Joe Root Test Century : లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో జో రూట్ అద్భుత సెంచరీ సాధించాడు. ఈ శతకంతో ఆలిస్టర్ కుక్ పేరిట ఉన్న సూపర్ రికార్డును సమం చేశాడు. అలానే కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, స్టీవ్ వాలను కూడా రూట్ అధిగమించడం విశేషం.
ఈ ఇన్నింగ్స్‌లో జో రూట్ 162 బంతుల్లో 13 బౌండరీల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. టెస్టు కెరీర్లో రూట్‌కు ఇది 33వ శతకం. తద్వారా టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్రిటీష్ క్రికెటర్‌గానూ రూట్ నిలిచాడు. గతంలో కుక్ పేరిట అత్యధిక(33) సెంచరీల రికార్డు ఉండేది. ఇప్పుడు దాన్నే రూట్ సమం చేశాడు.
జో రూట్ 145 టెస్టుల్లో 264 ఇన్నింగ్స్ ఆడి ఈ 33 సెంచరీలు మార్క్‌ను టచ్ చేశాడు. అంతకుముందు ఆలిస్టర్ కుక్ 161 టెస్టుల్లో 191 ఇన్నింగ్స్ ఆడి 33 శతకాలు బాదాడు. ఇకపోతే ఇంగ్లాండ్ క్రికెటర్లలో అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కుక్, రూట్ తర్వాత కెవిన్ పీటర్సన్ నిలిచాడు. అతడు 104 టెస్టుల్లో 181 ఇన్నింగ్స్‌లో 23 శతకాలు బాదాడు.
ఇంకా ఈ టెస్టు చరిత్రలో అత్యధిక శతకాలు సాధించిన బ్యాటర్ల జాబితాలో కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, స్టీవ్ వాలు కూడా ఉన్నారు. ఈ ముగ్గురు టెస్టుల్లో చెరో 32 సెంచరీలు సాధించారు. దీంతో జో రూట్ (33) తాజాగా వారిని అధిగమించినట్టైంది.
ఇకపోతే జో రూట్ రీసెంట్‌గానే టెస్టుల్లో 12 వేల పరుగులను(Joe Root Test Runs) పూర్తి చేసుకున్నాడు. తద్వారా అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో 7వ బ్యాటర్‌గా నిలిచాడు. మొత్తంగా అతడు 145 మ్యాచుల్లో 265 ఇన్నింగ్స్‌లో 50.71 యావరేజ్‌తో 12274 పరుగులు చేశాడు. ఇందులో 5 డబుల్ సెంచరీలు, 33 శతకాలు, 64 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
డేంజర్లో సచిన్ తెందుల్కర్ రికార్డ్ - 33 ఏళ్ల జో రూట్ ఫామ్ చూస్తుంటే సచిన్ తెందుల్కర్ రికార్డ్‌ను బ్రేక్ చేసేలా కనిపిస్తున్నాడు! సచిన్ అత్యధికంగా 15921 పరుగులు చేసి హైయెస్ట్ టెస్ట్ రన్ బ్యాటర్స్ జాబితాలో టాప్‌లో ఉన్నాడు. రూట్ 12274 పరుగులతో సచిన్‌కు 3647 పరుగుల దగ్గర్లోనే ఉన్నాడు. అలాగే టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన లిస్ట్‌లోనూ సచిన్ 51(1989-2013, 200 మ్యూచుల్లో) టాప్‌లో ఉన్నాడు. జో రూట్ కూడా ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే సచిన్ రికార్డుకు చేరుకోవచ్చు.
టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్స్ :
- సచిన్ తెందుల్కర్ - 51
- జాక్వెస్ కల్లిస్ - 45
- రికీ పాంటింగ్ - 41
- కుమార్ సంగక్కర - 38
- రాహుల్ ద్రవిడ్ - 36
- సునీల్ గవాస్కర్ - 34
- మహేల జయవర్ధనే - 34
- బ్రియాన్ లారా - 34
- యూనిస్ ఖాన్ - 34
- ఆలిస్టర్ కుక్- 33
- జో రూట్ - 33
డేవిడ్ వార్నర్‌ను రీప్లేస్ చేస్తాడనుకున్నారంతా - కానీ 26 ఏళ్లకే రిటైర్మెంట్! - Will Pukovskis Retirement
ICC ర్యాంకింగ్ సిస్టమ్- ఎలా లెక్కిస్తారో తెలుసా? - ICC Rankings System