ETV Bharat / sports

వైఫల్యాల నుంచి విజయం వైపు - ఉప్పల్​ విధ్వంసంతో సంజూ టైమ్ వచ్చింది! - INDIA VS BANGLADESH 3RD T20

ఉప్పల్ సెంచరీతో సంజూ నయా క్రికెట్ జర్నీ- ఈ యంగ్ క్రికెటర్ టీ20 కెరీర్ ఎలా సాగిందంటే​?

India Vs Bangladesh 3rd T20
Sanju Samson (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 13, 2024, 12:05 PM IST

Sanju Samson India Vs Bangladesh 3rd T20 : టీమ్​ఇండియా బ్యాటర్ సంజు శాంసన్ చాలా ప్రతిభ ఉన్న క్రికెటర్​గా పేరుగాంచాడు. కెరీర్‌ తొలినాళ్ల నుంచి నుంచి అతడిపై ఇదే ముద్ర ఉంది. అందుకే సంజుని జట్టులోకి తీసుకోకపోవడంతో అభిమానులు ఉద్యమమే చేసేవారు. చాలా ఆలస్యంగానైనా భారత జట్టులోకి వచ్చిన శాంసన్, దొరికిన అవకాశాలను పెద్దగా సద్వినియోగం చేసుకోలేదు. ఒకటి రెండు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినా అతడి స్థాయి ఆటను ఇప్పటిదాకా చూపించలేదు. దీంతో జట్టులో సంజుకు స్థానమే ప్రశ్నార్థకమైంది.

సంజు విలయ తాండవం
తాజాగా బంగ్లాదేశ్​తో టీ20 సిరీస్​లో వచ్చిన అవకాశాన్ని సంజు వినియోగించుకున్నాడు. కుర్రాళ్లు దూసుకొస్తున్న సమయంలో, ఒత్తిడిని జయించి సంజు బ్యాట్‌ శివాలెత్తింది. హైదరాబాద్​లోని ఉప్పల్ వేదికగా విలయ తాండవం చేసింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో మూడో టీ20లో సంజు పరుగుల సునామీ సృష్టించి, తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు.

10 ఏళ్లలో 32 మ్యాచులే
2015లో జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో సంజు శాంసన్‌ భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. దాదాపు ఈ పదేళ్లలో సంజు ఆడిన మ్యాచ్‌లు కేవలం 32 మాత్రమే. అందులో కేవలం రెండు అర్ధసెంచరీలే ఉన్నాయి. సగటు మరీ దారుణంగా 20లోపే ఉంది. దీంతో అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోడన్న ముద్ర సంజుపై పడిపోయింది. అభిమానులు ఎంతగా మద్దతు ఇచ్చినా, ఒత్తిడి సమయాల్లో సంజు తేలిపోయేవాడు. కానీ కెరీరే ప్రమాదంలో పడిన స్థితిలో అతడు అద్భుతమైన ఇన్నింగ్స్‌ తో (47 బంతుల్లో 111) మళ్లీ తన విలువని చాటి చెప్పాడు. మూడో టీ20లో బంగ్లా బౌలింగ్‌ను కకావికలం చేస్తూ విధ్వంసం సృష్టించాడు.

ఒకే ఓవర్లలో 5సిక్సర్లు
నిజానికి ఐపీఎల్‌లో సంజుని మొదటి నుంచి ఫాలో అయిన వాళ్లకు ప్రస్తుతం బంగ్లాపై అతడి ప్రదర్శన పెద్దగా ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. ఎందుకంటే ఐపీఎల్‌లో ఇలాంటి మెరుపు ఇన్నింగ్స్‌లు ఎన్నో ఆడాడు సంజు. కానీ తొలిసారి అంతర్జాతీయ స్థాయిలో అదరగొట్టాడు. టీ20ల్లో మొదటి సెంచరీ సాధించాడు. రోహిత్‌శర్మ తర్వాత వేగవంతమైన (40 బంతుల్లో) శతకం చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో లెగ్‌ స్పిన్నర్‌ రిషాద్‌ హుస్సేన్‌ బౌలింగ్‌లో వరుసగా అయిదు సిక్స్‌లు బాది ఔరా అనిపించాడు.

కుర్రాళ్ల నుంచి గట్టి పోటీ
సంజు శాంసన్ ప్రదర్శన చూస్తే అంతంత మాత్రం, మరోవైపు కుర్రాళ్ల నుంచి గట్టి పోటీ! ఈ స్థితిలో చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో బంగ్లాదేశ్‌ సిరీస్‌ వచ్చింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో 10, 29 పరుగులే చేశాడు శాంసన్. ఆఖరి టీ20లో అదిరే శతకంతో విమర్శకులకు బదులిచ్చాడు. తనలో వాడి తగ్గలేదని, టాప్‌ ఆర్డర్‌లో అదరగొట్టే సత్తా ఉందని నిరూపించుకున్నాడు. సంజు సత్తా చాటడం వల్ల ఇప్పుడు సెలక్టర్లకు సవాల్ గా మారింది. గత కొన్ని సిరీస్‌లలో జట్టులో ఉన్నా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయిన అతడు ఈసారి అవకాశాన్ని అందిపుచ్చుకుని రాబోయే సిరీస్‌లలోనూ తనను తీసుకోవాల్సిన పరిస్థితిని కల్పించాడు.

