KL Rahul RCB 2025: స్టార్ బ్యాటర్ కే ఎల్ రాహుల్ 2025 ఐపీఎల్లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టును వీడతాడని కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే అతడు వచ్చే సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీతో చేరతాడని రూమర్స్ క్రియేట్ అయ్యాయి. అయితే ఈ వార్తలు రాహుల్ దాకా చేరినట్లున్నాయి. దీంతో అతడు ఆర్సీబీ జట్టుకు వెళ్తాడా? అన్న దానికి హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆర్సీబీ ఫ్యాన్ ఒకరు రాహుల్‌తో మాట్లాడిన వీడియో రికార్డ్ చేశారు. తను ఆర్సీబీకి ఆడితే చూడాలని ఉందంటూ రాహుల్‌ను కోరాడు. దీనికి రాహుల్ నవ్వుతూ 'లెట్స్ హోప్' అని రిప్లై ఇచ్చాడు. 'నేను ఆర్సీబీ జట్టుకు వీరాభిమానిని. చాలా కాలంగా ఆర్సీబీని ఫాలో అవుతున్నా. నువ్వు కూడా గతంలో ఆర్సీబీకి ఆడావు. ప్రస్తుతం వైరల్ అవుతున్న రూమర్స్ గురించి నేను ఏం మాట్లాడను. కానీ, నువ్వు ఆర్సీబీకి ఆడాలని కోరుకుంటున్నా' అని బెంగళూరు అభిమాని రాహుల్‌తో అన్నాడు. దానికి రాహుల్ 'లెట్స్ హోప్' అని బదులిచ్చాడు. అంతే ఇక ఈ వీడియోను ఆర్సీబీ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. 'రాహుల్‌కు ఆర్సీబీ ఫ్రాంచైజీపై మంచి అభిప్రాయం ఉంది', 'రాహుల్ ప్లీజ్ ఆర్సీబీకి వచ్చెయ్' అంటూ బెంగళూరు ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
I'm happy that KL Rahul knows about the rumours that are going around for him & RCB.
— Kunal Yadav (@Kunal_KLR) September 14, 2024
Please boss change your IPL team! 🙏❤️ pic.twitter.com/Os06Uj39gQ
కాగా, 2013లో రాహుల్ ఆర్సీబీ జట్టుతోనే ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2014, 2015 సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక మళ్లీ 2016లో ఆర్సీబీకి తిరిగి వచ్చిన రాహుల్ గాయం కారణంగా 2017 ఎడిషన్‌లో బరిలోకి దిగలేదు. ఇక 2018 ఆర్సీబీ అతడిని వదులుకుంది. దీంతో రాహుల్ పంజాబ్ కింగ్స్ జట్టుకు మారాడు. 2021 దాకా పంజాబ్‌తో ఉన్న రాహుల్ ఆ తర్వాత లఖ్‌నవూ ఫ్రాంచైజీకి ఛేంజ్ అయ్యాడు.
అయితే 2024 ఐపీఎల్లో సన్‌రైజర్స్‌తో మ్యాచ్ ఓడిన తర్వాత లఖ్‌నవూ ఓనర్ సంజీవ్ గోయెంకా కెప్టెన్ రాహుల్‌పై కెమెరాల ముందే అసంతృప్తి వ్యక్తం చేశాడు. అందరిముందే రాహుల్‌తో కోపంగా మాట్లాడాడు. దీంతో అప్పటి నుంచి రాహుల్ జట్టు మారడతాడని వార్తలు వస్తున్నాయి. కానీ, ఆ తర్వాత తనకు రాహుల్‌తో మంచి బంధం ఉందని సంజీవ్ గోయెంకా పలుమార్లు చెప్పారు.
Sanjiv Goenka trashed KL Rahul on live stream, he is the same guy who insulted and sacked MSD mid season!!
— Rajiv (@Rajiv1841) May 8, 2024
Good, KL Rahul deserves it..... pic.twitter.com/RFCpnWCsJp
వైరల్‌గా కేఎల్ రాహుల్ ఇన్‌స్టా పోస్ట్ - రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా? - KL Rahul Retirement