Rohith Sharma Captaincy Mumbai Indians : కెప్టెన్సీ మార్పు నిర్ణయంపై ముంబయి ఇండియన్స్ క్లారిటీ ఇచ్చింది. జట్టుకు ఐదు టైటిళ్లను అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యను సారథిగా నియమించడంపై కోచ్ మార్క్ బోచర్ మాట్లాడాడు. ఈ మార్పు వెనుక అసలు కారణాన్ని తెలిపాడు. "ఇది పూర్తిగా ఆటపరంగా తీసుకున్న నిర్ణయమే. నా వరకు ఇదో పరివర్తన దశ. చాలా మందికి ఈ విషయం అర్థంగాక, ఎమోషనల్ అయ్యారు. కానీ, ఆటకు సంబంధించిన విషయాల్లో ఎమోషన్స్‌ను పక్కన పెట్టాలి. ఓ ఆటగాడిగా హిట్ మ్యాన్ నుంచి మరింత అత్యుత్తమ ప్రదర్శన చూసేందుకు ఈ నిర్ణయం మేలు చేస్తుంది. అతడు మరింత స్వేచ్ఛతో ఆడి మంచి పరుగులు సాధించనివ్వండి" అని పేర్కొన్నాడు.
ఐపీఎల్‌లో క్రికెటేతర బాధ్యతలు కూడా ఈ కెప్టెన్సీ మార్పునకు ఇంకో కారణమని మార్క్ అన్నాడు. "గత రెండు సీజన్లలో రోహిత్ బ్యాట్‌తో సరైన ప్రదర్శన చేయలేకపోయాడు. అందుకే అతడిపై భారాన్ని తగ్గించాలనుకున్నాం. లీగ్ టోర్నీలో సారథికి ఆట మాత్రమే కాకుండా చాలా బాధ్యతలుంటాయి. ఫొటోషూట్స్, ప్రకటనల వంటివి కూడా అతడే చూసుకోవాలి" అని మార్క్ చెప్పుకొచ్చాడు.
Ritika Sajedh Latest Comments : మరోవైపు ఇదే విషయంపై తాజాగా రోహిత్ శర్మ సతీమణి రితికా కూడా స్పందించారు. ఈ పోడ్కాస్ట్ వీడియోపై ఆమె కామెంట్ చేశారు. ఇందులో చాలా విషయాలు తప్పులు ఉన్నాయంటూ ఆమె పేర్కొన్నారు. అయితే ఈ కామెంట్ పై పలువురు నెటిజన్లు పాజిటివ్‌గా స్పందించారు. రితికాకు మద్దతు తెలుపుతూ వారు కూడా కామెంట్లు పెట్టారు.
Mumbai Indians Trophy Record : ఐపీఎల్ టోర్నీలో ముంబయి ఇండియన్స్ విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలవడం వెనక ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కృషి ఎంతో ఉంది. ఓవైపు కెప్టెన్‌గా రాణిస్తూనే మరోవైపు ప్లేయర్‌గానూ కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. ఇప్పటి వరకు ఆ జట్టుకు ఏకంగా ఐదు టైటిళ్లు అందించాడు. 2013, 2015, 2017, 2019తో పాటు 2020లో ముంబయి జట్టు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.
మ్యాచ్ మధ్యలో రోహిత్ కాళ్లు మొక్కిన కోహ్లీ అభిమాని!
'నేను ఆ ఆఫీస్‌లో కూర్చోలేదుగా'- ఇంగ్లాండ్ ప్లేయర్ వీసా రిజెక్ట్‌పై రోహిత్ రియాక్షన్