ETV Bharat / sports

రోహిత్, ధోనీ ఇద్దరిలో బెస్ట్ కెప్టెన్ ఎవరు? దూబే తెలివైన ఆన్సార్ - Dube Favourite Captain - DUBE FAVOURITE CAPTAIN

Shivam Dube Favourite Captain : రోహిత్- ధోనీ ఇద్దరిలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అన్న ప్రశ్నకు ఆల్​రౌండర్ దూబే తెలివిగా సమాధానం ఇచ్చాడు.

Shivam Dube Favourite Captain
Shivam Dube Favourite Captain (Source: Getty Images (Dube), Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 6, 2024, 9:57 AM IST

Updated : Oct 6, 2024, 12:03 PM IST

Shivam Dube Favourite Captain : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ- మాజీ సారథి ఎమ్ఎస్ ​ధోనీ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అని పలుమార్లు చర్చకు వస్తోంది. తాజాగా ఇదే ప్రశ్న యంగ్ ఆల్​రౌండర్ శివమ్ దూబేకు ఎదురైంది. రోహిత్​తోపాటు ఓ కామెడీ టాక్ షో లో పాల్గొన్న దూబేకు ఎవరు బెస్ట్ కెప్టెన్ అని అడగ్గా, అతడు తెలివైన సమాధానం ఇచ్చి శభాష్ అనిపించుకున్నాడు. ఇంతకీ దూబే ఏమన్నాడంటే?

'శివమ్ నువ్వు ఐపీఎల్​లో ధోనీ కెప్టెన్సీలో, టీమ్ఇండియాలో రోహిత్ సారథ్యంలో ఆడావు. ఈ ఇద్దరిలో నీకు ఎవరు బెస్ట్ అనిపిస్తారు' అని హోస్ట్ దూబేను అడిగాడు. దీనికి దుబే తెలివిగా సమాధానం చెప్పాడు. 'నేను చెన్నైలో ఆడినప్పుడు ధోనీ బెస్ట్, టీమ్ఇండియాకు ఆడినప్పుడు రోహిత్ ఉత్తమం' అని స్మార్ట్ ఆన్సర్ ఇచ్చాడు. దీనికి రోహిత్ కూడా సూపర్ అంటూ దూబే టాలెంట్​ను మెచ్చుకున్నాడు. 'టాక్ షో లకు వచ్చే రెండు, మూడు రోజుల ముందు ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ప్రాక్టీస్ చేసి వస్తావా?' అని దూబేను రోహిత్ సరదాగా ఆటపట్టించాడు.

కాగా, బంగ్లాతో టీ20 సిరీస్​కు ఎంపికైన దూబే వెన్నునొప్పి కారణంగా దూరమయ్యాడు. అతడి స్థానంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ రానున్నట్లు బీసీసీఐ శనివారం ప్రకటించింది. ఈ సిరీస్ ఆక్టోబర్ 06ను ప్రారంభం కానుంది. గ్వాలియర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

షెడ్యూల్

తొలి టీ20అక్టోబర్ 06గ్వాలియర్
రెండో టీ20అక్టోబర్ 09న్యూ దిల్లీ
మూడో టీ20అక్టోబర్ 12హైదరాబాద్

భారత్ జట్టు : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రానా, మయాంక్ యాదవ్

బంగ్లా జట్టు: నజ్ముల్ హొస్సేన్ షాంటో (కెప్టెన్), తాంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, లిట్టన్ కుమార్ దాస్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, మెహదీ హసన్, రిషద్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మద్, తస్రీకిన్ అహ్మద్, తస్రీకిన్ అహ్మద్ , రకీబుల్ హసన్

భారత్ X బంగ్లాదేశ్ T20 సిరీస్ - కుర్రాళ్లు కొట్టెస్తారా? - Ind vs Ban 1st T20

బంగ్లాతో సిరీస్​కు దూబే దూరం- తిలక్​కు లక్కీ ఛాన్స్ - Shivam Dube Ruled Out

Last Updated : Oct 6, 2024, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.