ETV Bharat / sports

'ఆ విషయంలో అతడు​ వినట్లేదు- ఒప్పించే బాధ్యత వాళ్లదే!'- నరైన్​పై విండీస్ కెప్టెన్ కామెంట్స్ - Sunil Narine T20 World Cup 2024 - SUNIL NARINE T20 WORLD CUP 2024

Sunil Narine T20 World Cup 2024: వెస్టిండీస్ స్టార్ ఆల్​రౌండర్ సునీల్ నరైన్ తన ఇంటర్నేషనల్ రిటైర్మెంట్​ వెనక్కి తీసుకోవాలని ఆ జట్టు కెప్టెన్ రోమన్ పావెల్ అభిప్రాయపడ్డాడు.

Sunil Narine T20 World Cup 2024
Sunil Narine T20 World Cup 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 18, 2024, 6:47 AM IST

Updated : Apr 18, 2024, 8:05 AM IST

Sunil Narine T20 World Cup 2024: వెస్టిండీస్ స్టార్ ఆల్​రౌండర్ సునీల్ నరైన్ తన ఇంటర్నేషనల్ రిటైర్మెంట్​ వెనక్కి తీసుకోవాలని ఆ జట్టు కెప్టెన్ రోమన్ పావెల్ అభిప్రాయపడ్డాడు. టీ20 వరల్డ్​కప్​ నేపథ్యంలో ఈ మేరకు అతడిని రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఐపీఎల్​లో సూపర్ ఫామ్​లో ఉన్న నరైన్ జూన్​లో జరగనున్న టీ20 ప్రపంచకప్​లోనూ రాణించగలడన్న నమ్మకంతో పావెల్ ఈ కామెంట్స్​ చేశాడు.

'ఏడాది నుంచి నరైన్​ను అడుగుతున్నా. మిగతా వాళ్లందరినీ అతడు దూరం పెట్టాడు. రిటైర్మెంట్ విషయంపై నరైన్‌తో మాట్లాడమని బ్రావో, పూరన్‌, పొలార్డ్‌ను కోరాను. పొట్టికప్​నకు వెస్టిండీస్ జట్టును ఎంపిక చేసేలోపు అతడిని ఒప్పిస్తారని ఆశిస్తున్నాను. ప్రస్తుత ఐపీఎల్​లోనూ నరైన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. బ్యాట్​తో ఆదరగొడుతూ కేకేఆర్​ జట్టుకు కీలకంగా మారాడు. అతడు తన ఫామ్​ను కొనసాగిస్తాడని ఆశిస్తున్నా' అని పావెల్ అన్నాడు. కాగా, 2019లో భారత్​తోనే అతడు చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. ఇక గతేడాది అంతర్జాతీయ రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఇక 2024 ఐపీఎల్​లో సునీల్ నరైన్ అదరగొడుతున్నాడు. ఆల్​రౌండ్​ పెర్ఫార్మెన్స్​తో సూపర్ ఫామ్​లో దూసుకెళ్తున్నాడు. రీసెంట్​గా రాజస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో ఇన్నింగ్స్​ ఓపెనర్​గా వచ్చి అద్భుత శతకం (109 పరుగులు)తో సత్తా చాటాడు. ఈ సీజన్​లో ఇప్పటివరకూ 6 మ్యాచ్​ల్లో కలిపి నరైన్ 43.00 సగటు, 187.76 స్ట్రైక్​ రేట్​తో 276 పరుగుల చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ కూడా ఉంది. అటు బంతితోనూ రాణిస్తున్న నరైన్ 6.87 ఎకానమీ రేట్‌తో ఏడు వికెట్లు పడగొట్టాడు.

అయితే ఐపీఎల్​లో నరైన్​ను ఓపెనింగ్ బ్యాటర్​గా ప్రమోట్ చేసింది మాత్రం అప్పటి కోల్​కతా కెప్టెన్ గౌతమ్ గంభీర్. గతంలో జట్టుకు నరైన్ శుభారంభాలు ఇచ్చాడు. దూకుడైన బ్యాటింగ్​తో వేగంగా పరుగులు చేసేవాడు. అయితే గంభీర్ కేకేఆర్​ను వీడిన తర్వాత ఓపెనర్​గా నరైన్​కు తగిన అవకాశాలు రాలేదు. గంభీర్ టీమ్ మెంటార్​గా కేకేఆర్​లోకి తిరిగి రావడం వల్ల నరైన్​కు మళ్లీ ఓపెనర్​గా ఛాన్స్​లు వస్తున్నాయి.

సునీల్ నరైన్ షాకింగ్ డెసిషన్ - ఇంటర్నేషనల్ క్రికెట్​కు గుడ్​బై

500 క్లబ్‌లోకి సునీల్ నరైన్ - ఈ సీజన్‌లో తొలి జట్టుగా కోల్‌కతా ఘనత - IPL 2024 RCB VS KKR

Last Updated : Apr 18, 2024, 8:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.