ETV Bharat / sports

10 వికెట్లతో స్నేహ్ అరుదైన ఫీట్​ - ఈ రికార్డు అందుకున్న తొలి భారతీయ స్పిన్నర్​గా! - IND Vs SA Womens Test - IND VS SA WOMENS TEST

Sneh Rana IND Vs SA Womens Test : సౌతాఫ్రికా మహిళలతో తాజాగా జరిగిన టెస్ట్ క్రికెట్​లో టీమ్ఇండియా ప్లేయర్​ స్నేహ్ రాణా ఓ అరుదైన రికార్డును అందుకుంది. ఈ మ్యాచ్​లో ఏకంగా పది వికెట్లు పడగొట్టి, ఈ ఫీట్ సాధించిన తొలి భారత స్పిన్నర్‌గా చరిత్రకెక్కింది.

Sneh Rana IND Vs SA Womens Test
Sneh Rana (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 1, 2024, 6:45 PM IST

Updated : Jul 1, 2024, 6:55 PM IST

Sneh Rana IND Vs SA Womens Test : సౌతాఫ్రికా మహిళలతో తాజాగా జరిగిన టెస్ట్ క్రికెట్​లో టీమ్ఇండియా అమ్మాయిలు రాణించారు. సఫారీలపై 10 వికెట్ల తేడాతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో టీమ్ఇండియాకు చెందిన యంగ్ క్రికెటర్ స్నేహ్ రాణా ఓ అరుదైన ఘనత సాధించింది. ఈ మ్యాచ్​లో ఏకంగా పది వికెట్లు పడగొట్టి, ఈ ఫీట్ సాధించిన తొలి భారత స్పిన్నర్‌గా చరిత్రకెక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లను నేలకూల్చి సౌతాఫ్రికాను చిత్తు చేసిన స్నేహ్​, ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లోనూ రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకుంది.

ఇదిలా ఉండగా, ఈ లిస్ట్​లో ఈమెకంటే ముందు సీనియర్ ప్లేయర్ జులాన్ గోస్వామి ఉండటం విశేషం. 2006లో ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్‌లో ఆమె 10 వికెట్లు పడగొట్టారు. అయితే స్పిన్నర్లలో మాత్రం ఈ ఘనత నమోదు చేసిన తొలి భారత ప్లేయర్ రికార్డు మాత్రం స్నేహ్ పేరిటనే ఉంది.

దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సోమవారం రెండో ఇన్నింగ్స్‌ (ఫాలోఆన్‌)ను 232/2 స్కోరుతో ఆరంభించిన దక్షిణాఫ్రికా.. 373 పరుగులకు ఆలౌటై భారత్‌కు 37 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టార్గెట్‌ని టీమ్‌ఇండియా 9.2 ఓవర్లలో పూర్తి చేసింది. షఫాలీ వర్మ (24*), శుభా సతీష్ (13) పరుగులు చేశారు.

తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 603/6 రికార్డు స్కోరు సాధించి డిక్లేర్డ్ చేయగా, షెఫాలి వర్మ (205), స్మృతి మంధాన (149)మరోసారి సత్తాచాటారు. వీరితో పాటు రిచా ఘోష్‌ (86), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (69), జెమీమా రోడ్రిగ్స్‌ (55) కూడా తమ ఇన్నింగ్స్​లో రాణించారు.

ఆఫ్‌ స్పిన్నర్‌ స్నేహ్‌ రాణా (8/77) మెరుపుల వల్ల తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 84.3 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. మారిజేన్ కాప్ (74), సునే లూస్‌ (65) మాత్రమే రాణించడం వల్ల ఆ జట్టు ఫాలోఆన్‌ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లో లారా వోల్వార్ట్ (122), సునే లూస్ (109) శతకాలు బాదగా, నాడిన్ డిక్లెర్క్‌ (61) మాత్రం హాఫ్ సెంచరీ సాధించింది.

ఇక రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా బౌలర్లలో స్నేహ్‌ రాణా, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకోగా, పూజా వస్త్రాకర్‌, షెఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ తలో వికెట్ పడగొట్టారు.

భారత్​ x సౌతాఫ్రికా టెస్ట్​ - మన అమ్మాయిలే విన్

టీమ్ఇండియా అమ్మాయిలు భళా- టెస్టు హిస్టరీలో హైయ్యెస్ట్​ స్కోర్ - Ind W vs Sa W Test 2024

Last Updated : Jul 1, 2024, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.