ETV Bharat / sports

'క్రికెట్ కోసం ఎగ్జామ్స్​ వదిలేశా- తర్వాత వరుసగా అదే పని' - Saurabh Netravalkar - SAURABH NETRAVALKAR

Saurabh Netravalkar: క్రికెట్ కోసం ఇంజినీరింగ్ పరీక్షలు వదిలేసినట్లు సౌరభ్ నేత్రావల్కర్ చెప్పాడు. దీంతో తర్వాతి సెమిస్టర్​లో వరుసగా 10 పరీక్షలు రాయాల్సి వచ్చిందని తాజాగా పేర్కొన్నాడు.

Saurabh Netravalkar
Saurabh Netravalkar (Source: Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Aug 17, 2024, 5:06 PM IST

Saurabh Netravalkar: 2024 టీ20 వరల్డ్​కప్​లో​ అమెరికాకు ప్రాతినిధ్యం వహించిన సౌరభ్ నేత్రావల్కర్ తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ టోర్నమెంట్​లో పాకిస్థాన్​పై విజయంలో కీలక పాత్ర పోషించి వెలుగులోకి వచ్చాడు. వృత్తి రిత్యా సాఫ్ట్​వేర్ ఇంజినీరైన సౌరభ్ తనకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని గతంలోనే పలుమార్లు చెప్పాడు. అలా ప్రొఫెషన్​, క్రికెట్​ను బ్యాలెన్స్ చేస్తూ ప్రశంసలు పొందుతున్నాడు.

అయితే తాను బీటెక్​లో ఉండగా క్రికెట్ కోసం సెమిస్టర్ ఎగ్జామ్స్ వదిలేసిన సందర్భాన్ని సౌరభ్ గుర్తుచేసుకున్నాడు. 2010 అండర్ 19 ప్రపంచకప్​లో టీమ్ఇండియాకు ఎంపికైన సౌరభ్, ఆ సంవత్సరం నాలుగు పరీక్షలు రాయకుండా వదిలేసినట్లు చెప్పాడు. దీంతో ఆ తర్వాతి సెమిస్టర్​లో వరుసగా 10 పరీక్షలు రాయాల్సి వచ్చిందని సౌరభ్ గుర్తుచేసుకున్నాడు.

'2010 అండర్ 19 వరల్డ్​కప్ సమయంలో నేను ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఆ వరల్డ్​కప్​కు నేను భారత్ జట్టుకు ఎంపికయ్యా. అయితే నా ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్, అండర్ 19 వరల్డ్​కప్ ఒకేసారి వచ్చాయి. దీంతో వరల్డ్​కప్ ఆడడం కోసం ఫస్ట్ సెమిస్టర్​లో ఆరింట్లో నాలుగు పరీక్షలు రాయలేదు. అయితే ఆ సంవత్సరం రెండు ఎగ్జామ్స్ రాయడం వల్ల డిటెన్షన్ నుంచి తప్పించుకున్నా. దీంతో ఆ తర్వాతి సెమిస్టర్​లో వరుసగా 10 పరీక్షలు రాయాల్సి వచ్చింది. అయితే అప్పుడు టోర్నమెంట్​లు లేనందున అన్ని ఎగ్జామ్స్ రాసేశాను. అలా అప్పట్నుంచే ఒకదానికోసం మరొకటి త్యాగం చేయడం అలవాటైంది. కానీ, నేను చదువు, క్రికెట్​ రెండింటినీ ఇష్టపడతా. ఈ రెండూ నాకు ఇష్టమే' అని సౌరభ్ తాజాగా చెప్పుకొచ్చాడు.

కాగా, నేత్రవల్కర్ ప్రస్తుతం ఆమెరికాలో సాఫ్ట్​వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అటు ప్రొఫెషన్, ఇటు ప్యాషన్ రెండింటిన బ్యాలెన్స్ చేస్తూ కెరీర్​లో రాణిస్తున్నాడు. 2024 టీ20 ప్రపంచకప్​లో పాకిస్థాన్​పైనే కాకుండా టీమ్ఇండియాతో మ్యాచ్​లోనూ సత్తా చాటాడు. ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. ఇక నేత్రవల్కర్ 2019లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 48 వన్డేల్లో 73 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో 33మ్యాచ్​ల్లో 33 వికెట్లు దక్కించుకున్నాడు.

'గేమ్​ తర్వాత ల్యాప్​టాప్​ పట్టుకుని కూర్చుంటాడు'- 'ఎంప్లాయి ఆఫ్​ ద డికేడ్' ఇతడే! - Saurabh Netravalkar Work

USA స్టార్ సౌరభ్ లవ్​ స్టోరీ- అతడి భార్య తెలుగమ్మాయా? - Saurabh Netravalkar Love Story

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.