ETV Bharat / sports

6 బంతుల్లో 10 పరుగులు​ - చెన్నై కెప్టెన్​కు వైఫ్​ సూపర్​ ఛాలెంజ్ - IPL 2024 - IPL 2024

Ruturaj Gaikwad Wife Challenge : స్టార్ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్​కు అతడి సతీమణి ఉత్కర్ష ఓ ఛాలెంజ్ విసిరింది. అదేంటంటే ?

Ruturaj Gaikwad Wife Challenge
Ruturaj Gaikwad Wife Challenge
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 19, 2024, 4:21 PM IST

Ruturaj Gaikwad Wife Challenge : చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన ఆటతీరుతో అభిమానులను అబ్బురపరుస్తాడు. ఓ వైపు సారథ్య బాధ్యతలు వహిస్తూనే మరోవైపు క్రికెటర్​గానూ తన సత్తా చాటుతున్నాడు. 2021లో ఐపీఎల్​లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ క్రికెటర్, అప్పటి నుంచి ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్​ ఆడుతూ చెన్నై జట్టులో కీలక పాత్ర పోషించాడు. దాదాపు మూడేళ్ల పాటు అతడి ఆటతీరును గమనించిన ఫ్రాంచైజీ చెన్నై పగ్గాలను రుతురాజ్​కు అందజేసింది. దీంతో ఇప్పుడు తన నయా రోల్​లోనూ ఈ యంగ్ ప్లేయర్​ అదరగొడుతున్నాడు.

ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచుల్లోనూ మంచి స్కోర్ సాధించి సత్తా చాటుతున్నాడు. నేడు (ఏప్రిల్ 19న) లఖ్​నవూ సూపర్ జెయింట్స్​తో జరగనున్న మ్యాచ్ కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. అయితే ఈ స్టార్​కు మరో స్టార్ క్రికెటర్ తాజాగా ఛాలెంజ్ విసిరారు. ఆమెవరో కాదు అతడి భార్య ఉత్కర్ష గైక్వాడ్.

చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సూపర్ కపుల్ పేరుతో ఓ వీడియెను అప్​లోడ్ చేసింది. అందులో ఈ జంట బ్యాట్, బాల్ పట్టుకుని నెట్స్​లోకి వస్తారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఓ క్యూట్ సంభాషణ జరిగింది.

"మా ఇద్దరిలో ఉన్న కామన్ పాయింట్ క్రికెటే. అందుకే నేను ఓ ఛాలెంజ్ విసురుతాను. నేను ఆరు బంతుల్లో 36 పరుగులు చేస్తాను." అంటూ రుతురాజ్ నవ్వుతాడు. దానికి ఉత్కర్ష కూడా అతడికి ఛాలెంజ్ విసురుతుంది. 6 బాల్స్​కు 10 రన్స్ స్కోర్ చేసి చూపించు అంటూ అడుగుతుంది. దానికి తను కూడా ఓకే చెప్తాడు. ఎంతో క్యూట్​గా ఉన్న ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. దీన్ని చూసిన అభిమనులు, 'క్యూట్ వీడియో' 'కపుల్ గోల్స్​' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

రుతురాజ్, ఉత్క‌ర్ష రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఇరు కుటుంబాలు అంగీకారంతో 2023, జూన్ 3వ తేదీన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లికి ముందు ఐపీఎల్​లో పలు మ్యాచుల్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది ఉత్కర్ష. ఆ సీజన్ ఫైనల్స్​లో చెన్నై జట్టు విజయం సాధించాక ఈ ఇద్దరూ కప్​ పట్టుకుని ఫొటోలు కూడా దిగారు. ఆ తర్వాత ధోనీతోనూ ఫొటో దిగారు.

ఏడాదికి రూ.7కోట్లపైనే- చెన్నై కొత్త కెప్టెన్ రుతురాజ్​ నెట్‌వర్త్ ఎంతో తెలుసా? - Ruturaj Gaikwad Net Worth

కథక్ వదిలి క్రికెటర్​గా - రుతురాజ్ వైఫ్​ ఆసక్తికర జర్నీ! - Ruturaj Gaikwad Wife

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.