ETV Bharat / sports

'అభిషేక్‌ అదుర్స్​- టీమ్ఇండియాకు అతడే బలం!' - IPL 2024 - IPL 2024

Abhishek Sharma IPL 2024: హైదరాబాద్‌ ఆటగాడు అభిషేక్‌ శర్మ ఐపీఎల్‌ 2024లో తన సంచలన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. తాజాగా తన స్పిన్‌తో రాజస్థాన్‌ని చుట్టేశాడు. ఈ టాప్‌ ఆల్‌రౌండర్​పై కోచ్ తాజాగా ప్రశంసలు కురిపించాడు.

Abhishek  Sharma IPL
Abhishek Sharma IPL (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 25, 2024, 7:17 PM IST

Abhishek Sharma IPL 2024: ఐపీఎల్ హిస్టరీలో మూడోసారి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌ ఫైనల్‌ ఆడబోతోంది. మే 24న రాజస్థాన్‌తో జరిగిన క్వాలిఫైయర్‌ 2లో అద్భుత విజయంతో ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ బ్యాటింగ్‌లో రాణించకపోయినా, తన స్పిన్‌తో అదరగొట్టాడు. హైదరాబాద్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్​లో చెపాక్‌లోని పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ అభిషేక్‌ చేసిన బౌలింగ్‌కి ప్రశంసలు కురుస్తున్నాయి. రాజస్థాన్ కీలక బ్యాటర్లు సంజూ శాంసన్, ప్రమాదకర హిట్టర్‌ షిమ్రాన్ హెట్‌మెయర్‌ వికెట్లు పడగొట్టాడు. 4 ఓవర్లలో కేవలం 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.

అభిషేక్‌ అరుదైన ప్యాకేజీ
ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్, SRH మాజీ ప్రధాన కోచ్, టామ్ మూడీ అభిషేక్‌ను ప్రశంసించాడు. టీమ్‌లో ఏ రోల్‌ ఇచ్చినా అభిషేక్‌ నిర్వహించడానికి సిద్ధంగా ఉంటాడని చెప్పాడు. లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్‌ బౌలింగ్‌ చేసే టాపార్డర్‌ బ్యాటర్ చాలా అరుదు అని, అతడు మరింత ఎక్కువ బౌలింగ్ చేయాలని మూడీ పేర్కొన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో 14 మ్యాచుల్లో అభిషేక్‌ కేవలం మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అలానే 156 వైట్-బాల్ మ్యాచ్‌లలో (లిస్టు A, టీ20లు) 91 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయడం గమనార్హం.

నాథన్‌ లియాన్‌తో పోలిక
'అతడు డొమెస్టిక్‌ క్రికెట్‌లో ఎక్కువగా బౌలింగ్‌ చేయట్లేదు. కానీ భారత క్రికెట్ భవిష్యత్తు కోసం, అతను బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది' అని ఓ స్పోర్ట్స్​ ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్లూలో చెప్పాడు. అంతే కాదు అభిషేక్‌ని నాథన్ లియోన్‌తో పోల్చాడు. ఇద్దరూ ఓవర్‌స్పిన్ , డిప్‌ని జనరేట్‌ చేయడానికి బంతిని ఫ్లైటింగ్‌ చేసే అప్రోచ్‌ని వివరించాడు. క్యారమ్ బాల్‌ను ఎగ్జిక్యూట్ చేయడంలో అభిషేక్ ప్రావీణ్యం ఉందని, అతను దాని కోసం చాల కాలం ప్రయత్నించడాన్ని ప్రశంసించాడు. హెట్‌మెయర్‌ని ఔట్‌ చేసిన డెలివరీ ఒక అద్భుతమైన ఉదాహరణగా పేర్కొన్నాడు.

యువీ కంటే బెటర్‌ బౌలర్‌? ఇక తన బౌలింగ్ గురించి అభిషేక్ మ్యాచ్ అనంతరం మాట్లాడాడు. 'నా బౌలింగ్ గురించి నేను యువీ పాజీతో మాట్లాడినప్పుడల్లా, నేను అతని కంటే మెరుగైన బౌలర్‌ను కాగలనని చెబుతాడు. ఆ మాటలు ఎప్పుడూ నా మనస్సులో ఉంటాయి. నా ప్రదర్శనతో యువీ పాజీ నిజంగా సంతోషంగా ఉంటాడు' అని చెప్పాడు. కాగా, 2024 ఐపీఎల్‌ మొత్తం అభిషేక్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 15 ఇన్నింగ్స్‌లలో 207.75 స్ట్రైక్‌రేటుతో 482 పరుగులు చేశాడు. ఇందులో 36 ఫోర్లు, 42 సిక్సులు ఉన్నాయి. లీగ్‌లో SRH ఫైనల్‌ వరకు రావడంలో అభిషేక్‌ శర్మ కీలక పాత్ర పోషించాడు.

'అభిషేక్ బ్యాటింగ్​ స్ట్రైల్ ఫుల్​ క్లాస్​- అచ్చం యువీలానే' - Abhishek Sharma IPL

అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్​ - చెన్నైని ఉతికారేశాడు - IPL 2024 CSK VS SRH

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.