T20 World Cup 2024 India Pakistan Match Ticket Price : ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే 20 టీమ్‌లు తలపడుతున్న ఈ టోర్నీలో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారత్, పాక్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ జూన్ 9న న్యూయార్క్‌లో జరుగనున్న హై వోల్టేజ్ మ్యాచ్ చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ టిక్కెట్ ధరలపై వివాదం మొదలైంది.
- టిక్కెట్ ధర వివాదం
యూఎసఏలో క్రికెట్‌ను ప్రోత్సహించడం కంటే ఐసీసీ లాభాలకు ప్రాధాన్యత ఇస్తోందని ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ విమర్శించారు. న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో డైమండ్ క్లబ్ విభాగంలో ఒక్కో సీటుకు $20,000 (రూ.16,65,138) వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇండియా, పాక్ మ్యాచ్‌కు ICC డైమండ్ క్లబ్ ఒక్కో టిక్కెట్‌ను $20000 చొప్పున విక్రయిస్తోందని తెలిసి షాక్ అయినట్లు లలిత్ మోదీ ట్వీట్ చేశారు. అయితే ఈ విషయమై ఐసీసీ స్పందించలేదు. కానీ ఈ విషయం తెలుసుకుంటున్న ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
కాగా, ICC ప్రకారం, భారత్- పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ ధరలు $300 (సోల్ట్ అవుట్) నుంచి $10,000 వరకు ఉన్నాయి. ఇటీవలే USA టుడే నివేదిక ఈ టిక్కెట్‌ల రీసేల్ ధరలు బాగా పెరిగాయని పేర్కొంది.
- ఇండియా ప్రపంచ కప్ షెడ్యూల్
భారత్ వరల్డ్ కప్ జర్నీని జూన్ 5న న్యూయార్క్‌లో ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో ప్రారంభిస్తుంది. అదే వేదికపై 9న పాకిస్థాన్‌తో తలపడనుంది. 12న ఆతిథ్య యూఎస్‌ఏతో, గ్రూప్ ఏలో ఫైనల్ మ్యాచ్ 15న కెనడాతో ఆడుతుంది.
-
The ICC Men's T20 World Cup Anthem from @duttypaul & @Kestheband is here - and it’s Out Of This World! 🌎 🏏
— T20 World Cup (@T20WorldCup) May 2, 2024
See if you can spot some of their friends joining the party @usainbolt, @stafanie07, Shivnarine Chanderpaul, @henrygayle 🤩#T20WorldCup | #OutOfThisWorld pic.twitter.com/SUHHaLt6AW
-
- కోహ్లీ ఇన్నింగ్స్ గుర్తు చేసుకుంటున్న ఫ్యాన్స్
గత టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌తో సెమీ ఫైనల్‌లో ఓడిపోవడంతో ఇండియా జర్నీ ముగిసింది. అయితే టోర్నీలో పాక్‌పై కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌ని ఇప్పుడు ఇండియన్ ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. T20 ప్రపంచ కప్‌లో చివరిసారిగా భారతదేశం, పాకిస్థాన్‌లు 2022 అక్టోబర్‌లో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో తలపడ్డాయి. 160 పరుగుల ఛేజింగ్‌కు దిగిన ఇండియా ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోతుంది. 6.1 ఓవర్లలో 31/4తో పీకల్లోతు కష్టాల్లో పడుతుంది. అప్పుడు కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 53 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఉత్కంఠ పోరులో ఇండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఆఫర్ రిజెక్ట్ చేసిన రికీ పాంటింగ్ - మరి స్టీఫన్ ఫ్లెమింగ్ ఏం అంటున్నాడంటే? - TeamIndia Head coach
కోహ్లీ భద్రతకు ముప్పు- స్టేడియం వద్ద ఉగ్రవాదులు అరెస్ట్- RCB ప్రాక్టీస్ క్యాన్సిల్! - IPL 2024