Subhman Gill James Anderson Controversy :టీమ్ఇండియా యంగ్ సెన్సేషన్ శుభ్‌మన్ గిల్ తాజాగా ఐదో టెస్టులో సెంచరీతో రాణించాడు. అలా ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో రెండో శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే బ్యాటింగ్ సమయంలో ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్‌తో గిల్‌కు స్వల్ప వాగ్వాదం జరిగింది. అయితే నేడు (మార్చి 8న ) మ్యాచ్ ముగిసిన తర్వాత ఆ విషయంపై ఘటనపై గిల్ స్పందించాడు.
" నేను ఎలా ఆడాలని మా నాన్న కోరుకున్నారో అదే స్థాయిలో ఆడగలిగాను. తప్పకుండా నా గేమ్ పట్ల ఆయన గర్వపడతారు. బంతిలో అనుకున్నంత మేర కదలిక లేదు. అది బ్యాట్ మీదకు అస్సలు రాలేదు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం నాకు ఉంది. అందుకే, కాస్త అడ్వాంటేజ్ తీసుకుని అండర్సన్ బౌలింగ్‌లో దూకుడు చూపించాను. ప్రతిసారీ మంచిగా ఆడేందుకు ప్రయత్నిస్తుంటాను. కొన్ని సార్లు వాటిని నేను భారీ స్కోర్లుగా మలచలేకపోవచ్చు. కానీ, నాణ్యమైన ఆటతీరును కనబరుస్తున్నాననే అనుకుంటాను. ఇక అండర్సన్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన తర్వాత జరిగిన సంభాషణ గురించి మాట్లాడటం బాగోదు. మేం ఏం అనుకున్నామనేది బయటకు చెప్పకుండా ఉంటేనే మంచిది" అంటూ గిల్ పేర్కొన్నాడు.
India Vs England 5th Test : ధర్మశాల వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టీమ్ఇండియా 255 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 218 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 473/8 స్కోరుతో నిలిచింది. ఇంగ్లాండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ (4/170) నాలుగు వికెట్లు తీసినప్పటికీ, భారత జట్టును నియంత్రించలేకపోయాడు. ప్రస్తుతం క్రీజ్‌లో కుల్‌దీప్ యాదవ్ (27*), బుమ్రా (19*) ఉన్నారు. రోహిత్ శర్మ 154 బంతుల్లో సెంచరీ (103) అందుకున్నాడు. ఇక శుభ్‌మన్ గిల్ (110) కూడా శతకంతో చెలరేగిపోయాడు. అలా రెండో వికెట్ సమయానికి రోహిత్, గిల్ ఏకంగా 161 పరుగులు పార్ట్నర్షిప్ జోడించారు.