ETV Bharat / sports

'గంభీర్ సరైనోడే, వాళ్లను డీల్ చేయడం అతడికి తెలుసు' - India Head Coach - INDIA HEAD COACH

Ganguly On Gautam Gambhir: భారత ప్రధాన కోచ్‌గా ఎవరు వస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ ఎంపిక లాంఛనమేనంటూ ప్రచారం సాగుతోంది. దీనిపై మాజీ క్రికెటర్ గంగూలీ స్పందించాడు.

India Head Coach
India Head Coach (Source: Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 1, 2024, 6:23 PM IST

Ganguly On Gautam Gambhir: టీమ్ఇండియా హెడ్​కోచ్ ఎంపికపై క్రీడా వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈక్రమంలో మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ ఎంపిక దాదాపు ఖరారైందని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ కోచ్​గా వస్తే మాత్రం జట్టులో మంచి మార్పు తీసుకొస్తాడని అభిప్రాయపడ్డాడు.

'కోచ్ పదవికి గంభీర్ అప్లై చేసుకున్నాడో లేదో తెలీదు. కానీ, కోచ్​గా గంభీర్ ఎంపికైతే మాత్రం అది మంచి నిర్ణయమే. గంభీర్ నిజాయితీపరుడు. ఐపీఎల్​లో కోల్​కతాను మెంటార్​గా విజయవంతంగా నడిపించాడు. టీమ్ఇండియాకు హెడ్​కోచ్ అయ్యేందుకు అన్ని లక్షణాలు గంభీర్​కు ఉన్నాయి. కానీ, ఐపీఎల్ ఫ్రాంచైజీకి మెంటార్​గా పని చేయడం, ఇంటర్నేషనల్ టీమ్​కు కోచ్​గా వ్యవహరించడం రెండూ భిన్నమైన పాత్రలు. భారత్ వంచి అత్యుత్తమ జట్టు విషయంలో ఇది ఇంకా ఒత్తిడితో కూడుకొని ఉంటుంది. అయితే గౌతమ్‌ గంభీర్‌కు ఇలాంటి వాటిపై పూర్తి అవగాహన ఉంది. విరాట్, రోహిత్ వంటి స్టార్లను ఎలా డీల్‌ చేయాలనేది తెలుసు. డ్రెస్సింగ్‌ రూమ్‌ పరిస్థితులను త్వరగా అలవర్చుకుని కలిసిపోతాడు. తన ఉద్దేశాలే కాకుండా జట్టులోని సభ్యుల ఆలోచనలనూ రిగణనలోకి తీసుకుంటాడు. తప్పకుండా గొప్ప హెడ్‌ కోచ్‌ అవుతాడనడంలో సందేహం లేదు. కానీ, ఈ పదవిని తీసుకోవడానికి అతడు అంగీకరిస్తాడా? లేదా? అనేది ఆసక్తికరం' అని గంగూలీ అన్నాడు.

ఇక ఇప్పుడున్న కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవి ఈ నెలలోనే ముగుస్తుంది. కొత్తగా బాధ్యతలు చేపట్టే వ్యక్తి 2027 వన్డే ప్రపంచకప్‌ వరకు కొనసాగుతాడు. చూడాలి మరి బీసీసీఐ ఎవరివైపు మొగ్గు చూపుతుందో? టీమ్ఇండియా కొత్త కోచ్​గా ఎవరు ఎంపికవుతారో? ఈ సస్పెన్స్​కు త్వరలోనే ఎండ్ కార్డ్ పడే ఛాన్స్ ఉంది. కాగా, టీమ్ఇండియా ప్రస్తుతం టీ20 వరల్డ్​కప్​కు సిద్ధమవుతోంది. టోర్నీ ప్రారంభం కంటే ముందుగా శనివారం బంగ్లాదేశ్​తో ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది. ఇక జూన్​ 5న ఐర్లాండ్​తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. జూన్​ 9న పాకిస్థాన్​తో తలపడనుంది.

'ఏదైనా ఎక్కువగా చెప్పను- కెరీర్​లో నేర్చుకున్నది ఇదే'

టీ20 వరల్డ్​ కప్​ లైవ్​లో చూడాలా? టైమింగ్స్ తెలుసా? అసలే USలో మ్యాచులు కదా! - T20 World Cup 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.