T20 world cup 2024 : ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ లో సూపర్-8 చేరుకున్న జట్టు ఏవో తెలిసిపోయాయి. ఈసారి పొట్టి వరల్డ్ కప్‌లో మొత్తంగా 20 జట్లు పాల్గొంటే లీగ్ దశలోనే 12 ఇంటిదారి పట్టాయి. మరో 8 జట్లు తదుపరి రౌండ్ సూపర్ 8కు అర్హత సాధించాయి. ఇవి కూడా రెండు గ్రూప్‌గా విడిపోయి తలపడనున్నాయి. మరి ఆ గ్రూప్‌లు ఏంటి? మ్యాచులు ఎప్పుడు ప్రారంభమవుతాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సూపర్-8కు చేరిన జట్లు ఇవే - ప్రతీ గ్రూపులో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8లో చోటు దక్కించుకున్నాయి. గ్రూపు-ఏ నుంచి భారత్, యూఎస్‌ఏ, గ్రూప్- బి నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, గ్రూప్- సీ నుంచి వెస్టిండీస్, అఫ్గానిస్థాన్, గ్రూప్- డీ నుంచి దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సూపర్-8కు అర్హత సాధించాయి.
ఒక్కో గ్రూపులో నాలుగు జట్లు - టీ20 ప్రపంచ కప్‌లో లీగ్ దశలో A1, B2, C1, D2గా ఉన్న టీమ్ లు సూపర్-8లో గ్రూప్-1గా ఉంటాయి. అంటే భారత్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ గ్రూప్-1 లో ఉంటాయి. ఇక గ్రూప్-2లో A2, B1, C2, D1 అయిన యూఎస్‌ఏ, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, యూఎస్‌ఏ తలపడనున్నాయి. ఇందులో ఒక్కో జట్టు ప్రత్యర్థితో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఆయా గ్రూపుల్లో మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్ బాట పడతాయి.
ప్రత్యర్థులతో భారత్ ఆడే మ్యాచ్ లు ఇవే -
-బార్బడోస్ వేదికగా జూన్ 20న అప్గానిస్థాన్ తో భారత్ తలపడనుంది.
-అంటిగ్వా వేదికగా జూన్ 22న బంగ్లాదేశ్ తో టీమ్ ఇండియా పోరాడనుంది.
-జూన్ 24న ఆస్ట్రేలియాతో సెయింట్ లూసియా వేదికగా భారత్ తలపడనుంది.
-కాగా టీమ్ ఇండియా మ్యాచులన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతాయి
ఇతర జట్లు ఆడే సెమీస్ మ్యాచులు
జూన్ 19: యూఎస్‌ఏ-దక్షిణాఫ్రికా
జూన్ 19: ఇంగ్లాండ్-వెస్టిండీస్
జూన్ 20: ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్
జూన్ 21: ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా
జూన్ 21: యూఎస్ఏ-వెస్టిండీస్
జూన్ 22: అఫ్గానిస్థాన్ - ఆస్ట్రేలియా
జూన్ 23: యూఎస్‌ఏ-ఇంగ్లాండ్
జూన్ 23: వెస్టిండీస్-దక్షిణాఫ్రికా
జూన్ 24: అఫ్గానిస్థాన్-బంగ్లాదేశ్
'చాలా బాధగా ఉంది' - జట్టు వైఫల్యం, కెప్టెన్సీపై స్పందించిన బాబర్ - T20 Worldcup 2024
ధోనీ వరల్డ్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన కెప్టెన్ బాబర్ - T20 Worldcup 2024