ఇదే నిలకడను నిలబెట్టుకుంటాడా?
కానీ భవిష్యత్తులో జరగబోయే సిరీస్ లలో శాంసన్‌ ఇదే స్థిరత్వాన్ని ప్రదర్శించగలడా అనేది కచ్చితంగా చెప్పలేం. ఐపీఎల్‌లో మెరుపు ఇన్నింగ్స్‌ లు ఆడి, చాలాసార్లు ఇంటర్నేషనల్ మ్యాచ్ ల్లో విఫలమయ్యాడు. అయితే బంగ్లాతో టీ20లో తొలిసారి ఇంటర్నేషనల్‌ క్రికెట్లోనూ తన స్థాయిలో ఆడాడు. భవిష్యత్‌లోనూ ఇదే జోరును చూపిస్తే కచ్చితంగా సంజుకి టీ20ల్లో స్థానాన్ని పక్కా చేసుకోవచ్చు. కోహ్లీ, రోహిత్‌ లాంటి సీనియర్‌ ప్లేయర్లు పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో సంజు లాంటి సీనియర్‌ అవసరం భారత టీ20 జట్టుకు అవసరం. మరి తాజా మెరుపు ఇన్నింగ్స్‌ ఇచ్చిన కిక్‌తో శాంసన్‌ ఎలా ముందుకు సాగుతాడనేది ఆసక్తికరంగా మారింది.

'ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు'
భారత జట్టు కోసం ఆడేటప్పుడు తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని, అయితే, దానిని ఎలా తట్టుకోవాలో తనకు తెలుసని సంజు శాంసన్‌ వెల్లడించాడు. బంగ్లాదేశ్‌తో మూడో టీ20లో అద్భుత శతకం సాధించిన అనంతరం సంజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాలా మ్యాచుల్లో విఫలమైన తనకు వాటిని ఎలా డీల్‌ చేయాలో తెలుసనని వ్యాఖ్యానించాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌లోని ప్రతి క్రికెటర్‌ తన ఆనందం కోసం ఎనర్జీని ఇచ్చారని తెలిపాడు.

"ఉప్పల్‌లో నేను ఆడిన ఇన్నింగ్స్‌ నాతోపాటు జట్టులోని ప్రతి ఒక్కరికి సంతోషానిచ్చింది. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఇలాంటి వాతావరణం ఉండడం బాగుంది. గతంలో చాలాసార్లు విఫలమయ్యాను. అప్పుడు నిరుత్సాహపడేవాడిని. నా మనసును నియంత్రణలో పెట్టుకోగలను. అందుకోసం నిరంతరం శ్రమించాను. ట్రైనింగ్‌ సమయంలోనూ ఎక్కువగా ప్రాక్టీస్ చేశాను. దేశం కోసం ఆడేటప్పుడు తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అలాంటప్పుడు సత్తా ఏంటో చూపించాలనే లక్ష్యంతో ఆడతాం. " అని సంజు వ్యాఖ్యానించాడు.

'నా శైలిలో షాట్లు కొట్టాను'
బంగ్లాతో జరిగిన మూడో టీ20లో ఒక్కో బంతిని నిశితంగా గమనించి ఆడానని సంజు చెప్పుకొచ్చాడు. తనదైన శైలిలో ప్రతి షాట్‌ కొట్టానని పేర్కొన్నాడు. దీనంతటికి కారణం డ్రెస్సింగ్‌ రూమ్‌ వాతావరణంతోపాటు నాయకత్వం ఇచ్చిన స్వేచ్ఛేనని తెలిపాడు. "నీ టాలెంట్ ఏంటో అందరికీ తెలుసు. ప్రతి విషయంలో నీకు మద్దతుగా ఉంటామని మేనేజ్‌మెంట్‌ నాకు చెప్పింది. కేవలం మాటల్లోనే కాకుండా చేతల్లోనూ చూపించారు. గత సిరీస్‌లో నేను రెండు మ్యాచుల్లో డకౌట్‌ అయ్యాను. ఆ సమయంలోనూ మద్దతుగా నిలిచారు. నా కోచ్, కెప్టెన్‌ ముఖాల్లో నవ్వులు తెప్పించేందుకు ఏం చేయాలని ఆలోచించా. ఇప్పుడీ శతకంతో వారు సంతోషపడ్డారు. సెంచరీ తర్వాత ఇచ్చిన విక్టరీ పంచ్‌కు పెద్ద స్టోరీనే ఉంది. ఇప్పుడే చెప్పలేను. ఒకే ఓవర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టడం బాగుంది. గత ఏడాది నుంచి భారీషాట్లు కొట్టేందుకు తీవ్రంగా శ్రమించాను. తాజాగా సెంచరీ బాదడం ఆనందంగా ఉంది." అని శాంసన్ చెప్పుకొచ్చాడు.

సంజూ శాంసన్ ఖాతాలోకి అరుదైన ఘనత - 9 ఏళ్ల కెరీర్​లో ఇదే తొలిసారి! - Sanju First Chance in 9 Years

సంజూ శాంసన్‌ - ది సైలెంట్‌ ఫైటర్‌ - T20 world cup 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.