T20 WorldCup 2024 Theekshana : టీ20 ప్రపంచకప్ - 2024 గ్రూప్ స్టేజ్‌లో తమ జట్టు ఆడేందుకు సిద్ధం చేసిన వేదికలపై శ్రీలంక స్పిన్నర్ తీక్షణ అసహనం వ్యక్తం చేశాడు. గ్రూప్ స్టేజ్‌లో తమ జట్టు ఆడబోయే నాలుగు మ్యాచ్‌లకు భిన్నమైన నాలుగు వేదికలను ఏర్పాటు చేయడం అన్యాయమని అన్నాడు. కొన్ని జట్లకు మాత్రం అన్ని మ్యాచ్‌లు ఒకే వేదికగా ఆడేలా షెడ్యూల్ సిద్ధం చేశారని అన్నాడు. అయితే టీమ్ఇండియాను ఉద్దేశించి పరోక్షంగా ఇలా ప్రస్తావించాడని కొందరు అంటున్నారు.
అలానే తమ జట్టు బస చేయడానికి ఇచ్చిన హోటల్ గురించి కూడా ప్రస్తావించాడు తీక్షణ. హోటల్ నుంచి మైదానానికి రావడానికి సుమారు గంట 40 నిమిషాల సమయం పడుతుందని మండిపడ్డాడు. కొన్ని జట్లకు మాత్రం 15 నిమిషాల్లోనే స్టేడియానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారని ఆరోపించాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కోసం న్యూయార్క్ వచ్చేందుకు విమానశ్రయంలోనే తమ ఆటగాళ్లంతా ఎనిమిది గంటలు వేచి చూశారని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ముగిసిన అనంతరం తమ షెడ్యూల్ గురించి మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్‌లో అయినా ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చర్చలు తీసుకోవాలని కోరాడు.
కాగా, ప్రపంచ కప్ 2024లో 20 జట్లు బరిలోకి దిగాయి. అమెరికా, వెస్టిండీస్ కలిసి ఈ మెగాటోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ ఐదు జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ స్టేజ్‌లో ఒక్కో జట్టు తమ గ్రూప్‌లోని ఇతర టీమ్లతో నాలుగు మ్యాచులు ఆడాల్సి ఉంటుంది. అయితే శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు మాత్రమే నాలుగు మ్యాచ్‌లను భిన్నమైన వేదికలపై ఆడనున్నాయి.
ఇకపోతే గ్రూప్ స్టేజ్‌లో టీమ్ఇండియా, సౌతాఫ్రికా ఒకే వేదికగా మూడు మ్యాచ్‌లు ఆడుతున్నాయి. ఒక మ్యాచ్ మాత్రమే మరో వేదికగా పోటీపడనున్నాయి. అలానే గ్రూప్-డీలో దక్షిణాఫ్రికా, లంకతో పాటు నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, నేపాల్ జట్లు ఉన్నాయి. ఇక న్యూయార్క్ నాసా కంట్రీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో లంక ఆరు వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
హిట్‌మ్యాన్‌పై కన్నేసిన ఆ మూడు జట్లు! - IPL 2025 Rohith Sharma