ETV Bharat / sports

కథక్ వదిలి క్రికెటర్​గా - రుతురాజ్ వైఫ్​ ఆసక్తికర జర్నీ! - Ruturaj Gaikwad Wife - RUTURAJ GAIKWAD WIFE

Ruturaj Gaikwad Wife : ఒకరేమో ఐపీఎల్ స్టార్, మరొకరేమో రంజీ క్వీన్​. ఈ ఇద్దరూ బ్యాట్​ పట్టుకుని దిగారంటే ఇక ప్రత్యర్థులకు హడలే. తమ ఆట తీరుతో క్రికెట్​లో రాణిస్తున్నారు ఈ యంగ్ కపుల్ రుతురాజ్, ఉత్కర్ష. అయితే రుతురాజ్​ బెటర్ హాఫ్​ అయిన ఉత్కర్ష ఈ క్రికెట్ ఫీల్డ్​లోకి ఎలా వచ్చిందంటే ?

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 10, 2024, 12:07 PM IST

Ruturaj Gaikwad Wife : ఓ వైపు చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు జట్టులోని ప్లేయర్​గానూ సత్తా చాటుతున్నాడు యంగ్ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్. ఈ సీజన్​కు కెప్టెన్​గా వ్యవహరిస్తున్న అతడు, ఆడిన ప్రతి మ్యాచ్​లోనూ మంచి స్కోర్ సాధిస్తూ జట్టుకు అండగా నిలిచాడు. ఇటీవలే కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో ఓపెనర్​గా బరిలోకి దిగి అజేయ స్కోర్​ను సాధించాడు రుతురాజ్​. 58 బంతుల్లో 67 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇలా సక్సెస్​ఫుల్​గా జట్టును లీడ్ చేస్తున్న ఈ స్టార్ క్రికెటర్​ లాగే తన ఫ్యామిలీలో మరో క్రికెటర్ ఉన్నారు. ఆమె రుతురాజ్ సతీమణి ఉత్కర్ష పవార్.

పుణెలో జన్మించిన ఈమె 11 ఏళ్ల వ‌య‌సు నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకుంది. టీమ్​ఇండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ బౌలింగ్ అంతే ఆమెకు ఎంతో ఇష్టమట. దీంతో ఆయనలా అవ్వాలని అనుకున్న ఉత్కర్ష, తండ్రిని ఒప్పించి కోచ్ అన్వర్ షేక్​ వద్ద శిక్షణ తీసుకోవడం మొదలెట్టింది. అప్పటి నుంచి ఆమె పేస్ బౌల‌ర్​గా తనను తాను మెరుగుపరుచుకుంటూ రాణిస్తోంది. అయితే చిన్నప్పుడు ఆమెకు క్రికెట్​తో పాటు కథక్​ కూడా ఇష్టముందేదట. కానీ ఆమె అనూహ్యంగా క్రికెట్​లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇక ఉత్క‌ర్ష మ‌హ‌రాష్ట్ర మ‌హిళా క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది. దేశవాళీలో ఆమె 10 మ్యాచ్‌లు ఆడి 5 వికెట్లు ప‌డ‌గొట్టింది. ప్ర‌స్తుతం పుణెలోని న్యూట్రిష‌న్, ఫిట్‌నెస్ సైన్స్ ఇనిస్టిట్యూట్‌లో చదువుకుంటోంది. అయితే ఉన్నత చదువుల కోసం క్రికెట్‌కు విరామం తీసుకొంది. ఈ నేపథ్యంలో గ‌త 18 నెల‌లుగా ఉత్కర్ష పవార్ క్రికెట్‌కు దూరంగా ఉంటోంది.

రుతురాజ్, ఉత్క‌ర్ష రెండేళ్లుగా ప్రేమ‌లో ఉన్నారు. అయితే.. ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. వీళ్ల ప్రేమ విషయం తెలిసిన ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీక‌రించాయి. దీంతో బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ ఇద్దరూ 2023, జూన్ 3వ తేదీన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లికి ముందు ఐపీఎల్​లో పలు మ్యాచుల్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది ఉత్కర్ష. ఆ సీజన్ ఫైనల్స్​లో చెన్నై జట్టు విజయం సాధించాక ఈ ఇద్దరూ కప్​ పట్టుకుని ఫొటోలు కూడా దిగారు. ఆ తర్వాత ధోనీతోనూ ఫొటో దిగారు.

గైక్వాడ్- సయాలీ లవ్!.. క్లారిటీ ఇచ్చిన నటి.. ఏమందంటే?

పెళ్లి తర్వాత ఫస్ట్​ మ్యాచ్‌.. 22 బంతుల్లోనే రుతురాజ్​​ హాఫ్ సెంచరీ.. 5 సిక్సులతో బీభత్సం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.