ETV Bharat / sports

టాప్​ కంపెనీలో ఇంటర్న్​గా స్టార్​ క్రికెటర్ తనయ - డిగ్రీ పూర్తికాకుండానే భారీ సంపాదన!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 26, 2024, 11:02 AM IST

Sourav Ganguly Daughter Internship : ఆ యువతీ మాజీ స్టార్ క్రికెటర్ కూతురు, డాన్స్​తో సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్​లో ఉంటుంది. అయితే ఇప్పుడు డ్యాన్స్​లోనే కాదు చదువులోనూ టాప్ అని నిరూపిస్తోంది. తన ట్యాలెంట్​తో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సలహా మండలిలో ఇంటర్నెషిప్ చేస్తోంది. అయితే దానికి గాను ఆమె అందుకుంటున్న స్టైఫండ్​ గురించి తెలిస్తే అందురూ షాకవ్వాల్సిందే. ఇంతకీ ఆ యువతి స్టైఫండ్ ఎంతంటే ?

Sourav Ganguly Daughter Internship
Sourav Ganguly Daughter Internship

Sourav Ganguly Daughter Internship : మాజీ బీసీసీఐ అధ్యక్షుడు , టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఆట తీరుతో అందరినీ అబ్బురపరిచిన ఈ స్టార్​ క్రికెటర్​, అధ్యక్ష పదవిలోనూ కీలక బాధ్యతలు చేపట్టి తన కెరీర్​లో ఎన్నో మైల్​ స్టోన్స్ అందుకున్నారు. ఇక దాదా లాగే తన ముద్దుల తనయ కూడా ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది.

సౌరభ్​ గారాల పట్టి సనా గంగూలీ సోషల్ మీడియాలో తన డ్యాన్స్ తో ఎప్పుడూ ట్రెండింగ్​లో ఉంటుంది. చిన్నపటి నుంచే తన డ్యాన్స్​ మూవ్స్​తో పాపులరైన ఈ చిన్నారి చదువులోనూ నంబర్ వన్ అనిపించుకుంటోంది. తన పాఠశాల విద్యను మెత్తం కోల్​కతాలోని లోరెటో హౌస్ స్కూల్​లో పూర్తి చేసిన ప్రస్తుతం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్​లో ఎకనామిక్స్ ఫైనల్ ఇయర్​ చదువుతోంది.

Sana Ganguly Stipend : స్కూల్​ డేస్​లో చురుకైన స్టూడెంట్ అయిన సనా గంగూలీ యూసీఎల్ కాలేజీలో చదువుకుంటూనే పలు కంపెనీల్లో ఇంటర్నషిప్​లు చేసింది. ఇది అందరూ చేసేదా కదా ఇందులో ఏం ప్రత్యేకత ఉంది అని అనుకునేరు. అయితే సనా ఇంకా డిగ్రీ కూడా పూర్తి చేయకుండానే భారీ స్థాయిలో స్టైఫండ్ అందుకుంటూ అందరి చేత ఔరా అనిపిస్తోంది. ఆమె 2022 జూన్ నుంచి "పీడబ్ల్యూసీ " అనే ఆర్థిక సలహా మండలిలో ఇంటర్న్​గా పని చేస్తోంది. దానికి గాను సనా ఏడాదికి 30 లక్షల స్టైఫండ్​ను​ అందుకుంటోందట. ఒక్కప్పుడు డ్యాన్సింగ్ క్వీన్​గా రాణించిన సనా, ఇప్పుడు యంగ్ ఫైనాన్షియల్​ అడ్వైజర్​గా ఎంతో మంది నిపుణలకు దీటుగా నిలుస్తూ ఆర్థిక సలహాలిస్తోంది. అంతకుముందు హెచ్ ఎస్ బీసీ, గోల్డ్ మన్ శాక్స్ వంటి బహుళజాతి కంపెనీలతో ఇంటర్న్​షిప్​లు చేసింది అక్కడ కూడా తన సత్తా చాటింది. ఇది విన్ననెటిజన్లు ఔరా అన్నప్పటికీ ఈ చిన్నారి ట్యాలెంట్​ను మెచ్చుకుంటూ తనకు కంగ్రాజ్యులేషన్​ చెప్తున్నారు. తనను ఇన్​స్పిరేషన్​గా తీసుకుని మరికొందరుఇలాంటి ఎత్తులకు ఎదగాలని కోరుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.