ETV Bharat / sports

గాయమని రంజీ మ్యాచ్‌కు దూరం - శ్రేయస్‌ ఫిట్‌గా ఉన్నాడంటున్న ఎన్‌సీఏ - శ్రేయస్ అయ్యర్ గాయం

Shreyas Iyer Ranji Trophy : గాయం కారణంగా ఇంగ్లాండ్ సిరీస్​కు దూరమైన శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే తాజాగా ఇతడు కూడా రంజీ ఆడేందుకు ఆసక్తి చూపించనట్లు తెలుస్తోంది.

Shreyas Iyer Ranji Trophy
Shreyas Iyer Ranji Trophy
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 12:55 PM IST

Shreyas Iyer Ranji Trophy : రంజీలో ఆడితేనే టీమ్ఇండియా జట్టులోకి ఎంట్రీ అంటూ బీసీసీఐ ఇచ్చిన హెచ్చరిక గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయాన్ని మాత్రం మన ప్లేయర్లు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. ఇప్పటికే ఈ లిస్ట్​లో పలుపురు ఆటగాళ్లు చేరగా, తాజాగా ఆ జాబితాలోకి శ్రేయస్‌ అయ్యర్‌ కూడా చేరాడా అన్న చర్చలు నెట్టింట మొదలయ్యాయి.

ఇటీవలే ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్​లో గాయపడ్డ ఈ స్టార్ క్రికెటర్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో శ్రేయస్ పూర్తిగా ఫిట్‌నెస్‌ సాధించిన తర్వాతనే అతడ్ని రంజీల్లో ఆడించాలంటూ బీసీసీఐ తాజాగా స్పష్టం చేసింది. అయితే, గాయం కారణంగా రంజీ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆటకు శ్రేయస్ అందుబాటులోకి లేదంటూ చెప్పుకొచ్చారు. అయితే జాతీయ క్రికెట్ అకాడమీ మాత్రం శ్రేయస్‌ పూర్తి ఫిట్‌గా ఉన్నాడంటూ చెప్పడం గమనార్హం. దీంతో బీసీసీఐ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే విషయంపై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో బరోడాతో ముంబయి శుక్రవారం నుంచి బరిలోకి దిగనుంది. అయితే, వెన్ను నొప్పి కారణంగా ఆ మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండలేనంటూ శ్రేయస్ ముంబయి క్రికెట్ అసోసియేషన్‌కు ఇటీవలే సమాచారం అందించాడు. దీంతో ఎన్​సీఏ కూడా అయ్యర్‌ ఆడటం లేదంటూ వెల్లడించింది. కానీ, జాతీయ క్రికెట్ అకాడమీ స్పోర్ట్స్‌ సైన్స్‌ అండ్‌ మెడిసిన్‌ హెడ్ నితిన్‌ పటేల్‌ నుంచి మాత్రం సెలక్టర్లకు తాజాగా ఓ మెయిల్‌ వెళ్లిందనే వార్తలు వెలువడుతున్నాయి.

" శ్రేయస్‌ అయ్యర్ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. రెండో టెస్టు తర్వాతే అతడు సెలక్షన్‌కు అందుబాటులోకి వచ్చాడు. అయితే జట్టు నుంచి వైదొలిగిన తర్వాత తాజాగా అతడికి ఎటువంటి గాయాలు లేవు" అని ఆ మెయిల్​లో నితిన్‌ పటేల్ పేర్కొన్నారు.

ఇదిలాఉండగా, బీసీసీఐ కాంట్రాక్ట్‌లో ఉన్న ప్రతి ప్లేయర్, ఫిట్‌గా ఉంటే కచ్చితంగా దేశవాళీ క్రికెట్‌లో ఆడాలంటూ బోర్డు తాజాగా స్పష్టం చేసింది. ఒకవేళ ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప ప్లేయర్లకు ఎటువంటి మినహాయింపు లభించదు. ఇప్పటికే ఇషాన్‌ కిషన్‌పై బీసీసీఐ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. రంజీల్లో ఆడకుండా ఇషాన్‌ వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ కోసం ప్రాక్టీస్‌ చేసుకుంటున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు శ్రేయస్‌ కూడా సరైన కారణం లేకుండా దూరం కావడంపై బీసీసీఐ చర్యలు తీసుకొనే అవకాశాలు ఉందనేది క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం.

'అయ్యర్ డొమెస్టిక్ క్రికెట్ ఆడడం బెటర్!'- శ్రేయస్​పై ఓజా షాకింగ్ కామెంట్స్

'అటువంటి అనవసర విషయాలను ఆలోచించను - అలానే ఉండాలనుకుంటున్నాను'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.