ETV Bharat / sports

రిషభ్​ పంత్​పై కన్నేసిన CSK- రైనా హింట్ ! - RISHABH PANT 2025 IPL

దిల్లీ రిటెన్షన్స్- మెగా వేలంలోకి పంత్- యువ క్రికెటర్​పై చెన్నై కన్ను!

Rishabh Pant 2025 IPL
Rishabh Pant 2025 IPL (Source: Getty Images (Left), AP (Right))
author img

By ETV Bharat Sports Team

Published : Nov 1, 2024, 4:43 PM IST

Rishabh Pant 2025 IPL : 2025 ఐపీఎల్ రిటెన్షన్స్ జాబితాలో ఊహించని ట్విస్ట్​లు నెలకొన్నాయి. ముఖ్యంగా దిల్లీ క్యాపిటల్స్​ తమ జట్టు కెప్టెన్​ రిషబ్ పంత్‌ను రిటైన్ చేసుకోకుండా వదిలేసింది. దీంతో పంత్ మెగా వేలంలోకి వచ్చాడు. ప్రస్తుతం ఇది సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే అంతలోనే చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ సురేశ్ రైనా ఈ విషయంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటంటే?

రైనా ఆసక్తికర వ్యాఖ్యలు
'నేను మహేంద్ర సింగ్ ధోనీని దిల్లీలో కలిశాను. ఆ సమయంలో పంత్ కూడా అక్కడే ఉన్నాడు. ఎవరో ఎల్లో కలర్ జెర్సీ వేసుకుంటారని అనిపిస్తుంది' అని ఓ ఇంటర్వ్యూలో రైనా వ్యాఖ్యానించాడు. రైనా మాటలను చూస్తుంటే పంత్​ను చెన్నై సూపర్ కింగ్స్ మెగా వేలంలో దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుందని అర్థమవుతోంది. రిషబ్ పంత్​పై చెన్నై ఆసక్తి చూపిస్తున్నట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. రైనా తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఆ వార్తలకు మరింత బలం చేకూరుతోంది.

ధోనీ తర్వాత!
ధోనీ తర్వాత చెన్నైకి సరైన వికెట్ కీపర్ లేడు. అందుకే పంత్​ను తీసుకుంటే వికెట్ కీపర్​తో పాటు బ్యాటర్​గా కూడా పనికొస్తాడు. వయసురీత్యా ధోనీ ఎక్కువ సీజన్లు ఆడలేడు. అందుకే ఇప్పట్నుంచే వికెట్ కీపర్, బ్యాటర్​ కోసం చెన్నై ప్రయత్నాలు చేస్తుందనడంలో సందేహం లేదు. అలా పంత్​ను ఇప్పుడే తీసుకుంటే ఇప్పటి నుంచే ధోనీ పర్యవేణలో సాన పెట్టొచ్చని చెన్నై ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే రిషభ్​ ఎల్లో జెర్సీ ధరిస్తాడా? లేదా? అనేది మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. నవంబర్ ఆఖరి లేదా డిసెంబర్ తొలి వారంలోనే 2025 ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ వేలంలో రిషభ్​ను దక్కించుకునేందుకు చెన్నైతో పాటు ఆర్సీబీ కూడా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.

దిల్లీ రిటెన్షన్స్
కాగా, దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పొరెల్ ను రిటెన్షన్ చేసుకుంది. పంత్​తోపాటు ఆసీస్ ప్లేయర్ డేవిడ్ వార్నర్, జేక్ ప్రెజర్ రిలీజ్ చేసింది. దీంతో ఈ ముగ్గురు ప్లేయర్లు ఐపీఎల్ మెగావేలంలోకి రానున్నారు.

పంత్​పై కన్నేసిన RCB - ఆ 3 కారణాలే ప్రధానం

'పంత్ వేలంలోకి వస్తే రూ.30 కోట్లు పక్కా- రాసి పెట్టుకోండి!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.