ETV Bharat / sports

లేడీఫ్యాన్​కు రోహిత్ బర్త్ డే విషెస్!- రోడ్డుపై కార్ ఆపి మరీ! - ROHIT WISHES FAN GIRL

Rohit Wishes Fan Girl : టీమ్ఇండియా కెప్టెన్ తన ఫ్యాన్​కు బర్త్​డే విషెస్ తెలిపాడు.​

ROhit Sharma
ROhit Sharma (Source: Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 9, 2024, 12:18 PM IST

Updated : Oct 9, 2024, 12:46 PM IST

Rohit Wishes Fan Girl : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ రీసెంట్​గా బంగ్లాదేశ్​తో టెస్టు సిరీస్​ క్లీన్​స్వీప్ తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్నాడు. త్వరలో న్యూజిలాండ్​తో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్​కు సన్నద్ధం అవుతున్నాడు. గ్యాప్​లో ఉన్న సమయాన్ని రోహిత్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో తన ఖరీదైన కారుతో ముంబయి రోడ్లపై చక్కర్లు కొట్టాడు.

అయితే ఓ అభిమాని కోసం రోహిత్ తన కారును రోడ్డుపై ఆపాడు. ఆ అభిమానితో ఫొటో దిగాడు. ఈ క్రమంలో ఆ అభిమాని పుట్టినరోజు అని పక్కనున్నవారు చెప్పడంతో ఆమెకు రోహిత్ షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ బర్త్​ డే విషెస్ చెప్పాడు. దీంతో ఆ అమ్మాయి ఆనందాని అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

కాగా, ప్రస్తుతం టీమ్ఇండియా బంగ్లాదేశ్​తో టీ20 సిరీస్​ ఆడుతోంది. ఈ సిరీస్​లో తొలి మ్యాచ్​లో నెగ్గిన భారత్, సిరీస్​పై కన్నేసింది. బుధవారం న్యూ దిల్లీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇక సిరీస్​లో ఆఖరి మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో అక్టోబర్ 12న జరగాల్సి ఉంది.

అక్టోబర్​లో న్యూజిలాండ్, భారత్ పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో కివీస్ మూడు మ్యాచ్​ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్​కు కివీస్ జట్టును న్యూజిలాండ్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది. టామ్ లేథమ్ సారథ్యంలో కివీస్, టీమ్ఇండియాతో తలపడనుంది. ఇక భారత్ జట్టును కూడా బీసీసీఐ త్వరలోనే ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ సిరీస్ 16న ప్రారంభం కానుంది.

న్యూజిలాండ్ జట్టు : టామ్‌ లేథమ్ (కెప్టెన్), టామ్‌ బ్లండల్ (వికెట్ కీపర్), మైకెల్ బ్రాస్‌వెల్ (తొలి టెస్టుకు), మార్క్‌ చాప్‌మన్, డేవన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, విల్ ఓ రూర్కీ, అజాజ్ పటేల్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, బీన్ సీర్స్, ఐష్ సోధి (2, 3 టెస్టులకు), టిమ్‌ సౌథీ, కేన్ విలియమ్సన్, విల్ యంగ్

బంగ్లాతో రెండో టీ20 - అతడు రెచ్చిపోతే గెలుపు మనదే!

మయాంక్, నితీశ్ లక్కీ ఛాన్స్! టీ20 దెబ్బకు మిలియన్ డాలర్ల క్లబ్​లోకి!

Last Updated : Oct 9, 2024, 12:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.