Suryakumar Yadav IPL 2024: 2024 ఐపీఎల్లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిని చవి చూసిన ముంబయి ఇండియన్స్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ మరికొన్ని మ్యాచ్‌లకు కూడా దూరం కానున్నాడు. గాయం కారణంగా ఆటకు దూరమైన స్కై, గత కొంతకాలంగా బెంగళూరులోని ఎన్సీఏలో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడు. విశ్రాంతి తీసుకుంటూ క్రమక్రమంగా కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడు ఏప్రిల్ 1న రాజస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లోపు అందుబాటులోకి వస్తాడని తొలుత జట్టు సభ్యులు భావించారు. కానీ సూర్య ఇంకొన్ని మ్యాచ్‌లకు కూడా దూరం కానున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తాజాగా తెలిపారు.
'సూర్య ట్రీట్మెంట్లో ప్రోగ్రెస్ ఉంది. అతడు అనుకున్న దానికంటే వేగంగానే కోలుకుంటున్నాడు. కానీ, ప్రస్తుతానికి అతడు మరికొన్ని మ్యాచ్‌లకు మాత్రం దూరం కానున్నాడు' అంటూ ఆ అధికారి పేర్కొన్నారు. మరోవైపు జూన్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ కోసం స్టార్ బ్యాటర్ల ఫిట్నెస్ గురించి బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే సూర్యను ఇప్పుడు ఇంకొన్ని రోజులు ఎన్సీఏలోనే ఉంచనున్నట్లు సమాచారం.
ఇక మ్యాచ్ విషయానికి - వస్తే హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఆడిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ చివర్లో కాస్త తడబడింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 246 రన్స్ చేసింది. హైదరాబాదీ ప్లేయర్ తిలక్‌వర్మ (34 బంతుల్లో 2×4, 6×6 పరుగులు సాయంతో 64), టిమ్ డేవిడ్ ( 22 బంతుల్లో 2×4, 3×6 సాయంతో 42 నాటౌట్), ఇషాన్ కిషన్ (13 బంతుల్లో 2×4, 3×6 సాయంతో 34) పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. సన్‌రైజర్స్ బౌలింగ్‌లో ఉనద్కత్ 2, కమిన్స్ 2, షాబాజ్ అహ్మద్ 1 వికెట్లు తీశారు.
ముంబయి తుది జట్టు : ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, నమన్ ధీర్, తిలక్ వర్మ, పీయూష్ చావ్లా, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, కోయెట్జీ, షామ్స్ ములానీ, జస్ప్రీత్ బుమ్రా, క్వెనా మఫాకా
'కెప్టెన్సీ అంటే కాఫీ తాగినంతా ఈజీ కాదు'- హార్దిక్‌పై నెటిజన్లు ఫైర్ - Hardik Pandya Captain IPL
SRH x MI- సన్‌రైజర్సే కాదు- ముంబయిదీ రికార్డే - IPL Mumbai Indian Records