ETV Bharat / sports

'అది జరగని పని, దానికి డోర్స్ క్లోజ్'- సునీల్ నరైన్ కామెంట్స్! - Sunil Narine T20 World Cup

Sunil Narine T20 World Cup: తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలంటూ ఇటీవల వస్తున్న వార్తలపై స్టార్ ఆల్​రౌండర్ సునీల్ నరైన్ స్పందించాడు.​

Sunil Narine T20 World Cup
Sunil Narine T20 World Cup
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 23, 2024, 11:19 AM IST

Updated : Apr 23, 2024, 12:03 PM IST

Sunil Narine T20 World Cup: వెస్టిండీస్ స్టార్ ఆల్​రౌండర్ సునీల్ నరైన్, తాను టీ20 వరల్డ్​కప్​తో జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టాడు. ఈ విషయంపై తాజాగా సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. తాను ఇంటర్నేషనల్ క్రికెట్​లోకి రీ ఎంట్రీ ఇవ్వడం, టీ20 వరల్డ్​కప్​లో ఆడడం అసాధ్యమని పేర్కొన్నాడు.

'గత కొన్ని రోజులుగా నా పెర్ఫార్మెన్స్​ పట్ల నేను సంతోషంగా ఉన్నా. అయితే నేను ఇంటర్నేషనల్ రిటైర్మెంట్ వెనక్కితీసుకొని, ప్రపంచకప్​లో ఆడాలని కొంతమంది కోరుతున్నారు. వారి ప్రతిపాదనను నేను గౌరవిస్తా. కానీ, జట్టులో రీ ఎంట్రీ ఇవ్వడం మాత్రం జరగని పని. దానికి ఇప్పటికే అన్ని దారులు మూసుకుపోయాయి. ఇక వెస్టిండీస్ జట్టుకు మాత్రం నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. వాళ్లు ఇంకో టైటిల్ సాధించాలని ఆశిస్తున్నా' అని సోషల్ మీడియాలో నరైన్ తెలిపాడు. ఇక 2019లో భారత్​తో ఆఖరి టీ20 మ్యాచ్​ ఆడిన నరైన్, గతేడాదే ఇంటర్నేషనల్ క్రికెట్​కు గుడ్​బై చెప్పాడు.

కాగా, నరైన్​ను టీ20 వరల్డ్​కప్ జట్టులో చూడాలనుకుంటున్నట్లు విండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ రీసెంట్​గా చెప్పాడు. దానికోసం అతడిని ఎంతలా అడిగినప్పటికీ ఒప్పుకోలేదని ఓ సందర్భంలో పేర్కొన్నాడు. ఈ క్రమంలో నరైన్​ను ఒప్పించే బాధ్యత బ్రావో, పూరన్‌, పొలార్డ్‌కు అప్పగించాడట. కానీ, ఇంతలోనే నరైన్ ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల ఇక అతడిని పొట్టికప్​లో చూడలేమని క్లారిటీ వచ్చేసింది.

Sunil Narine IPL 2024: మరోవైపు నరైన్, 2024 ఐపీఎల్​లో అదరగొడుతున్నాడు. ఆల్​రౌండ్​ పెర్ఫార్మెన్స్​తో సూపర్ ఫామ్​లో దూసుకెళ్తున్నాడు. ఇటీవల​ రాజస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో ఇన్నింగ్స్​ ఓపెనర్​గా వచ్చి అద్భుత శతకం (109 పరుగులు)తో సత్తా చాటాడు. ఈ సీజన్​లో ఇప్పటివరకూ 7 మ్యాచ్​ల్లో కలిపి నరైన్ 40.86 సగటు, 176. 54 స్ట్రైక్​ రేట్​తో 286 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ కూడా ఉంది. అటు బంతితోనూ రాణిస్తున్న నరైన్ 28.0 సగటుతో 9 వికెట్లు పడగొట్టాడు.

'ఆ విషయంలో అతడు​ వినట్లేదు- ఒప్పించే బాధ్యత వాళ్లదే!'- నరైన్​పై విండీస్ కెప్టెన్ కామెంట్స్ - Sunil Narine T20 World Cup 2024

4 ఓవర్లలో 50 పరుగులు - గెలిచే మ్యాచ్​లో పేలవ పెర్ఫామెన్స్​ - స్టార్క్​పై ఫ్యాన్స్​ గరం! - Mitchell Starc KKR

Last Updated : Apr 23, 2024, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.