Rohit Sharma Mother: టీ20 వరల్డ్‌కప్ ఛాంపియన్స్ 'విక్టరీ పరేడ్'లో అపురూప సంఘటన జరిగింది. టీమ్ఇండియా సన్మాన కార్యక్రమాన్ని చూసేందుకు వాంఖడే స్టేడియానికి వచ్చిన తన తల్లిదండ్రులను కెప్టెన్ రోహిత్ శర్మ ర్యాలీ అనంతరం కలిశాడు. టీమ్ఇండియాను ప్రపంచ విజేతగా నిలిపిన తన కుమారుడు రోహిత్‌ను చూడగానే తల్లి పూర్ణిమ భావోగ్వేగానికి లోనయ్యారు.
రోహిత్‌ను దగ్గరగా తీసుకొని అతడిని ముద్దాడారు. అయితే గురువారం ఆమె డాక్టర్ వద్దకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ తన కుమారుడిని చూసేందుకు వాంఖడేకు వచ్చినట్లు పూర్ణిమ చెప్పారు. కాగా, అక్కడున్న వారందరినీ ఈ దృశ్యం ఎంతగానో ఆకట్టుకుంది. అక్కడ వాతావరణం ఒక్కసారిగా ఎమోషనల్‌గా మారిపోయింది. ఈ నేపథ్యంలో రోహత్ తల్లి మాట్లాడారు.
'ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అనుకోలేదు. వరల్డ్‌కప్‌కు వెళ్లే ముందు రోహిత్ నన్ను కలవానికి వచ్చాడు. ఈ ప్రపంచకప్ తర్వాత టీ20ల నుంచి తప్పుకుంటానన్నాడు. దీంతో ఎలాగైనా ఇది గెలవాలని అన్నాను. ఈరోజు నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఇలాంటి వాతావరణాన్ని ఎప్పుడూ చూడలేదు. తన సక్సెస్‌కు కారణం అతడి హార్డ్‌వర్క్, డెడికేషన్. వాటి వల్లే రోహిత్‌కు ఇంత ఆదరణ వస్తోంది. ఒక తల్లిగా నేను గర్విస్తున్నా. నా లైఫ్‌లో ఇలాంటి రోజు మళ్లీ రాదు. ఇవి భావోద్వేగ క్షణాలు. నేను కాస్త అనారోగ్యంగా ఉన్నాను. ఇవాళ నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. అయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ఇక్కడికి వచ్చాను' అని హిట్‌మ్యాన్ తల్లి పేర్కొన్నారు.
Goosebumps the mother's love.🥹❤️
— Sanjana Ganesan 🇮🇳 (@iSanjanaGanesan) July 4, 2024
Such a cute moment between Captain Rohit Sharma and his mother. #VictoryParade #Mumbai pic.twitter.com/6kmVnl0om2
గ్రాండ్ వెల్కమ్: వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఎక్కడకు వెళ్లినా ఘన స్వాగతం లభించింది. ఈ క్రమంలో వాంఖడేలో సన్మాన కార్యక్రమం పూర్తైన తర్వాత ముంబయిలోని తన నివాసానికి చేరుకున్న రోహిత్‌కు గ్రాండ్ వెల్కమ్ దక్కింది. రోహిత్ కుటుంబ సభ్యులు, తన చిన్ననాటి స్నేహితులు అతడికి సర్ప్రైజ్ ఇచ్చారు. కర్మ, శర్మ అని రాసి ఉన్న టీ షర్టులు ధరిచి రోహిత్‌కు ఇంట్లోకి అహ్వానం పలికారు. సెల్యూట్ కొడుతూ హిట్‌మ్యాన్‌ను ఎత్తుకున్నారు. ఇందులో హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ కూడా పాల్గొన్నాడు.
HERO WELCOME FOR CAPTAIN ROHIT. 🐐
— Johns. (@CricCrazyJohns) July 5, 2024
- Family, Childhood friends, Tilak giving a memorable welcome for Ro as he returns to home. ❤️🥺pic.twitter.com/dQz4dc8x0p
డ్రమ్ బీట్‌కు అదిరే స్టెప్పులు- రోడ్డుపై రోహిత్ డ్యాన్స్- వీడియో చూశారా? - T20 World Cup 2024
టీమ్ఇండియా 'రోడ్ షో' బస్సు రెడీ- వీడియో వైరల్- డిజైన్ అదిరిపోయిందిగా! - T20 World Cup 2024