ETV Bharat / sports

విరాట్​ ముంగిట మరో రికార్డ్- ఏకైక ప్లేయర్​గా నిలిచే ఛాన్స్! - IPL 2024 - IPL 2024

Virat Kohli IPL Records: 2024 ఐపీఎల్​లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. ప్రస్తుత సీజన్​లో ఫుల్​ఫామ్​లో ఉన్న విరాట్​ను మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది. అదేంటంటే?

Virat Kohli IPL Records
Virat Kohli IPL Records (Source: ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 4, 2024, 4:29 PM IST

Updated : May 4, 2024, 4:56 PM IST

Virat Kohli IPL Records: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ ప్రస్తుత ఐపీఎల్​లో అదరగొడుతున్నాడు. ఆర్సీబీ ఫలితాలు ఏవైనప్పటికీ విరాట్ ప్రదర్శన మాత్రం అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ప్రస్తుత సీజన్​లో 500 పరుగులు బాది సీజన్​లో టాప్- 2లో కొనసాగుతున్నాడు. అందులో ఓ సెంచరీ కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఫుల్​ ఫామ్​లో విరాట్​ను మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది. అదేంటంటే?

ఐపీఎల్ సీజన్​- 17లో శనివారం (మే 4) ఆర్సీబీ, గుజరాత్​ టైటాన్స్​తో తలపడనుంది. ఈ మ్యాచ్​కు చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది. అయితే విరాట్ ఐపీఎల్​ కెరీర్​లో ఇప్పటివరకు చిన్నస్వామి స్టేడియంలో 83 ఇన్నింగ్స్​లో 40.61 సగటుతో 2924 పరుగులు చేశాడు. మరో 76 పరుగులు సాధిస్తే, ఐపీఎల్​లో ఒకే వేదికగా 3000 పరుగులు పూర్తి చేసిన ఏకైక ప్లేయర్​గా రికార్డు సృష్టిస్తాడు. ఒకవేళ ఈ మ్యాచ్​లో కాకపోయినా, ప్రస్తుత సీజన్​లో ఆర్సీబీ మరో రెండు మ్యాచ్​లు చిన్నస్వామిలోనే ఆడాల్సి ఉంది. అంటే ఈ సీజన్​లోనే విరాట్ ఈ ఘనత సాధించడం ఖాయం! ఇక ఈ లిస్ట్​లో ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ వాంఖడే స్టేడియంలో ఇప్పటివరకు 77 ఇన్నింగ్స్​ల్లో 2223 పరుగులు చేశాడు.

ఐపీఎల్​లో ఓకే గ్రౌండ్​లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు

  • విరాట్ కోహ్లీ - చిన్నస్వామి స్టేడియం- 2924 పరుగులు
  • రోహిత్ శర్మ- వాంఖడే స్టేడియం- 2223 పరుగులు
  • ఏబీ డివిలియర్స్- చిన్నస్వామి స్టేడియం- 1960 పరుగులు
  • డేవిడ్ వార్నర్- రాజీవ్ గాంధీ స్టేడియం (ఉప్పల్, హైదరాబాద్)- 1623 పరుగులు
  • క్రిస్ గేల్- చిన్నస్వామి స్టేడియం- 1561 పరుగులు

RCB IPL 2024: ఇక ప్రస్తుత సీజన్​లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఆశించిన మేర ఆకట్టుకోలేకపోయింది. ఈ సీజన్​లో ఇప్పటివరకు 10మ్యాచ్​ల్లో ఆర్సీబీ మూడింట్లో నెగ్గి, 7 పరాజయాలు చవిచూసింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. దీంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్​కు అవకాశాలు దాదాపు లేనట్లే! ఇకపై ఆడనున్న నాలుగు మ్యాచ్​ల్లోనూ నెగ్గినా, ఆర్సీబీ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

గ్రాండ్​గా అనుష్క బర్త్​డే సెలబ్రేషన్స్ - మ్యాక్సీ, ఫాఫ్​ సందడి - Anushka Sharma Birthday Party

ఫీల్డ్​ అంపైర్​తో గొడవ - కోహ్లీకి గట్టి షాకిచ్చిన ఐపీఎల్ బాసులు! - IPL 2024 RCB VS KKR

Last Updated : May 4, 2024, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.