Stephen Fleming T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా ఆటతీరును, నిర్ణయాలను న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రశంసించాడు. భారత్‌కి ఫైనల్ చేరే అర్హత ఉందని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ- విరాట్ కోహ్లీ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని కొనసాగించాలనే భారత జట్టు నిర్ణయానికి ఫ్లెమింగ్ మద్దతు ఇచ్చాడు. ప్లేయింగ్ 11 నుంచి యశస్వి జైస్వాల్ లాంటి ఓపెనర్‌ను పక్కన పెట్టడం కూడా జట్టుకు కష్టమైన పనని తెలిపాడు.
"మీకు స్పష్టమైన ప్రణాళిక ఉన్నప్పటికీ, జైస్వాల్ వంటి అత్యుత్తమ క్వాలిటీ ప్లేయర్‌ని పక్కన పెట్టడం కష్టమైన నిర్ణయం. స్క్వాడ్‌ని మేనేజ్ చేయడంలో సవాళ్లు ఉన్నప్పటికీ, సెలెక్టర్లు తమ ప్రణాళికకు కట్టుబడి, కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు." అని తెలిపాడు. ఉత్తమ స్పిన్నర్లు, స్పిన్ అద్భుతంగా ఆడే బ్యాటర్లతో టీమ్ ఇండియా ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించేందుకు సిద్ధంగా ఉందని ఫ్లెమింగ్ అభిప్రాయపడ్డాడు.
"నా దృష్టిలో. ఈ జట్టు ఫైనల్స్‌కు బాగా సరిపోతుంది. ఆధిపత్యం చెలాయించే నైపుణ్యం కలిగిన స్పిన్నర్లు ఉన్నారు. భారత బ్యాటర్లు ఇతర జట్ల స్పిన్నర్లపై కూడా పరుగులు చేయగలరు. వెస్టిండీస్ పిచ్‌లపై స్పిన్ ముఖ్యమైన పాత్ర పోషించడం మనం చూశాం. కాబట్టి భారత్ సెమీ-ఫైనల్, ఫైనల్స్‌కు చేరుకోవడమే లక్ష్యంగా చురుకైన గేమ్‌ప్లాన్‌తో సన్నద్ధమైందని నేను నమ్ముతున్నాను. రాహుల్, ఇతర మేనేజ్‌మెంట్ ప్లేయింగ్ కండిషన్స్‌ని సరిపోతుందనుకునే జట్టునే ఎంపిక చేశారు. సక్సెస్ కావడానికి ఉత్తమమైన అవకాశాన్ని ఇస్తారని విశ్వసించే బ్యాలెన్స్‌డ్ టీమ్‌ని సెలక్ట్ చేశారు. మారుతున్న పరిస్థితుల కారణంగా జట్టును ఎంపిక చేయడం కొంత ట్రయల్ అండ్ ఎర్రర్‌ను కలిగి ఉన్నప్పటికీ, వారు తమ ఎంపికపై నమ్మకంగా ఉన్నారు. ఓవరాల్‌గా, పెద్ద టోర్నీని టీమ్ పాజిటివ్‌గా ఎదుర్కొంటోందని, మంచి ఫలితాలు రాబడుతుందని కెప్టెన్ నమ్మకంగా ఉన్నాడు." అని ఫ్లెమింగ్ వివరించాడు.
సూపర్ 8లో కుల్దీప్ ఎంట్రీ
కొందరు క్రికెట్ నిపుణుల ప్రకారం, సూపర్ 8 మ్యాచుల్లో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. స్పిన్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లో ఒకరు చోటు కోల్పోతారు. వెస్టిండీస్ పిచ్‌లు, గత రికార్డులను పరిశీలిస్తే జడేజా కంటే అక్షర్ మెరుగ్గా ఉన్నాడనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో జడేజాని తప్పించి కుల్దీప్‌ని ఎంపిక చేయవచ్చని భావిస్తున్నారు.
నికోలస్ పూరన్ విధ్వంసం - ఒకే ఓవర్లో 36 పరుగులు - T20 Worldcup 2024
టీమ్ఇండియాలో వాళ్లిద్దరే కీలకం- రోహిత్, విరాట్ కాదు!- ఎవరంటే? - T20 World Cup 2024