ETV Bharat / sports

సచిన్​ ఖాతాలో 100 సెంచరీలు- ఆ ఒక్క దేశంలో తప్ప! - సచిన్​ తెందూల్కర్​ సెంచరీ రికార్డు

Sachin Century Record : క్రికెట్‌ గాడ్​గా పేరొందిన స్టార్​ ప్లేయర్​ సచిన్‌ తెందూల్కర్‌ తన సుదీర్ఘ కెరీర్​లో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టులు, వన్డేల్లో కలిపి కొన్ని వందల సెంచరీలను బాదిన ఘనత కూడా ఉంది. అయిచే ఈ లెజండరీ క్రికెటర్​ ఒక్క దేశంలో మాత్రం సెంచరీ కొట్టలేకపోయాడు. ఆ దేశం ఏంటో, ఆ విశేషాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

Sachin Century Record
Sachin Century Record
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 24, 2024, 10:25 AM IST

Updated : Jan 24, 2024, 6:21 PM IST

Sachin Century Record: క్రికెట్‌ హిస్టరీలో తనదైన శైలిలో రికార్డులు క్రియేట్​ చేశాడు లెజండరీ బ్యాట్స్‌మన్‌ సచిన్ తెందూల్కర్​. తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్​లో సచిన్‌ పేరిట ఉన్న రికార్డులు అన్నీ ఇన్నీకావు. తన బ్యాటుతో ప్రత్యర్థి బౌలర్లను ఓ ఆట ఆడుకున్న క్రికెట్​ గాడ్​, ఫార్మాట్​ ఏదైన సరే అందులో తన మార్క్ ఉండాల్సిందే.

ఇక ఆయన సెంచరీల రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2013లో రిటైర్మెంట్‌ ప్రకటించే వరకు ఈ మాస్టర్ బ్లాస్టర్​ టెస్టుల్లో 51, అలాగే వన్డేల్లో 49 శతకాలను నమోదు చేశాడు. వివిధ దేశాల్లో క్రికెట్​ ఆడి బాల్​ను బౌండరీలు దాటించిన ఈ క్రికెట్​ గాడ్​ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తన కెరీర్​లో వివిధ దేశాల పర్యటనల్లో అక్కడి పరిస్థితులు, పిచ్​లతో సంబంధం లేకుండా తనదైన శైలిలో సెంచరీలు బాది అనేక రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. అయితే సచిన్ కెరీర్​లో సెంచరీ నమోదు చేయని ఓ దేశం ఒకటి ఉందని మీకు తెలుసా?

Sachin Centuries across the world: ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, శ్రీలంక లాంటి బలమైన జట్లను వారి సొంత మైదానాల్లోనే సెంచరీలతో హడలెత్తించిన సచిన్‌, క్రికెట్​లో పసికూన దేశమైన జింబాబ్వేలో మాత్రం ఈ ఫీట్​ను సాధించలేకపోయాడు. అయితే తక్కువ సార్లు ఆ దేశ పర్యటనకు వెళ్లడం కూడా ఒక కారణం కావచ్చు. సచిన్ కెరీర్​లో జింబాబ్వే పర్యటకు కేవలం మూడు సార్లు వెళ్లాడు. ఈ మూడు పర్యటనల్లో సచిన్‌ అక్కడ నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్​ల్లో సచిన్ ఒక్కసారి కూడా 100+ స్కోర్‌ నమోదు చేయలేకపోయాడు. ఆ దేశంలో సచిన్‌ అత్యధిక స్కోరు 74గా ఉంది. 2001లో జరిగిన మ్యాచ్‌లో 74 పరుగులు చేసిన మాస్టర్ బ్లాస్టర్​ ఆ దేశంలో మొత్తం ఏడు ఇన్సింగ్‌ ఆడి 240 పరుగులు చేశాడు. దీంతో సచిన్‌ కెరీర్‌లో సెంచరీ చేయని దేశంగా జింబాబ్వే నిలిచిపోయింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సచిన్​ వర్సెస్​ యూవీ : అన్న బౌలింగ్‌లో సిక్సర్​ బాది తమ్ముడు విజయం!

సచిన్ 'డీప్​ ఫేక్'​ వీడియో - ఆ కంపెనీ యజమానిపై కేసు

Last Updated : Jan 24, 2024, 6:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.