ETV Bharat / sports

ఒలింపిక్స్​లో టేబుల్ టెన్నీస్​ స్టార్స్ - తెలుగు తేజం శ్రీజ ఆకుల సక్సెస్​ జర్నీ తెలుసా? - Paris Olympics 2024 - PARIS OLYMPICS 2024

ఓ వైపు చదువు, మరోవైపు టేబుల్ టెన్నిస్. ఇలా రెండింట్లోనూ రాణించింది ఓ తెలుగమ్మాయి. ఫిట నెస్ కోసం టీటీలోకి అడుగుపెట్టిన ఆ యువతి ప్రస్తుతం భారత్ తరఫున పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొననున్నారు. మరెందుకు ఆలస్యం తెలుగు తేజం ఆకుల శ్రీజ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Sreeja Akula Paris Olympics 2024
Sreeja Akula Paris Olympics 2024 (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 24, 2024, 12:43 PM IST

Sreeja Akula Paris Olympics 2024 : ఆమె తక్కువగా మాట్లాడుతారు. కానీ ఎప్పుడూ ఆమె విజయాలే ఎక్కువ మాట్లాడతాయి. తెలుగమ్మాయి ఆకుల శ్రీజ డబ్ల్యూటీటీ కంటెండర్‌ సింగిల్‌ టైటిల్​ను గెలుచుకున్న తొలి భారతీయ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం భారత్ తరఫున పారిస్‌ ఒలింపిక్స్​కు పాల్గొననుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన గురించి చెప్పుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే.

ఆ ఆత్మవిశ్వాసంతో పారిస్ ఒలింపిక్స్​లోకి
మా నాన్న ప్రవీణ్‌ కుమార్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలో, అమ్మ సాయిసుధ ఎల్‌ఐసీలో పనిచేస్తున్నారు. అక్క రవళికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉంటోంది. నేను టేబుల్​ టెన్నీస్​ను ఎనిమిదేళ్లప్పుడు మొదలుపెట్టాను. నిజానికి నాన్నకి ఈ ఆటంటే చాలా ఇష్టం. పాఠశాల స్థాయిలో ఆడేవారు. కానీ ఆర్థికంగా మద్దతు లేక ముందుకు వెళ్లలేకపోయారు. మా అక్క చిన్నప్పుడు చాలా యాక్టివ్​గా ఉండేది. దాంతో తనని టీటీలో ప్రోత్సహించారు. మా అక్క రవళి రోజూ ప్రాక్టీస్​కు వెళ్లేది. మెడల్స్‌ గెలిచేది. నేనూ ఆడుతానన్నాను. దానికితోడు నేను చిన్నప్పుడు చాలా నిరసంగా ఉండేదాన్ని. వ్యాధినిరోధక శక్తి కూడా తక్కువే. స్ట్రాంగ్‌ అవుతాననీ, ఫిట్​నెస్‌ ఉంటుందని, గ్లోబల్‌ అకాడమీలో మా నాన్న జాయిన్‌ చేశారు. అలా ఈ క్రీడలోకి ఎంట్రీ ఇచ్చాను." అని శ్రీజ తెలిపారు.

ఆ రెండింటి మధ్య డైలమా
చదువా? ఆటా అనే రెండింటి మధ్య నాకు ఓ డైలమా ఉండేది. పదోతరగతి వరకూ అది అలాగే కొనసాగింది. అయితే 2009లో తొలిసారి నేషనల్‌ మెడల్‌ వచ్చినప్పటి నుంచి ఆటవైపు మొగ్గు చూపాను. అమ్మానాన్నలిద్దరూ జాబ్స్ చేయడం వల్ల చాలా కష్టం అయ్యింది. నాన్నకి చాలాసార్లు బదిలీ అయ్యేది. అప్పుడు అమ్మ అన్నీ చూసుకోవాల్సి వచ్చేది. ఆఫీసు మధ్యలో ఇంటికి వెళ్లడం, రావడం జరిగేది. మాకోసం బైక్ నడపడం నేర్చుకుంది. మా అమ్మే టీటీ ప్రాక్టీస్‌ కు తీసుకెళ్లేది. ఆమె తీసుకొచ్చేది. మా ఇంట్లో తాతయ్య, నానమ్మ ఉండేవారు. అమ్మ మాతో ఉంటే నానమ్మ ఇల్లు చూసుకొనేది.

