ETV Bharat / sports

బషీర్​ వీసా ప్రాబ్లమ్​ క్లియర్- వారంలో భారత్​కు యంగ్ స్పిన్నర్ - Ind vs Eng test 2024

Receives India Visa Clearance: ఇంగ్లాండ్ యంగ్ స్పిన్నర్ షోయబ్ బషీర్​కు వీసా సమస్య క్లియర్ అయ్యింది. బషీర్​కు భారత్ వీసీ అప్రూవైనట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. అతడు వారంలోగా ఇంగ్లాండ్​ జట్టుతో కలవనున్నాడు.

Receives India Visa Clearance
Receives India Visa Clearance
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 24, 2024, 7:30 PM IST

Updated : Jan 24, 2024, 8:01 PM IST

Receives India Visa Clearance: ఇంగ్లాండ్ యంగ్ స్పిన్నర్ షోయబ్ బషీర్​కు వీసా సమస్య క్లియర్ అయ్యింది. బషీర్​కు భారత్ వీసీ అప్రూవైనట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. బషీర్ వీసా సమస్య ప్రస్తుతం ఇంటర్నెట్​లో హాట్​టాపిక్​​గా మారింది. తాజాగా వీసా అందడం వల్ల ఈ కాంట్రవర్సీకి తెర పడింది. ఇక అతడు వారంలోగా ఇంగ్లాండ్​ జట్టుతో కలవనున్నాడు. దీంతో ఈ పర్యటనలోనే బషీర్ అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. అయితే పాకిస్థాన్​ మూలాలున్న బషీర్​కు మొదట భారత్ పర్యటన వీసా అందలేదు. దీంతో అతడు యూఏఈలోని ప్రాక్టీస్ క్యాంపు నుంచి ఇంగ్లాండ్​కు రిటర్న్​ వెళ్లాడు.

అయితే బషీర్​కు వీసా అందకపోవడంపై ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్​ స్పందిచాడు. అతడికి వీసా రాకపోవడం వల్ల కాస్త నిరుత్సాహపడ్డట్లు తెలిపాడు. 'డిసెంబర్​లోనే భారత్​ పర్యటనకు వచ్చే జట్టు ప్రకటించాం. అయినా బషీర్​కు వీసా రాకపోవడం వల్ల మేం నిరుత్సాహపడ్డాం. అంతర్జాతీయ క్రికెట్​లో అరంగేట్రం చేయడానికి రెడీగా ఉన్న ప్లేయర్​కు ఇలా జరగడం బాధాకరం. ఇలా జరగడం కొత్తేం కాదు. గతంలోనూ నేను చాలా క్రికెటర్లకు వీసా సమస్యలు ఎదురయ్యాయి. తొందరగా ఈ ప్రాబ్లమ్ క్రియరై బషీర్​ మా జట్టుతో కలుస్తాడని అనుకుంటున్నా' అని స్టోక్స్ అన్నాడు.

ఇదే విషయంపై టీమ్ఇండియా కెప్టెన్​ రోహిత్ శర్మకు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్​లో ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి రోహిత్ ఇంట్రెస్టింగ్​గా బదులిచ్చాడు. 'బషీర్​కు వీసా రిజెక్ట్ అవ్వడం నిజంగా బాధాకరం. అతడు ఇంగ్లాండ్​ టీమ్​తో తొలిసారి భారత్​కు రావాలనుకున్నాడు. దురదృష్టవశాత్తు అతడికి వీసా సమస్య ఎదురైంది. ఈ విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వడానికి నేనేం వీసా ఆఫీస్​లో కూర్చోలేదు కదా. కానీ, త్వరలోనే అతడు భారత్​కు వచ్చి ఇక్కడ క్రికెట్ ఆడుతాడని భావిస్తున్నా' అని రోహిత్ అన్నాడు.

ఇంగ్లాండ్​తో తొలి రెండు టెస్టులకు భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్​మన్ గిల్, రజత్ పటిదార్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేెెఎల్ రాహుల్, కేఎస్ భరత్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, శ్రీకర్ భరత్, అవేశ్​ ఖాన్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, జస్ర్పీత్ బుమ్రా

'నేను ఆ ఆఫీస్​లో కూర్చోలేదుగా'- ఇంగ్లాండ్ ప్లేయర్ వీసా రిజెక్ట్​పై రోహిత్ రియాక్షన్

కోహ్లీకి రీప్లేస్​మెంట్​​- రేసులోకి ఆర్సీబీ ప్లేయర్​!

Last Updated : Jan 24, 2024, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.