Rohit Sharma On Visa Issue: స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా జనవరి 25న హైదరాబాద్ ఉప్పల్ వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరుజట్ల ప్లేయర్లు హైదరాబాద్ చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అయితే వీసా కారణాల దృష్యా ఇంగ్లాండ్ యంగ్ ప్లేయర్ షోయబ్ బషీర్ (Shoaib Bashir) భారత్‌కు రాలేకపోయాడు. దీనిపై ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ విచారం వ్యక్తం చేశాడు. కెరీర్ ప్రారంభంలోనే బషీర్‌కు ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం బాధాకరం అని అన్నాడు. అయితే బుధవారం ప్రెస్ కాన్ఫరెన్స్ (Press Conference) లో పాల్గొన్న కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ విషయంపై మీడియా నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి రోహిత్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
'బషీర్‌కు అలా జరగడం నిజంగా బాధాకరం. అతడు ఇంగ్లాండ్ టీమ్‌తో తొలిసారి భారత్‌కు రావాలనుకున్నాడు. అది అందరికీ సాధ్యం కాదు. ఈ విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వడానికి నేనేం వీసా ఆఫీస్‌లో కూర్చోలేదు కదా. కానీ, త్వరలోనే అతడు భారత్‌కు వచ్చి ఇక్కడ క్రికెట్ ఆడుతాడని భావిస్తున్నా' అని రోహిత్ అన్నాడు.
-
Rohit Sharma on Shoaib Bashir visa issue. "I feel for Shoaib Bashir, but unfortunately he was born in Pakistan and I don't sit in the visa office to grant him the visas".#INDvsENG #CricketTwitter pic.twitter.com/PZkFgcXYDr
— Zunx (@Zunx11) January 24, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Rohit Sharma on Shoaib Bashir visa issue. "I feel for Shoaib Bashir, but unfortunately he was born in Pakistan and I don't sit in the visa office to grant him the visas".#INDvsENG #CricketTwitter pic.twitter.com/PZkFgcXYDr
— Zunx (@Zunx11) January 24, 2024Rohit Sharma on Shoaib Bashir visa issue. "I feel for Shoaib Bashir, but unfortunately he was born in Pakistan and I don't sit in the visa office to grant him the visas".#INDvsENG #CricketTwitter pic.twitter.com/PZkFgcXYDr
— Zunx (@Zunx11) January 24, 2024
అయితే బషీర్‌కు పాకిస్థాన్ మూలాలు ఉండటం కారణంగా వీసా సమస్యలు ఎదురైనట్లు తెలుస్తోంది. దీనిపై ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ కూడా సంబంధింత శాఖతో మాట్లాడాడట. కానీ, దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక 20 ఏళ్ల బషీర్ తొలిసారి ఇంగ్లాండ్ జాతీయ టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. కెరీర్లో ఆడిన 6 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో బషీర్ 10 వికెట్లు పడగొట్టాడు.
ఇదే ప్రెస్మీట్లో ఇంగ్లాండ్ బజ్‌బాల్ వ్యూహం (దూకుడుగా ఆడే విధానం)పై కూడా రోహిత్ మాట్లాడాడు.'గతేడాదిగా మా ప్లేయర్లు అద్భుతంగా ఆడుతున్నారు. ప్రత్యర్థులు ఎలా ఆడతారనేది మాకు అనవసరం. గ్రౌండ్లో మా ప్రదర్శన ఎలా ఉందనేదే పాయింట్. టెస్టుల్లో ఆడడం ఎప్పుడూ ఛాలెంజింగ్‌గానే ఉంటుంది. ఇంగ్లాండ్‌పై సిరీస్ గెలుస్తామనే నమ్మకం నాలో ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విరాట్ అందుబాటులో లేకపోవడం జట్టుకు లోటు. స్పిన్నర్ల ఎంపిక కాస్త ఇబ్బందిగా మారింది' అని రోహిత్ అన్నాడు.
కోహ్లీకి రీప్లేస్మెంట్- రేసులోకి ఆర్సీబీ ప్లేయర్!
ఫీల్డింగ్ మేళవింపుల్లో కొత్త ప్రయోగాలు - ఇదే టెస్ట్ క్రికెట్ నయా సక్సెస్ మంత్ర!