కొందరు మమ్మల్ని అలా అనేవారు!
అమ్మాయిలకు చదువుంటే చాలు ఆటలెందుకని కొందరు అనేవారు. కానీ అక్కా, నేను బాగా చదివేవాళ్లం. "మాకు ఏది ఇష్టమో అదే చేయాలని అనుకునేవారు అమ్మానాన్న. మా అమ్మ అయితే మేం చదువులో ఎక్కడా వెనకబడకుండా ఉండేలా చూసుకొనేది. రైల్వేస్టేషన్‌, ఎయిర్‌ పోర్టులో కూడా మేము చదువుకొనేవాళ్లం. ఇండియాలో ఎక్కడ టోర్నమెంట్‌ జరిగినా అమ్మ తోడుగా ఉండేది. నాకు చదువు, టీటీ తప్ప మరో వ్యాపకం లేదు. మా గేమ్స్, చదువు కోసమే అమ్మానాన్నలు తాపత్రయపడేవారు.

ఆ గేమ్​ ఫుల్​ ఛాలెంజింగ్
2022 కామన్‌ వెల్త్‌ గేమ్స్ ఫస్ట్‌ టైమ్‌ లైవ్‌ టెలికాస్ట్​ అయిన సమయంలో చాలా భయం వేసింది. ఆ సమయంలో మా ట్రైనర్‌ గాయత్రి నాకు మానసికంగా ఇచ్చిన శిక్షణ ఎంతో ఉపయోగపడింది. చిన్నప్పటి నుంచి పోడియంపై ఎంతోమందిని చూసేదాన్ని. నేనూ అలా మెడల్‌ అందుకోవాలని అనుకొనేదాన్ని. టేబుల్‌ టెన్నిస్​లో నా రోల్‌మోడల్‌ శరత్‌ కమల్‌. అలాగే సచిన్‌ తెందూల్కర్ , సైనా నెహ్వాల్‌ అంటే నాకు చాలా ఇష్టం. సోమాజిగూడలో ఉంటూనే కేపీహెచ్​బీలో ఉండే కోచింగ్‌ సెంటర్​కు ప్రయాణిస్తుంటారు. లంచ్‌ తర్వాత మళ్లీ మెట్రో, ఆటోలోనో అకాడమీకి వెళ్తుంటాను. రాత్రి వరకూ ప్రాక్టీస్ చేస్తాను. ఫ్యాషన్, సోషల్‌ మీడియా పట్ల నాకు పెద్దగా ఇంట్రస్ట్ లేదు.

అన్నీ అక్కతో చెప్పుకుంటా
తనకు సంబంధించిన అన్ని విషయాల గురించి అక్కతో చెప్పుకుంటా అని శ్రీజ తెలిపింది. వీలుచిక్కినప్పుడల్లా ఇంట్లో వాళ్లతో కూర్చుని మాట్లాడుతుందట. ఇంకా టైమ్ ఉంటే మైథలాజికల్‌ స్టోరీస్‌ చదువుతుందట. భజనలు అంటే కూడా శ్రీజకు ఇష్టమట.

టీవీ చూడటం ఇష్టం లేదు కానీ
చిన్నప్పటి నుంచి టీవీ తక్కువ చూసేదాన్ని. 'చక్‌ దే ఇండియా', 'మేరీకోమ్', 'ఉరీ' లాంటి సినిమాలు చూడటం నాకు చాలా ఇష్టం. అలాగే స్పోర్ట్స్‌ సినిమాలు కూడా బాగా చూస్తాను. బీకామ్‌ పూర్తయ్యాక 2017లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగం వచ్చింది. సీనియర్‌ కేటగిరీలో ఆడటానికి కాస్త బెరుకుగా ఉండేదాన్ని. అయితే కోచ్‌ సోమనాథ్‌ ఘోష్‌ నాకు చాలా సపోర్ట్‌ చేశారు. డ్రీమ్స్‌ స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ వాళ్లు మెంటల్‌ ఫిట్​నెస్‌ ట్రైనర్, డైటీషియన్‌ వంటి సదుపాయాలను నాకు అందించారు.

ఒలింపిక్స్​లో ప్రవాస భారతీయులు - ఏయే క్రీడల్లో ఉన్నారంటే? - Paris Olympics 2024

పారిస్ ఒలింపిక్స్ మస్కట్ విశేషాలివే - పెద్ద చరిత్రే ఉంది! - PARIS OLYMPICS 2024 MASCOT

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.