Shakib Al Hasan Test Record : భారత్ - బంగ్లాదేశ్ టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసేసరికి టీమ్ఇండియా 356 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ప్రస్తుతం 158- 4స్కోర్‌తో ఉంది. క్రీజులో నజ్ముల్ షాంటో (51 పరుగులు), షకీబ్ అల్ హసన్ (5 పరుగులు) ఉన్నారు. ఈ నేపథ్యంలో బంగ్లా సీనియర్ ప్లేయర్ షకీబ్ ఓ అరుదైన ఘనత సాధించాడు.
బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో దేశం తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన అతి పెద్ద వయస్కుడిగా షకీబ్ నిలిచాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్టులో 37 ఏళ్ల 181 రోజుల వయసులో షకీబ్ శనివారం మైదానంలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో మహ్మద్ రఫీక్ పేరిట ఉన్న రికార్డుని అధిగమించాడు. రఫీక్ 2008లో 37 ఏళ్ల 180 రోజుల వయసులో బంగ్లా తరఫున టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇక ఓవరాల్‌గా ఇంగ్లాండ్‌కు ప్లేయర్ విల్‌ఫ్రెడ్ రోడ్స్ 1930లో 52 ఏళ్ల 165 రోజుల వయసులో చివరి టెస్టు ఆడిన అత్యంత వృద్ధ క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు.
ఆ రికార్డూ ఊరిస్తోంది!
కాగా, సుదీర్ఘ ఫార్మాట్లో 4 వేలకుపైగా పరుగులు, 250+ వికెట్లు తీసిన 5వ ప్లేయర్‌గా నిలిచే ఛాన్స్ ఉంది. షకీబ్ ఇప్పటివరకు 71 మ్యాచ్‌ల్లో 4575 పరుగులు చేసి, 242 వికెట్లు తీశాడు. మరో 8 వికెట్లు పడగొడితే 250 మైలురాయి అందుకుంటాడు. 2007లో టెస్టు అరంగేట్రం చేసిన షకీబ్ ఒకటిన్నర దశాబ్దానికిపైగా బంగ్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో బంగ్లా సాధించిన అనేక విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే, మూడో రోజు ఆట ముగిసేసరికి 356 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. 515 పరుగుల భారీ లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన బంగ్లా మూడో రోజు ఆట ముగిసేసరికి 158-4తో నిలిచింది. స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ 3, పేసర్ జస్ప్రీత్ బుమ్రా 1 వికెట్ దక్కించుకున్నారు.
Bad light brings an end to the day's play.
— BCCI (@BCCI) September 21, 2024
Bangladesh 158/4, need 357 runs more.
See you tomorrow for Day 4 action 👋
Scorecard - https://t.co/jV4wK7BgV2#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/7JWYRHXQuY
356 రన్స్ లీడ్‌లో టీమ్ఇండియా - పోరాడుతున్న బంగ్లాదేశ్ - Ind vs Ban Test Series 2024