Sandeep Sharma IPL 2024: 30 ఏళ్ల స్టార్ పేసర్ సందీప్ శర్మ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో అదగొట్టిన వేళ ముంబయి ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సందీప్ 5 వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు. తొలుత ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ లాంటి భీకరమైన బ్యాటర్లను ఔట్ చేసిన సందీప్, చివర్లో తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, గెరాల్డ్‌ను పెవిలియన్ చేర్చాడు. ఇక ప్రస్తుత సీజన్లో రాజస్థాన్‌కు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గానూ మారాడు. అయితే ఇంతటి టాలెంటెడ్ ప్లేయర్ గతంలో ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేదని మీకు తెలుసా?
ఐపీఎల్ 2023 సీజన్ కోసం జరిగిన వేలంలో, సందీప్ శర్మ రూ.50 లక్షల కనీస ధరతో అందుబాటులో ఉన్నాడు. అయితే ఈ యంగ్ పేసర్‌ను కొనుగోలు చేయడానికి అప్పట్లో ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి కనబర్చలేదు. ఆఖరికి రాజస్థాన్ కూడా అతడిని కొనుగోలు చేయలేదు. అయితే ఆ జట్టులోని ఓ ప్లేయర్ గాయపడి పూర్తి సీజన్‌కు దూరం కావాల్సి వచ్చింది. దీంతో రాజస్థాన్ సందీప్ శర్మను జట్టులోకి తీసుకొని ఆ స్థానాన్ని రిప్లేస్ చేసుకుంది. అలా అనూహ్యంగా జట్టులోకి వచ్చిన సందీప్ ఫైనల్ 11లో కూడా స్థానం దక్కించుకున్నాడు. ఆ సీజన్లో 12 మ్యాచ్‌ల్లో 10 వికెట్లతో రాణించాడు.
ఆ సీజన్ నుంచే సందీప్ డెత్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేస్తూ జట్టుకు అవసరమైనప్పుడు వికెట్లు అందించాడు. ఇక గాయం కారణంగా ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లకూ సందీప్ దూరమయ్యాడు. దీంతో సందీప్ కెరీర్ ప్రమాదంలో పడుతుందనుకున్నారు. కానీ, తాజాగా ముంబయితో మ్యాచ్‌లో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 4.50 ఎకనమీతో 5 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. అందులో ఆఖరి ఓవర్లో 3 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీసి ముంబయిని దెబ్బకొట్టాడు. కాగా, ఐపీఎల్లో సందీప్‌కు ఇదే తొలి 5 వికెట్ల ప్రదర్శన. దీంతో సందీప్ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అంటూ పలువురు మాజీల నుంచి ప్రసంశలు అందుకుంటున్నాడు. ఈ ప్రదర్శన ఇలాగే కొనసాగిస్తే టీ20 వరల్డ్‌కప్‌నకు సందీప్ పేరునూ పరిశీలించే ఛాన్స్ ఉంది.
యశస్వి జైశ్వాల్ సూపర్ సెంచరీ - ముంబయిపై రాజస్థాన్ అద్భుత విజయం - IPL 2024 RR VS MI
IPLలో వరుస జరిమానాలు- ఈసారి ఇద్దరు కెప్టెన్లకు ఎఫెక్ట్! - IPL 2024