కాకుండా ర్యాలీగా రోడ్లపై తిరిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అయితే అఫ్గాన్ ప్లేయర్లు కూడా బస్సులో సంబరాలు చేసుకున్నట్లు తెలుస్తోంది.
Bringing on the party vibe everywhere! Never change, @DJBravo47 ! 🥳🕺#T20WorldCup #AFGvBAN pic.twitter.com/9tByGUjki0
— Chennai Super Kings (@ChennaiIPL) June 25, 2024
The streets of Nangarhar in Afghanistan. 🤯🇦🇫 pic.twitter.com/MBP7HYTTqA
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024
ఇక మ్యాచ్ విషయానికి వస్తే, తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 115 పరుగులు స్కోర్ చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో బంగ్లా 105 పరుగులకే పరిమితమైంది. ఆరంభంలోనే వరుసగా వికెట్లను కోల్పోయింది.
పేసర్లు ఫజల్ ఫారూఖీ, నవీన్ ఉల్ హక్ తమ బౌలింగ్ స్కిల్స్‌తో చెలరేగడం వల్ల 23 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో సౌమ్య సర్కార్, లిటన్ దాస్ జట్టును కాస్త ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే స్వల్ప భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత సర్కార్ పెవిలియన్ చేరాడు.
ఓ వైపు వికెట్లు పడుతున్నా కూడా ఏ మాత్రం చెక్కుచెదరకుండా లిటన్ దాస్ 54 పరుగులు చేశాడు. కానీ చివరి వరకు క్రీజులో ఉన్నా కూడా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. ఇక అఫ్గాన్ బౌలర్లు రషీద్ ఖాన్, నవీన్ ఉల్ హక్ కూడా చెరో 4 వికెట్లు తీశారు.
సెమీ ఫైనల్ ఎప్పుడంటే?- అఫ్గానిస్థాన్ గురువారం (జూన్ 27) ఉదయం జరగనున్న తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికాతో తలపడనుంది. మరో సెమీఫైనల్ అదే రోజు రాత్రి 8 గంటలకు భారత్ - ఇంగ్లాండ్ మధ్య జరగనుంది.
బంగ్లాదేశ్ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ చీటింగ్! - మాజీల విమర్శలు - T20 Worldcup 2024
టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో హ్యాట్రిక్ వీరులు- ఏకైక బౌలర్‌గా కమిన్స్ రికార్డ్ - T20 World Cup 2024