Sachin Amir hussain ISPL: క్రికెట్ గాడ్ సచిన్ తెందూల్కర్, కశ్మీర్‌కు చెందిన పారా క్రికెటర్ అమిర్ హుస్సెన్‌తో కలిసి క్రికెట్ ఆడాడు. బుధవారం ఐఎస్పీఎల్ (Indian Street Premier League) ప్రారంభోత్సవంలో భాగంగా సెలబ్రిటీల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ఇందులో ఖిలాడి 11 (హీరో అక్షయ్ కుమార్ టీమ్)- మాస్టర్ 11 (తెందూల్కర్ టీమ్) రెండు జట్లు తలపడ్డాయి. పారా క్రికెటర్ అమిర్ ఖాన్ ఈ మ్యాచ్‌లో తెందూల్కర్ టీమ్ తరఫున ఆడాడు.
ఈ మ్యాచ్‌లో తెందూల్కర్‌తో కలిసి అమిర్ హుస్సెన్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే అమిర్ సచిన్ పేరుతో ఉన్న జెర్సీ ధరించి ఆడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తల, భుజం సాయంతో బ్యాట్ పట్టుకొని అమిర్ ఆడిన తీరు స్టేడియంలో అందర్నీ ఆకర్షించింది. అతడు 5 బంతుల్లో 3 పరుగులు చేసి క్యాచౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఔటైన తర్వాత డగౌట్‌కు వెళ్తుండగా ప్లేయర్లకు, ఆడియెన్స్‌కు అభివాదం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమిర్ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడంటూ అతడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ టోర్నీ మార్చి 06 నుంచి 15 దాకా జరగనుంది. ఈ టోర్నీలో 6 జట్ల మధ్య 18 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో హైదరాబాద్ ఫాల్కన్ రైడర్స్, బెంగళూరు స్ట్రైకర్స్, చెన్నై సింగమ్స్, మాజ్హి ముంబయి, శ్రీనగర్ కీ వీర్, టైగర్స్ ఆఫ్ కోల్‌కతా జట్లు టోర్నీలో ఆడనున్నాయి. గల్లీ ప్లేయర్లను ప్రొత్సహించడానికి ఈ టోర్నీ నిర్వహణ జరుగుతోంది.
ఈ టోర్నీలో ప్రతి మ్యాచ్‌ను టీ10 ఫార్మాట్లో నిర్వహిస్తారు. ఇది టెన్నిస్ బాల్ టోర్నమెంట్. జట్టులో ఉండే 11 మందిలో ఒక్కరైనా అండర్-19 ఏజ్ గ్రూప్ ప్లేయర్ ఉండాలనేది ఐఎస్పీఎల్ నిబంధన. కాగా, హైదరాబాద్ జట్టుకు స్టార్ హీరో రామ్‌చరణ్ తేజ్, బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్ (శ్రీ నగర్), అమితాబ్ బచ్చన్ (ముంబయి), హృతిక్ రోషన్ (బెంగళూరు), సూర్య (చెన్నై) జట్లకు యజమానులుగా వ్యవహరిస్తున్నారు.
'అమీర్ రియల్ హీరో'- పారా క్రికెటర్‌పై సచిన్ ప్రశంసలు
తెలుగు కుర్రాళ్లకు గోల్డెన్ ఛాన్స్- చరణ్ క్రికెట్ టీమ్‌లోకి ఆహ్వానం- రిజిస్టర్ చేసుకోండిలా!