ETV Bharat / sports

'కెమెరాల మధ్య అలా చేయడమేంటి?- అది జరగాల్సింది నాలుగు గదుల లోపల' - KL Rahul Sanjiv Goenka

KL Rahul Sanjiv Goenka: సన్​రైజర్స్​తో ఓటమి అనంతరం లఖ్​నవూ కెప్టెన్ రాహుల్ పట్ల ఓనర్ సంజీవ్ గోయెంకా తీరును మాజీ క్రికెటర్ గ్రేమ్ స్మిత్ తప్పుబట్టాడు.

KL Rahul Sanjiv Goenka
KL Rahul Sanjiv Goenka (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 9, 2024, 1:24 PM IST

Updated : May 9, 2024, 2:51 PM IST

KL Rahul Sanjiv Goenka: లఖ్​నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ పట్ల ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా ప్రవర్తించిన తీరును సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ గ్రేమ్ స్మిత్ తప్పుబట్టాడు. మ్యాచ్ అనంతరం సంజీవ్ గోయెంకా ప్రవర్తన తనను ఆశ్చర్యానికి గురిచేసిందని స్మిత్ అన్నాడు. అలాంటి చర్చలు పర్సనల్​గా నాలుగు గదుల లోపల జరిగితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.

బుధవారం సన్​రైజర్స్- లఖ్​నవూ మ్యాచ్ అనంతరం స్మిత్ జియో సినిమా చిట్​చాట్​లో మాట్లాడాడు. 'ఓ యజమాని తన జట్టు పట్ల ప్రేమ కలిగి ఉండడం సహజమే. కానీ, అప్పటికే భారీ ఓటమితో జట్టు ప్లేయర్లంతా ఎమోషనల్​గా కుంగిపోయి ఉన్నారు. మ్యాచ్ ఫలితంపై చర్చించాలనుకుంటే అది సరైన సందర్భం కాదు. ఇలాంటివి నాలుగు గదుల లోపల మాట్లాడుకోవాలి. అక్కడ చుట్టూ కెమెరాలు ఉన్నాయి. కెమెరాలు ఏదీ మిస్ అవ్వకుండా అన్ని సన్నివేశాలను బంధిస్తాయి' అని స్మిత్ అన్నాడు.

జరిగింది ఇదీ: అయితే బుధవారం సన్​రైజర్స్​తో జరిగిన మ్యాచ్​లో లఖ్​నవూ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ప్లేఆఫ్స్ అవకాశాలను లఖ్​నవూ మరింత సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం లఖ్​నవూ ఓనర్ సంజీవ్, కెప్టెన్ రాహుల్​తో అసంతృప్తితో మాట్లాడినట్లు కనిపించారు. గోయెంకా కోపంగా రాహుల్‌తో ఏదో అన్నట్టుగా వీడియోలో కనిపిస్తోంది. రాహుల్ ఏదో చెప్పేందుకు ప్రయత్నించినా గోయెంకా వినడానికి ఇష్టపడలేదు. ఇంతలోనే అక్కడకు కోచ్ జస్టిన్ లాంగర్ రాగా, రాహుల్ అక్కడి నుంచి నిరాశగా వెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. మరి అక్కడ జరిగిన సంభాషణ గురించి తెలియాలంటే లఖ్​నవూ యాజమాన్యం స్పందించాల్సిందే.

ఇక మ్యాచ్ విషయానికొస్తే కెప్టెన్ కేఎల్ రాహుల్​ (33 బంతుల్లో 29 రన్స్‌) జిడ్డు బ్యాటింగ్ చేశాడు. దీనిపై కూడా ట్రోల్స్ వస్తున్నాయి. లఖ్​నవూ జట్టు మొదట నిర్ణీత 20 ఓవర్లలో 165/4 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో 166 పరుగలను కేవలం 58 బంతుల్లోనే ఉఫ్ అని ఊదేసింది సన్​రైజర్స్​. దీంతో వరుసగా రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడిన లఖ్​నవూ సూపర్ జెయింట్స్ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో లఖ్​నవూ(LSG Points Table) 12 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది.

కేఎల్ రాహుల్‌పై విరుచుకుపడ్డ లఖ్​నవూ యజమాని! - వైరల్​ వీడియో చూశారా? - IPL 2024 LSG

కోల్​కతా ప్లేయర్స్​కు తప్పని తిప్పలు - రెండు సార్లు ఫ్లైట్ దారి మళ్లింపు! - IPL 2024 KKR

Last Updated : May 9, 2024, 2:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.