Shoaib Malik Match Fixing: పాకిస్థాన్ మాజీ ప్లేయర్ షోయబ్ మాలిక్‌కు షాక్ తగిలింది. బంగ్లాదేశ్ డొమెస్టిక్ టోర్నమెంట్ (Bangladesh Premier League 2024)లో ఆడుతున్న షోయబ్ ఫిక్సింగ్ వివాదాల్లో చిక్కుకున్నాడు. ఈ లీగ్‌లో ఫార్చ్యూన్ బరిషల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న షోయబ్, 'మ్యాచ్ ఫిక్సింగ్'కు (Match Fixing) పాల్పడ్డాడనే అనుమానంతో ఆ ఫ్రాంచైజీ అతడి కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. అయితే షోయబ్ ఈ టోర్నీకి బ్రేక్ ఇచ్చి రీసెంట్గా పాక్‌కు వెళ్లాడు. అంతలోనే అతడి కాంట్రాక్ట్ రద్దవడం హాట్‌టాపిక్‌గా మారింది.
ఏం జరిగిందంటే? ఈ టోర్నీలో భాగంగా జనవరి 22న ఖుల్నా టైగర్స్- ఫార్చ్యూన్ బరిషల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలి పవర్‌ప్లేలో బౌలింగ్ చేసిన షోయబ్ మాలిక్ ఒక ఓవర్లో వరుసగా మూడు 'నో బాల్' వేశాడు. దీంతో ఆ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. అయితే ప్రస్తుత క్రికెట్లో నో బాల్స్ చాలా అరుదుగా నమోదవుతున్నాయి. నో బాల్ వేస్తే బ్యాటర్‌కు ఫ్రీ హిట్ రూపంలో అదనపు లాభం ఉండడం వల్ల బౌలర్లు ఈ విషయంలో జాగ్రత్త పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్పిన్ బౌలర్ షోయబ్ ఒకే ఓవర్లో మూడుసార్లు నో బాల్ వేయడం వల్ల అనుమానాలకు దారితీసింది. దీంతో షోయబ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడన్న అనుమానంతో బరిషల్ ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుంది.
స్పందించిన షోయబ్: తనపై వస్తున్న ఫిక్సింగ్ వార్తలపై షోయబ్ స్పందించాడు.'నాపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. బీపీఎల్ నుంచి తప్పుకోవడంపై నా మీద అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఫార్చ్యూన్ బరిషల్ ఫ్రాంచైజీ నా కాంట్రాక్ట్ రద్దు చేయలేదు. నేను మా కెప్టెన్‌తో టచ్‌లోనే ఉన్నా. ముందుగా చేసుకున్న షెడ్యూల్ కారణంగా దుబాయ్ వెళ్లాల్సి వచ్చింది. నేను ఫార్చ్యూన్ బరిషల్ జట్టుతోనే కొనసాగుతున్నా. ప్రస్తుతం మా జట్టు బాగా ఆడుతోంది. తదుపరి మ్యాచ్‌ల్లో మా జట్టుకు నా అనసరం ఉంటే నేను కచ్చితంగా ఆడతాను. దయచేసి అబద్దాలు ప్రచారం చేయకండి' అని చెప్పాడు.
-
🚨 BREAKING: Fortune Barisal has terminated the contract of Shoaib Malik on the suspicion of "fixing". During a recent match, Malik, who is a spinner, bowled three no balls in one over. Mizanur Rahman, the team owner of Fortune Barishal, has confirmed the news. #BPL2024 pic.twitter.com/wOh6yE6hoT
— Syed Sami (@MrSyedSami) January 26, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">🚨 BREAKING: Fortune Barisal has terminated the contract of Shoaib Malik on the suspicion of "fixing". During a recent match, Malik, who is a spinner, bowled three no balls in one over. Mizanur Rahman, the team owner of Fortune Barishal, has confirmed the news. #BPL2024 pic.twitter.com/wOh6yE6hoT
— Syed Sami (@MrSyedSami) January 26, 2024🚨 BREAKING: Fortune Barisal has terminated the contract of Shoaib Malik on the suspicion of "fixing". During a recent match, Malik, who is a spinner, bowled three no balls in one over. Mizanur Rahman, the team owner of Fortune Barishal, has confirmed the news. #BPL2024 pic.twitter.com/wOh6yE6hoT
— Syed Sami (@MrSyedSami) January 26, 2024
షోయబ్@13000: షోయబ్ రీసెంట్గా అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 13వేలకు పైగా పరుగులు చేసిన తొలి ఆసియా క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇదే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఇటీవల రాంగ్పుర్ రైడర్స్‌తో మ్యాచ్‌లో 17 పరుగులు చేసిన షోయబ్ ఈ మైలురాయి అందుకున్నాడు. ప్రస్తుతం టీ20 కెరీర్లో (అంతర్జాతీయ, డొమెస్టిక్ లీగ్‌లు) 13,010 పరుగులు చేశాడు. ఈ లిస్ట్‌లో వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ (14,562) ఒక్కడే షోయబ్ కంటే ముందున్నాడు.
మూడో పెళ్లి: షోయబ్ ఇటీవల మూడోపెళ్లి చేసుకున్నాడు. భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జాతో విడిపోయి, పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను షోయబ్ వివాహం చేసుకోవడం ఇంటర్నెట్లో చర్చనీయాంశంగా మారింది.
'వాళ్ల బంధం అప్పుడే ముగిసింది- డివోర్స్‌పై సానియా ఫ్యామిలీ క్లారిటీ'