Sanju Samson Rajasthan Royals : రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తాజాగా పంజాబ్ జట్టు ప్లేయర్ లివింగ్‌స్టోన్‌ను రనౌట్ చేసిన తీరు ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది. అతడి స్కిల్స్‌కు ఇంప్రెస్ అయిన ఫ్యాన్స్ సంజూను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే ఇతడి వికెట్ కీపింగ్ స్టైల్‌ను చూసి ధోని గుర్తొచ్చారంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే ?
రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య శనివారం (ఏప్రిల్ 13న) ఉత్కంఠ పోరు జరిగింది. అయితే ఆఖరి వరకు పోరాడినప్పటికీ పంజాబ్ జట్టు ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ ఘటన గురించి క్రికెట్ లవర్స్ తెగ చర్చించుకుంటున్నారు. పంజాబ్ ఇన్నింగ్స్ 18వ ఓవర్‌ను చాహల్ వేయగా, అందులోని ఐదో బంతిని పంజాబ్ బ్యాటర్ అషుతోష్ శర్మ డీప్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. బాల్ ఫోర్ వైపుకు దూసుకెళ్తున్న సమయంలో క్రీజులో ఉన్న వాళ్లు పరిగెట్టడం మొదలెట్టారు.
అయితే మొదటి పరుగు చేసిన తర్వాత రెండో పరుగు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో బంతి ఫీల్డర్ దగ్గరకి వెళ్లడం వల్ల అశుతోష్ శర్మ వెనక్కి తగ్గాడు. కానీ లివింగ్‌స్టోన్ మాత్రం అప్పటికే చాలా దూరం వచ్చాడు. దీంతో బాల్‌ను చూసి అతడు కూడా మళ్లీ వికెట్ల వైపుగా పరిగెత్తాడు. కానీ అంతలోనే ఫీల్డర్ విసిరిన త్రో వికెట్లకు కొంచెం దూరంలో రాగా, ఆ బంతిని వేగంగా అందుకుని సంజూ వికెట్లను చూడకుండానే బలంగా విసిరాడు. అప్పటికి లివింగ్‌స్టోన్ క్రీజును చేరకపోవడం వల్ల అతడు రనౌట్‌గా వెనుతిరిగాడు. ఇది చూసిన ఫ్యాన్స్ అచ్చం ధోనీలాగే చేశాడంటూ కామెంట్లు పెడుతున్నారు.
-
Excellent piece of fielding! 🙌
— IndianPremierLeague (@IPL) April 13, 2024
It's none other than the @rajasthanroyals skipper @IamSanjuSamson with a superb run-out to dismiss Livingstone 🎯
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱 #TATAIPL | #PBKSvRR pic.twitter.com/iCsTjauQqV
ఇక మ్యాచ్ విషయానికి వస్తే- తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు స్కోర్ చేసింది. ఓపెనర్లు అథర్వ టైడే (15 పరుగులు), జానీ బెయిర్ స్టో (15 పరుగులు) విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన ప్రభ్‌సిమ్రన్ సింగ్ (10), శామ్ కర్రన్ (6), శశాంక్ సింగ్ (9) కూడా చెప్పుకోదగ్గ స్కోర్లు నమోదు చేయలేదు.
జితేశ్ శర్మ (29 పరుగులు), లివింగ్‌స్టోన్ (21 పరుగులు) ఫర్వాలేదనిపించారు. చివర్లో అశుతోశ్ శర్మ (31 పరుగులు, 16 బంతుల్లో) రాణించడం వల్ల పంజాబ్ ఆ మాత్రమ స్కోరైనా చేయగలిగింది. ఇక రాజస్థాన్ బౌలర్లలో కేశవ్ మహారాజ్ 2, ఆవేశ్ ఖాన్ 2, ట్రెంట్ బోల్ట్, కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ దక్కించుకున్నారు.
ఈ నలుగురు మోత మోగించేస్తున్నారు! - IPL 2024 Westindies Cricketers