Sheetal Devi Paralympics 2024 : పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో వివిధ వైకల్యాలు ఉన్న వాళ్లుకున్న ఎన్నో సవాళ్లను దాటి రాణిస్తున్నారు. అయితే వీళ్లందరికంటే ఆర్చర్ శీతల్ దేవి కథ, కష్టం వేరు. చేతులు లేకున్నా విలు విద్యలో సత్తా చాటి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. అసలు ఆమె ఆర్చరీ ఎలా నేర్చుకుందంటే?
ఆనందం ఆవిరి చేసిన ఆ పరిస్థితి
2007 జనవరి 10న జమ్ముకశ్మీర్‌లోని కిష్టావార్ జిల్లాలో జన్మించింది శీతల్. పుట్టగానే ఓ అరుదైన వైద్య పరిస్థితి ఫొకోమెలియా (కాళ్లు, చేతులు తదితర అవయవాలు ఎదగకపోవడం) కారణంగా ఆమె రెండు చేతులు లేకుండానే పుట్టింది. దీంతో ఆ తల్లిదండ్రుల ఆనందం ఆవిరైపోయింది. అయితే తన పరిస్థితిని చూసి కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగింది. కాళ్లతోనే చెట్లు ఎక్కి అందరినీ అబ్బురపరిచేది. ఎన్నో పనులను తనంతట తాను చేసి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది.
అవకాశం వచ్చినా సాధ్యం కాలేదు
అయితే 2021లో సైన్యం నిర్వహించిన ఓ కార్యక్రమం ఆమె జీవితాన్ని ఓ మలుపు తిప్పింది. అక్కడి సైనికులు నిర్విహించిన ఓ క్రీడాపోటీల్లో ఆమె తన ప్రతిభ చూపించింది. దీంతో అక్కడి ఆర్మీ కోచ్‌లు అభిలాష చౌదరి, కుల్‌దీప్ వాధ్వాన్‌ను ఆకట్టుకుంది. అయితే ఆమెకు ఆర్చరీలో శిక్షణ ఇద్దామని అనుకున్న సమయంలో వైద్యులు కృత్రిమ చేతులు పెట్టడం సాధ్యం కాదని చెప్పారు. ఇది కూడా ఆమెకు ఓ ఎదురుదెబ్బలా తగిలింది. కానీ ఇవన్నీ తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏమాత్రం అడ్డుకాదని నిరూపించింది.
అతడి లాగే ఆమెకూ శిక్షణ
కృతిమ చేతులు పెట్టడం సాధ్యం కాదని నిరాశ చెందుతున్న సమయంలో రెండు చేతులు లేకపోయినా 2012 పారాలింపిక్స్ ఆర్చరీలో రజతం గెలిచిన అమెరికా ఆర్చర్ మ్యాట్ స్టట్జ్‌మన్ గురించి తెలిసింది. దీంతో అక్కడి కోచ్‌లు శీతల్‌కు అలాగే ట్రైనింగ్ ఇచ్చారు. ఇక 11 నెలల కఠోర పరిశ్రమ తర్వాత గతేడాది ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో ఆమె రజతం గెలిచింది. అలా ఈ పోటీల్లో పతకం గెలిచిన చేతుల్లేని మొదటి యువతిగా శీతల్ చరిత్రకెక్కింది. ఇది కాకుండా ఆసియా పారా క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఓ రజతం నెగ్గింది. ప్రపంచ నంబర్‌వన్ మహిళా కాంపౌండ్ పారా ఆర్చర్‌గానూ ఎదిగింది.
Extraordinary courage, commitment & a never-give-up spirit are not linked to medals…#SheetalDevi, you are a beacon of inspiration for the country—and the entire world.
— anand mahindra (@anandmahindra) September 2, 2024
Almost a year ago, as a salute to your indomitable spirit, I had requested you to accept any car from our… pic.twitter.com/LDpaEOolxA