Team India Winning Moments: టీమ్ఇండియా టీ20 వరల్డ్‌కప్ టైటిల్ నెగ్గడంతో యావత్ దేశం సంబరాల్లో మునిగిపోయింది. శనివారం బర్బడోస్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో ప్లేయర్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆఖరి బంతికి జట్టు విజయం అందుకోగానే మైదానంలో టీమ్ఇండియా ప్లేయర్లంతా భావోద్వేగానికి లోనయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ అలా మైదానంలో వాలిపోయాడు. అటు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య ఎమోషనలయ్యారు.
ఇక ప్లేయర్లంతా తమదైన రీతిలో సంబరాలు చేసుకున్నారు. జాతీయ జెండా పట్టుకొని మైదానం అంతా తిరుగుతూ సందడి చేశారు. ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న వరల్డ్‌కప్ ట్రోఫీని అందుకొని ప్లేయర్లంతా ఎంతో మురిసిపోయారు. ఈ మధుర క్షణాలు స్టేడియంలో ప్రేక్షకులతోపాటు, ఇటు టీవీల్లో వీక్షిస్తున్న అభిమానులను సైతం ఆకట్టుకున్నాయి. ఈ విన్నింగ్ మూమెంట్స్‌ను ప్లేయర్లు, జట్టు సిబ్బంది బాగా ఎంజాయ్ చేశారు. మరి ఈ గోల్డెన్ మూమెంట్స్ మీరూ చూసేయండి.
This is what it means to Rohit Sharma pic.twitter.com/EXgtlTSqfK
— ` (@dontarestpandya) June 29, 2024
United, we are unbeatable !
— Satyajeet Tambe (@satyajeettambe) June 30, 2024
Team India has given us immense joy by winning the T20 World Cup. They have also delivered a message that when we unite as a team beyond all barriers of religion, caste, region or language, we are unbeatable !
I join the nation in congratulating this… pic.twitter.com/zbytiLcbzR
We cannot even imagine cricket without Rohit Sharma and Virat Kohli.🥺❤️ pic.twitter.com/gD7jJjAor7
— 𝐇𝐲𝐝𝐫𝐨𝐠𝐞𝐧 𝕏 (@ImHydro45) June 29, 2024
Timeless, priceless moments with the #T20WorldCup trophy secured 🏆 pic.twitter.com/r1k1i9SAXo
— ICC (@ICC) June 29, 2024
మ్యాచ్ విషయానికొస్తే, 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు ఓవర్లన్నీ ఆడి 169/8 స్కోర్‌కే పరిమితమైంది. హెన్రీచ్ క్లాసెన్ (52 పరుగులు; 27 బంతుల్లో 2×4, 5×6) రాణించాడు. క్వింటన్ డికాక్ (39 పరుగులు; 37 బంతుల్లో 4×4, 1×6), స్టబ్స్ (31 పరుగులు; 21 బంతుల్లో 3×4, 1×6) రాణించారు. ఆఖర్లో టీమ్ఇండియా బౌలర్లు విజృంభించడం వల్ల సౌతాఫ్రికాకు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య 3, బుమ్రా 2, అర్ష్‌దీప్ సింగ్ 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (9) నిరాశ పర్చినా, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (76; 59 బంతుల్లో 6×4, 2×6) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అక్షర్ పటేల్ (47; 31 బంతుల్లో 1×4, 4×6), శివమ్ దూబే (27; 16 బంతుల్లో 3×4,1×6) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్, నోకియా చెరో 2 వికెట్లు పడగొట్టగా మార్కో యాన్సెన్, రబాడ చెరో వికెట్ తీశారు.
17ఏళ్ల నిరీక్షణకు తెర - విశ్వవిజేతగా భారత్ - T20 WORLD CUP 2024 FINAL