ETV Bharat / sports

'శశాంక్ పట్ల ఇలాగేనా ప్రవర్తించేది'- పంజాబ్​పై నెటిజన్లు ఫైర్! - Shashank Singh IPL 2024

Shashank Singh IPL 2024: పంజాబ్- గుజరాత్ మ్యాచ్​లో శశాంక్ సింగ్ ఇన్నింగ్స్​కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే పంజాబ్ టీమ్ సభ్యులపై కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Shashank Singh IPL
Shashank Singh IPL
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 5, 2024, 4:47 PM IST

Updated : Apr 5, 2024, 6:28 PM IST

Shashank Singh IPL 2024: 2024 ఐపీఎల్​లో తాజాగా మరో సంచలన ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. గురువారం నాటి మ్యాచ్​లో యువ ఆటగాడు శశాంక్ సింగ్ విరోచిత ఇన్నింగ్స్​తో గుజరాత్​పై పంజాబ్ నెగ్గింది. ఈ మ్యాచ్​లో యంగ్ బ్యాటర్ శశాంక్ మెరుపు హాఫ్ సెంచరీ (61 పరుగులు, 29 బంతుల్లో: 6x4, 4x6)తో మరో బంతి మిగిలుండగానే పంజాబ్​కు విజయాన్ని కట్టబెట్టాడు. అయితే ఆశల్లేని స్థితిలో ఉన్న పంజాబ్​ను తన అద్భుత బ్యాటింగ్​తో విజయ తీరాలకు చేర్చిన శశాంక్ పట్ల ఆ జట్టు ప్లేయర్లు వ్యవహరించిన తీరు నెటిజన్లకు కోపం తెప్పిస్తోంది.

200 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ పీకల్లోతూ కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన శశాంక్ బౌండరీలే లక్ష్యంగా ఆడాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా అతడు మాత్రం స్కోర్ బోర్డును ముందుకు నడింపించాడు. ఈ క్రమంలో శశాంక్ 25 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.అయితే ఆ సమయంలో పంజాబ్​ విజయానికి ఇంకా 31 పరుగులు కావాల్సి ఉన్నందున శశాంక్ తన తొలి ఐపీఎల్ ఫిఫ్టీని పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు.

కానీ, డగౌట్​లో ఉన్న పంజాబ్ ప్లేయర్లు, సిబ్బంది కూడా అతడి ఇన్నింగ్స్​ను మెచ్చుకోలేదు. ఏ మాత్రం ప్రోత్సాహం అందించకుండా, కనీసం చప్పట్లు కూడా కొట్టలేదు. టీమ్ సిబ్బంది అంతా ఎలాంటి సంబరాలు లేకుండా సైలెంట్​గా కూర్చున్నారు. దీంతో నెటిజన్లు వారి ప్రవర్తనపై మండి పడుతున్నారు. శశాంక్ 'కష్టపడి మ్యాచ్​లో పోరాడితే అతడి ఇన్నింగ్స్​కు కనీసం చప్పట్లు కూడా కొట్టరా' అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్​మన్ గిల్ (89 పరుగులు*) హాఫ్ సెంచరీతో మెరిశాడు. చివర్లో రాహుల్ తెవాటియా (23 పరుగులు 8 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్​ ఆడాడు. అనంతరం 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 7 వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలో ఛేదించింది.

'ఆ ఒక్క తప్పే జట్టు ఓటమికి కారణమైంది' - శుభ్‌మన్ గిల్ - GT VS PBKS IPL 2024

ఇంపాక్ట్​గా వచ్చాడు, క్రీజులో అదరగొట్టాడు - ఎవరీ అశుతోష్​ ? - Ashutosh Sharma PBKS

Last Updated : Apr 5, 2024, 6:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.