ETV Bharat / sports

ఐపీఎల్​, డబ్ల్యూపీఎల్​ ఫైనల్​ - ఈ ఇంట్రెస్టింగ్​ పోలికలను గమనించారా? - IPL 2024 and WPL 2024 - IPL 2024 AND WPL 2024

IPL 2024 and WPL 2024 : ఐపీఎల్ 2024లో కోల్​కతా విజయానికి డబ్ల్యూపీఎల్ 2024లో బెంగళూరు జట్టు గెలుపు మధ్య కొన్ని ఆసక్తికర పోలికలు ఉన్నాయి. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. అవేంటంటే? Source The Associated Press

Source The Associated Press
IPL 2024 and WPL 2024 (Source The Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 27, 2024, 7:03 PM IST

IPL 2024 and WPL 2024 : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ఒకటి. బీసీసీఐ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 17 సీజన్లు కొనసాగింది. తాజా సీజన్​లో టోర్నీ మొత్తం అద్భుత ప్రదర్శనతో కోల్‌కతా నైట్‌ రైడర్స్ ఛాంపియన్‌గా(IPL 2024 Winner KKR) నిలిచింది. మూడో సారి కప్‌ను ముద్దాడింది. అయితే బీసీసీఐ మహిళల ఐపీఎల్​(డబ్ల్యూపీఎల్​) కూడా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. గతేడాది నుంచే ప్రారంభమైంది. ఆ సీజన్‌ విజేతగా రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఉమెన్ టీమ్ విజేతగా నిలిచింది. అయితే ఇప్పుడీ కోల్​కతా విజయానికి అప్పుడు బెంగళూరు జట్టు గెలుపు మధ్య కొన్ని ఆసక్తికర పోలికలు ఉన్నాయి. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

  • డబ్ల్యూపీఎల్ ఫైనల్‌లో దిల్లీ క్యాపిటల్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. దిల్లీకి ఆసీస్‌ ప్లేయర్ మెగ్‌ లానింగ్‌ కెప్టెన్సీ వహించగా బెంగళూరుకు భారత స్టార్‌ ప్లేయర్ స్మృతీ మంధాన కెప్టెన్సీ వహించింది.
  • ఐపీఎల్‌ ఫైనల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్​ను ఆసీస్ స్టార్ ప్లేయర్​ పాట్ కమిన్స్‌ నడిపించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్​ను భారత ప్లేయర్ శ్రేయస్‌ అయ్యర్ నడిపించాడు
  • డబ్ల్యూపీఎల్‌లో టాస్‌ గెలిచిన దిల్లీ క్యాపిటల్స్​ మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఐపీఎల్‌లోనూ సన్​రైజర్స్​ టాగ్ గెలిచి మొదట బ్యాటింగే చేసింది.
  • మొదట బ్యాటింగ్‌ చేసిన దిల్లీ క్యాపిటల్స్​ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ అయింది. ఐపీఎల్‌లోనూ సన్​రైజర్స్​ హైదరాబాద్​ 113 పరుగులే చేసింది.
  • డబ్ల్యూపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్​ నిర్దేశించిన లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పుడు ఐపీఎల్​లోనూ కోల్​కతా రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
  • WPL 2024లో ఆసీస్‌ ప్లేయర్‌ సోఫీ మోలినెక్స్‌ దక్కించుకుంది. ఐపీఎల్‌ ఫైనల్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డును ఆసీస్‌ క్రికెటర్‌ మిచెల్ స్టార్క్‌ అందుకున్నాడు.
  • ఫైనల్​గా రెండు టోర్నీల్లోనూ భారత జట్టుకు చెందిన ఆటగాళ్లు కెప్టెన్‌గా ఉన్న జట్లు ట్రోఫీని ముద్దాడాయి.

బలహీనతేలేని కోల్‌'కథ' - జట్టు విజయానికి కారణమిదే - IPL 2024 Winner KKR

IPL​ ప్రైజ్​మనీ- 'కోల్​కతా'కు రూ.20 కోట్లు- మరి ఎవరెవరికి ఎంతంటే? - IPL 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.